చండీగఢ్: హిందూ వివాహ చట్టం ప్రకారం తోబుట్టుల మధ్య వివాహం చట్ట విరుద్దమని పంజాబ్ హర్యానా హైకోర్టు కోర్టు స్పష్టం చేసింది. పిటిషన్‌లో అమ్మాయి మేజర్ అని తెలిపినప్పటికీ ఇది న్యాయ సమ్మతం కాదని కేసును విచారించిన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన పిటిషనర్ తనపై నమోదు చేసిన ఐపీసీ సెక్షన్ 363 (కిడ్నాప్), 366 ఏ(మైనర్ అమ్మాయిని అనుమతి లేకుండా తీసుకెళ్లడం) వంటి సెక్షన్లు ఖన్నాసిటిలోని రెండవ ఠాణాలో నమోదయ్యాయని, వాటిపై ముందస్తు బెయిల్ మంజూర్ చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. జీవిత రక్షణ,స్వేచ్ఛ కోసం పిటిషనర్‌తో కలిసి బాలిక క్రిమినల్ రిట్ పిటిషన్ దాఖలు చేసుకున్నట్లు అతని తరుపు న్యాయవాది అరవింద్ సింగ్ సాంగ్వాన్ కోర్టుకు నివేదించాడు. ఈ ముందస్తు బెయిల్‌ను ప్రభుత్వ తరుపు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు.
వారిద్దరూ సొంత అన్నదమ్ముల బిడ్డలు కావడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని అన్నారు. పిటిషన్ పరీశీలించిన న్యాయమూర్తి వారిద్దరూ కలిసి ఉంటున్నారని అంటున్నారు, కానీ నివేదికనూ చూస్తే తనకు కేవలం 17 సంవత్సరాల మాత్రమే ఉన్నాయని అన్నారు. బాలిక పుట్టిన తేదీ 2003 ఆగస్ట్ అని,సెప్టెంబర్ 3,2020 నాటికీ 17 సంవత్సరాల 14 రోజులని న్యాయమూర్తి అన్నారు. కేవలం మగ సోదరులని మాత్రమే వాళ్ల తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారని, మైనర్‌ని వేధిస్తున్నారని బాలిక ఇచ్చిన నివేదికను సైతం పిటిషనర్ దీనికి జతపర్చాడు. అందుకోసం తనతో కలిసి జీవించాలని బాలిక నిర్ణయించుకుందని వాదించాడు.
తన సొంత తల్లిదండ్రుల నుంచి ప్రాణానికి హాని ఉందన్నారు. తనను వేధించకుండా చూడాలని వేసిన పిటిషన్‌ని, కోర్టు సెప్టెంబర్ 7 న కొట్టివేసింది. ప్రభుత్వం ఇద్దరికి రక్షణ కల్పించాలని ఆదేశిందని న్యాయమూర్తి అన్నారు. ఏది ఏమైన చట్ట ఉల్లంఘన కోసం చట్టపరమైన చర్యల నుంచి రక్షించడానికి ఈ ఉత్తర్వూ ఇవ్వరాదని కోర్టు వ్యాఖ్యానించింది. పిటిషన్‌లో తాను బాలికకూ సోదరుడినవుతాననే విషయాన్ని వెల్లడించలేదని ,అందువల్ల 18 సంవత్సరాలు నిండిన తరువాత కూడా వారు చేసుకున్న పెళ్లి చట్ట సమ్మతం కాదని అంది." పిటిషనర్ హిందూ వివాహ చట్టం క్రింద నిషేధించబడిన 'సపిందా'లో (ఇద్దరు వ్యక్తుల మధ్య ఉమ్మడి పూర్వీకులు ఉంటే వారి మధ్య వివాహాన్ని నిషేధిస్తుంది) వస్తారని, ఒకరితో ఒకరు వివాహం చేసుకోలేరని అని ప్రభుత్వ న్యాయవాది" వాదనలతో కోర్టు ఏకీభవించింది., ఇది అనైతికం, సమాజంలో ఆమోద యోగ్యం కాదని పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment