తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని.. | Man Trying To Kidnap Sleeping Child In Punjab Arrested | Sakshi
Sakshi News home page

చిన్నారి కిడ్నాప్‌నకు విఫలయత్నం

Published Wed, Sep 18 2019 2:28 PM | Last Updated on Wed, Sep 18 2019 8:08 PM

Man Trying To Kidnap Sleeping Child In Punjab Arrested - Sakshi

చండీగఢ్‌ : ఆరుబయట తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని కిడ్నాప్‌ చేసేందుకు ఓ ఆగంతకుడు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని కనుగొన్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన మంగళవారం పంజాబ్‌లో చోటుచేసుకుంది. వివరాలు...లూథియానాకు చెందిన ఓ కుటుంబం సోమవారం ఇంటి బయట నిద్రపోయేందుకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా తల్లితండ్రులతో పాటు వారి నాలుగేళ్ల చిన్నారి కూడా బయటే పడుకుంది. 

ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత వారు నిద్రిస్తున్న ప్రదేశానికి చేరిన ఓ వ్యక్తి..చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిని మెల్లిగా ఆమె నుంచి వేరు చేసి తన రిక్షాలో పడుకోబెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో చిన్నారి తల్లికి మెలకువ రావడంతో వెంటనే అతడి చేతుల్లో నుంచి బిడ్డను లాక్కొని కేకలు వేసింది. ఈ క్రమంలో ఆమె భర్త ఆగంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు పారిపోయాడు. ఈ ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా..అతడిని మంగళవారం అరెస్టు చేశారు. కాగా నిందితుడు చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement