చండీగడ్: దేశంలో రోజురోజుకూ బాలికల మీద అత్యచారాలు పెరిగిపోతున్నాయి. వావి వరసలు మరిచి కూతురు, సొదరి వరసయ్యే చిన్నారులపై తమతమ ప్రకోపం చూపిస్తున్నారు....పంజాబ్‌లోని పాటియాలలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ 15 ఏళ్ల బాలిక ఐదేళ్లుగా అత్యాచారానికి గురైంది. మైనర్ బాలిక ఒక బిడ్డకు జన్మనివ్వడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. బాధిత బాలిక గత ఐదేళ్లుగా పాటియాలలోని తన కజిన్ ఇంట్లో ఉంటుంది. ఆమె ఆమె తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో నిందితుడు ఆమెపై పదేపదే అత్యాచారం చేశాడు, నేరాన్ని ఎవరికీ చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయాని హెచ్చరించాడు.
ఈ విషయం గురించి ఎవరికైనా సమాచారం ఇస్తే ఆమె తల్లిదండ్రులను హత్య చేస్తానని అతడు బెదిరించాడు. దీంతో ఈ విషయాన్ని ఇన్నేళ్లుగా ఆమె బయటకు చెప్పలేదు. అత్యాచారం ఫలితంగా, మైనర్ అమ్మాయి గర్భవతి అయింది. జూన్ 12 న ఆమె రాజీంద్ర ఆసుపత్రిలో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత.. ఈ నేరం గురించి ఆమె తల్లిదండ్రులు తెలిసింది. భాదిత కుటంబం ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీలోని 376, 506 సెక్షన్లతో పాటుగా, పోక్సో చట్టంలోని సంబంధిత విభాగాల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment