లూధియానా: పంజాబ్ లోని లూధియానా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చెందిన ఓ ఆఫీస్లో అగ్నిప్రమాదం సంభవించింది. రిషినగర్లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. గత దశాబ్దకాలానికి చెందిన రికార్డులు దగ్ధమయ్యాయని అధికారులు వెల్లడించారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో మంటలు సంభవించడాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందజేశారు.
నాలుగు పైరింజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సుమారు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. గత దశాబ్దకాలానికి చెందిన పలు ఫైళ్లు ఈ అగ్నిప్రమాదం కారణంగా కాలిపోయినట్లు ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ గగన్ కుంద్రా వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన చోటుచేసుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో అగ్నిప్రమాదం, ఫైళ్లు దగ్దం
Published Sun, Nov 29 2015 2:33 PM | Last Updated on Thu, Sep 27 2018 4:22 PM
Advertisement
Advertisement