లూథియానా:భార్య మీద అలిగి ఇంట్లోంచి వెళ్లిపోయిన భర్తను వెతుక్కుంటూ బయలుదేరింది ఓ భార్య .దీనిలో విశేషం ఏముంది అనుకుంటున్నారా? అక్కడే అసలు విషయం దాగి ఉంది, దాదాపు 1400 కిలోమీటర్లు దూరంలో ఉన్న భర్తను వెతుక్కుంటూ బయలుదేరింది.19 ఏళ్లు ఆమె చేతిలో చిల్లి గవ్వ లేకుండా పాట్నా నుంచి పంజాబ్ లోని లూథియానా వరకూ ప్రయాణించింది.
ఆమెకు తెలిసిందల్లా ఒకటే..తన భర్త లూథియానాలోని సలేమ్ తబ్రీ ప్రాంతంలోని ఓ చోట పనిచేస్తున్నాడు. దీంతో తన ఇద్దరు పిల్లలను పాట్నాలో తెలిసినవారి వద్ద వదిలేసి లూథియానా వచ్చి భర్తను వెతికే పనిలో పడింది. భర్త కోసం పిచ్చిదానిలా వెతకటం ప్రారంభించింది. అలా వెతుకుతుండగా లూథియానాలో బుద్ దేవ్ అనే వ్యక్తి ఆమెకు కలిశాడు.ఈ ప్రాంతంలో కొత్తగా కనిపిస్తున్నావు,ఇలా ఎవరి కోసం వెతుతున్నావ్ అనిఅడిగాడు. దానికి ఆమె చెప్పిన కథ విని ఆశ్చర్యపోయాడు.
ఆ తరువాత ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు.తిండి పెట్టి ఆశ్రయం ఇచ్చాడు.తరువాత ఆమెను లూథియానా నగర అదనపు డీసీపీ ప్రగ్యా జైన్ వద్దకు తీసుకెళ్లాడు. కానీ ఆమె భర్త గురించి పూర్తి వివరాలు చెప్పలేకపోయింది.తనకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పెళ్లైందని..నా భర్త పేరు జాన్. ఇద్దరు పిల్లలు పుట్టాక చిన్న గొడవ వల్ల తనను పిల్లలను వదిలి ఇల్లు వదిలిపెట్టి వచ్చేశాడని తెలిపింది. తరువాత ఫోన్ చేసి నేను లూథియానాలో ఉన్నానని చెప్పాడని..కానీ రమ్మంటే నేను రాను అని చెప్పాడని వాపోయింది.
డీసీపీ ప్రగ్యా జైన్ ఆమె ఇచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా పలు రకాలుగా యత్నించినా ఆచూకీ లభించలేదు. అలా అతని ఫోన్ నంబర్ ఆధారంగా చివరకు ఆమె భర్త జాన్‌ను కనిపెట్టారు. మొదట ఈమె ఎవరో తెలీదని జాన్ అబద్దాలు ఆడాడు.కానీ పోలీసులు భయపెట్టటంతో ఆమె నా భార్య అని ఒప్పుకున్నాడు. పోలీసుల కౌన్సిలింగ్ తో ఆమెతో కలిసి ఉండేందుకు ఒప్పుకున్నాడు. త్వరలోనే బీహార్ నుంచి పిల్లలను తీసుకొచ్చి లూథియానాలోనే ఉంటామని చెప్పాడు.
చదవండి:పాముకు ఊపిరి ఊది ప్రాణం నిలిపిన యువకుడు, వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment