భోపాల్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో తనవైన రాజకీయాలకు తెరతీశారు. సాట్నాలో ఓ కార్యక్రమానికి అతిధిగా హాజరైన ఢిల్లీ సీఎం INDIA కూటమిలో భాగస్వామిగా ఉంటూనే కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో తమకు అవకాశమిస్తే INDIA కూటమిలో తమ భాగస్వామి కాంగ్రెస్ పార్టీని బీజేపీని కూడా మర్చిపోతారని అన్నారు.
మధ్యప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు అప్పుడే ఎన్నికలకు శంఖారావాన్ని పూరించాయి. ఇదిలా ఉండగా మేమేమీ తక్కువ తినలేదంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా మధ్యప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
మధ్యప్రదేశ్‌లోని సాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రస్తావన తీసుకొస్తూ తమ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో తమను మరో 50 ఏళ్ల వరకు ఏ పార్టీ కదపలేదని అన్నారు. మధ్యప్రదేశ్‌లో కూడా ఒకసారి అవకాశమిచ్చి చూడండి.. కాంగ్రెస్, బీజేపీల కంటే గొప్ప పరిపాలన అందిస్తామని అన్నారు.
కాంగ్రెస్ బీజేపీని విమర్శిస్తుంది.. బీజేపీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది.. మాకు విమర్శించడం తెలియదు. జాతిని నిర్మించడం ఒక్కటే మా ప్రధాన లక్ష్యం. జాతి నిర్మాణం కోసమే మేము అన్నా ఆందోళన నుండి విడిపోయామని అన్నారు.
ఇన్‌కమ్ టాక్స్ కమీషనర్‍గా పని చేస్తోన్న నేను జాతిని నిర్మించాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో ఉద్యోగాన్ని విడిచిపెట్టేశానని అన్నారు. మేము రాజకీయ నాయకులం కాదు. జాతి నిర్మాణమే మా ప్రధాన ఎజెండా. మధ్యప్రదేశ్‌లో మమ్మల్ని గెలిపిస్తే బీజేపీ తోపాటు కాంగ్రెస్ పార్టీని కూడా మర్చిపోయేలా పరిపాలిస్తామని అన్నారు.
VIDEO | "We are not politicians, we are here to build the nation. I request you to give us one chance, and I promise you will forget BJP and Congress," says Delhi CM @ArvindKejriwal at AAP's town hall programme in Satna, Madhya Pradesh. pic.twitter.com/xzIkfJgXc7
— Press Trust of India (@PTI_News) August 20, 2023
ఇది కూడా చదవండి: ధైర్యముంటే రిపోర్టు కార్డు విడుదల చెయ్యండి.. అమిత్ షా
Comments
Please login to add a commentAdd a comment