Punajb
-
కాంగ్రెస్‌పై కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
భోపాల్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో తనవైన రాజకీయాలకు తెరతీశారు. సాట్నాలో ఓ కార్యక్రమానికి అతిధిగా హాజరైన ఢిల్లీ సీఎం INDIA కూటమిలో భాగస్వామిగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో తమకు అవకాశమిస్తే INDIA కూటమిలో తమ భాగస్వామి కాంగ్రెస్ పార్టీని బీజేపీని కూడా మర్చిపోతారని అన్నారు. మధ్యప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు అప్పుడే ఎన్నికలకు శంఖారావాన్ని పూరించాయి. ఇదిలా ఉండగా మేమేమీ తక్కువ తినలేదంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా మధ్యప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మధ్యప్రదేశ్‌లోని సాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రస్తావన తీసుకొస్తూ తమ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో తమను మరో 50 ఏళ్ల వరకు ఏ పార్టీ కదపలేదని అన్నారు. మధ్యప్రదేశ్‌లో కూడా ఒకసారి అవకాశమిచ్చి చూడండి.. కాంగ్రెస్, బీజేపీల కంటే గొప్ప పరిపాలన అందిస్తామని అన్నారు. కాంగ్రెస్ బీజేపీని విమర్శిస్తుంది.. బీజేపీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది.. మాకు విమర్శించడం తెలియదు. జాతిని నిర్మించడం ఒక్కటే మా ప్రధాన లక్ష్యం. జాతి నిర్మాణం కోసమే మేము అన్నా ఆందోళన నుండి విడిపోయామని అన్నారు. ఇన్కమ్ టాక్స్ కమీషనర్‌గా పని చేస్తోన్న నేను జాతిని నిర్మించాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో ఉద్యోగాన్ని విడిచిపెట్టేశానని అన్నారు. మేము రాజకీయ నాయకులం కాదు. జాతి నిర్మాణమే మా ప్రధాన ఎజెండా. మధ్యప్రదేశ్‌లో మమ్మల్ని గెలిపిస్తే బీజేపీ తోపాటు కాంగ్రెస్ పార్టీని కూడా మర్చిపోయేలా పరిపాలిస్తామని అన్నారు. VIDEO | "We are not politicians, we are here to build the nation. I request you to give us one chance, and I promise you will forget BJP and Congress," says Delhi CM @ArvindKejriwal at AAP's town hall programme in Satna, Madhya Pradesh. pic.twitter.com/xzIkfJgXc7 — Press Trust of India (@PTI_News) August 20, 2023 ఇది కూడా చదవండి: ధైర్యముంటే రిపోర్టు కార్డు విడుదల చెయ్యండి.. అమిత్ షా -
స్టార్ హీరోకు మరోసారి బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ ఖాన్‌కు గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ నుంచి బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. తాజాగా వచ్చిన బెదిరింపులపై సల్మాన్ ఖాన్ బృందం ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి ప్రస్తావించిన సల్మాన్ ఖాన్ సన్నిహితుడు ప్రశాంత్ గుంజాల్కర్‌కు శనివారం బెదిరింపు మెయిల్ వచ్చింది. అందులో నటుడిని చంపడమే తన జీవిత లక్ష్యమని గ్యాంగ్‌స్టర్ పేర్కొన్నాడు. ఈ-మెయిల్‌కు సంబంధించిన బెదిరింపులపై గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ-మెయిల్లో ఏముంది? సల్మాన్ ఖాన్ సన్నిహితుడు ప్రశాంత్ గుంజాల్కర్‌కు బెదిరింపు మెయిల్ పంపిన వ్యక్తి రోహిత్ గార్గ్ అని తేలింది. తాజా బెదిరింపులతో గార్గ్, గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్‌లపై సల్మాన్ ఖాన్ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ సల్మాన్ ఖాన్‌తో మాట్లాడాలనుకుంటున్నాడని ఈ-మెయిల్లో పేర్కొన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అందులో సల్మాన్ ఖాన్‌ను చంపడమే తన జీవిత లక్ష్యమని చెప్పారని ప్రస్తావించారు. గతంలోనూ బెదిరింపుల లేఖ గతంలో సల్మాన్ ఖాన్‌కు ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలా హత్య కేసులో ప్రధాన నిందితుడైన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. అప్పట్లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో సల్మాన్ భద్రతను కూడా పెంచింది. తాజాగా బెదిరింపులతో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. కృష్ణజింకల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్‌ఖాన్‌ని హత్య చేస్తానంటూ 2018లో కోర్టు ఆవరణలోనే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రకటించాడు. గతంలో సల్మాన్ హత్యకు కుట్ర పన్నారని వార్తలు కూడా వచ్చాయి. సింగర్ సిద్ధూ హత్య తర్వాత కొందరు దుండగులు సల్మాన్ ఖాన్‌తోపాటు ఆయన తండ్రి సలీం ఖాన్‌ను చంపేస్తామని లేఖ ద్వారా బెదిరించారు. -
మైనర్‌పై ఐదేళ్లుగా అత్యాచారం.. బిడ్డకు జన్మనివ్వడంతో..
చండీగడ్: దేశంలో రోజురోజుకూ బాలికల మీద అత్యచారాలు పెరిగిపోతున్నాయి. వావి వరసలు మరిచి కూతురు, సొదరి వరసయ్యే చిన్నారులపై తమతమ ప్రకోపం చూపిస్తున్నారు....పంజాబ్‌లోని పాటియాలలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ 15 ఏళ్ల బాలిక ఐదేళ్లుగా అత్యాచారానికి గురైంది. మైనర్ బాలిక ఒక బిడ్డకు జన్మనివ్వడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. బాధిత బాలిక గత ఐదేళ్లుగా పాటియాలలోని తన కజిన్ ఇంట్లో ఉంటుంది. ఆమె ఆమె తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో నిందితుడు ఆమెపై పదేపదే అత్యాచారం చేశాడు, నేరాన్ని ఎవరికీ చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయాని హెచ్చరించాడు. ఈ విషయం గురించి ఎవరికైనా సమాచారం ఇస్తే ఆమె తల్లిదండ్రులను హత్య చేస్తానని అతడు బెదిరించాడు. దీంతో ఈ విషయాన్ని ఇన్నేళ్లుగా ఆమె బయటకు చెప్పలేదు. అత్యాచారం ఫలితంగా, మైనర్ అమ్మాయి గర్భవతి అయింది. జూన్ 12 న ఆమె రాజీంద్ర ఆసుపత్రిలో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత.. ఈ నేరం గురించి ఆమె తల్లిదండ్రులు తెలిసింది. భాదిత కుటంబం ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీలోని 376, 506 సెక్షన్లతో పాటుగా, పోక్సో చట్టంలోని సంబంధిత విభాగాల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. -
చేతిలో పైసా లేదు..భర్త కోసం 1400 కి.మీ. ప్రయాణం
లూథియానా:భార్య మీద అలిగి ఇంట్లోంచి వెళ్లిపోయిన భర్తను వెతుక్కుంటూ బయలుదేరింది ఓ భార్య .దీనిలో విశేషం ఏముంది అనుకుంటున్నారా? అక్కడే అసలు విషయం దాగి ఉంది, దాదాపు 1400 కిలోమీటర్లు దూరంలో ఉన్న భర్తను వెతుక్కుంటూ బయలుదేరింది.19 ఏళ్లు ఆమె చేతిలో చిల్లి గవ్వ లేకుండా పాట్నా నుంచి పంజాబ్ లోని లూథియానా వరకూ ప్రయాణించింది. ఆమెకు తెలిసిందల్లా ఒకటే..తన భర్త లూథియానాలోని సలేమ్ తబ్రీ ప్రాంతంలోని ఓ చోట పనిచేస్తున్నాడు. దీంతో తన ఇద్దరు పిల్లలను పాట్నాలో తెలిసినవారి వద్ద వదిలేసి లూథియానా వచ్చి భర్తను వెతికే పనిలో పడింది. భర్త కోసం పిచ్చిదానిలా వెతకటం ప్రారంభించింది. అలా వెతుకుతుండగా లూథియానాలో బుద్ దేవ్ అనే వ్యక్తి ఆమెకు కలిశాడు.ఈ ప్రాంతంలో కొత్తగా కనిపిస్తున్నావు,ఇలా ఎవరి కోసం వెతుతున్నావ్ అనిఅడిగాడు. దానికి ఆమె చెప్పిన కథ విని ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు.తిండి పెట్టి ఆశ్రయం ఇచ్చాడు.తరువాత ఆమెను లూథియానా నగర అదనపు డీసీపీ ప్రగ్యా జైన్ వద్దకు తీసుకెళ్లాడు. కానీ ఆమె భర్త గురించి పూర్తి వివరాలు చెప్పలేకపోయింది.తనకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పెళ్లైందని..నా భర్త పేరు జాన్. ఇద్దరు పిల్లలు పుట్టాక చిన్న గొడవ వల్ల తనను పిల్లలను వదిలి ఇల్లు వదిలిపెట్టి వచ్చేశాడని తెలిపింది. తరువాత ఫోన్ చేసి నేను లూథియానాలో ఉన్నానని చెప్పాడని..కానీ రమ్మంటే నేను రాను అని చెప్పాడని వాపోయింది. డీసీపీ ప్రగ్యా జైన్ ఆమె ఇచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా పలు రకాలుగా యత్నించినా ఆచూకీ లభించలేదు. అలా అతని ఫోన్ నంబర్ ఆధారంగా చివరకు ఆమె భర్త జాన్‌ను కనిపెట్టారు. మొదట ఈమె ఎవరో తెలీదని జాన్ అబద్దాలు ఆడాడు.కానీ పోలీసులు భయపెట్టటంతో ఆమె నా భార్య అని ఒప్పుకున్నాడు. పోలీసుల కౌన్సిలింగ్ తో ఆమెతో కలిసి ఉండేందుకు ఒప్పుకున్నాడు. త్వరలోనే బీహార్ నుంచి పిల్లలను తీసుకొచ్చి లూథియానాలోనే ఉంటామని చెప్పాడు. చదవండి:పాముకు ఊపిరి ఊది ప్రాణం నిలిపిన యువకుడు, వీడియో వైరల్ -
జాతీయ స్థాయి క్రీడాకారిణి ఆత్మహత్య
పాటియాలా: రియో ఒలింపిక్స్ లో మహిళలు పతకాలు సాధిస్తూ దేశానికి గర్వంగా నిలుస్తున్న వేళ ఓ జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ క్రీడాకారిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పంజాబ్ లోని పాటియాలాలో శనివారం చోటు చేసుకుంది. పాటియాలా లోని ఖల్సా కళాశాలలో పూజ (20) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె గతేడాది కళాశాలలో అడ్మీషన్ తీసుకుంది. కాలేజీలోచేరే సమయంలో ఉచితంగా హాస్టల్ సౌకర్యం కల్పిస్తామని కళాశాల యాజమాన్యం హామీ ఇచ్చారు. ఆమె ఇంటినుంచి కాలేజీకి రావడానికి రోజూ రూ.120 ఖర్చు అవుతుంది.కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషించే తండ్రి ఖర్చులు భరించలేనని చదువు మానేయాల్సిందిగా పూజాకు సూచించాడు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పూజ నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్రమోదీగారూ నాలాంటి పేద విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్సించడి అని రాసింది. కళాశాల లో హాస్టల్ వసతి ఇవ్వనందుకే బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. కేసును నమోదు చేసిన పోలీసులు కేసును విచారిస్తున్నారు.