టోల్‌ప్లాజా ఉద్యోగుల పాశవికం | Toll Plaza Employees Tie Child Beggar to Tree And Snatch His Money | Sakshi
Sakshi News home page

టోల్‌ప్లాజా ఉద్యోగుల పాశవికం

Published Mon, Mar 4 2019 9:08 AM | Last Updated on Mon, Mar 4 2019 9:08 AM

Toll Plaza Employees Tie Child Beggar to Tree And Snatch His Money - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చండీఘడ్‌ : పంజాబ్‌లోని లుధియానలో దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారనే కనికరం లేకుండా.. టోల్‌ప్లాజా సిబ్బంది అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. లుథియానాలోని లాధోవాల్‌ టోల్‌ప్లాజాకు వచ్చే వాహనాల వెంబడి పరుగెత్తుతూ డబ్బులు అడుక్కుంటున్న ఆ చిన్నారిని కనికరం లేకుండా ఓ చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేశారు. అంతేకాకుండా ఆ చిన్నారి అడుక్కున్న డబ్బును లాక్కున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ కావడంతో టోల్‌ప్లాజా సిబ్బంది వ్యవహారం వెలుగు చూసింది.

ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోను పరీక్షించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి తరఫున ఫిర్యాదు అందిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై మాట్లాడటానికి టోల్‌ యాజమాన్యం నిరాకరించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement