
లుథియానా: పంజాబ్‌లోని లుథియానాలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షింగర్ థియేటర్ సమీపంలోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. అనంతరం మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో చుట్టపక్కల దట్టమైన పొగ అలుముకుంది.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 12 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఖాళీ చేయించారు. కాగా ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment