
ప్రతీకాత్మక చిత్రం
చంఢీఘడ్ : నిరుద్యోగ యువత ఖాళీగా ఉండే కంటే పకోడి అమ్ముకోని ఉపాధి పొందవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో ఓ సలహా ఇచ్చారు. అప్పట్లో ఇది రాజకీయంగా పెద్ద దుమారాన్నే లేపింది. ఉద్యోగాలు కల్పించవయ్యా అంటే పకోడి అమ్ముకోమంటావా? అని ప్రతిపక్షాలు, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ మోదీ మాటలు ఉత్తవి కావని పంజాబ్‌లోని లూథియానా పకోడీ వ్యాపారి నిరూపించాడు. పకోడి వ్యాపారం చేసే ఏకంగా రూ.60 లక్షల పన్ను కట్టాడు. 1952లో చిన్న వీధి కొట్టుగా మొదలైన పన్నా సింగ్ కుటుంబ పకోడీ వ్యాపారం రోజురోజుకి అభివృద్ధి చెందింది. అతని పకోడి తినడానికి రాజకీయ నాయకులు, సినీ నటులు, వ్యాపారవేత్తలు క్యూ కడ్తారంటే అది ఎంత ఫేమసో అర్థమవుతోంది.
మరి ఇంత ఆదాయం వస్తున్నా ఆ షాపు యజమాని పన్నా సింగ్ పకోడీవాలా మాత్రం ఇప్పటి వరకూ అధికారుల కళ్లుగప్పి అతి తక్కువ పన్ను చెల్లించుకుంటు వచ్చాడు. ఇతని ఆదాయంపై అనుమానం వచ్చిన కొందరు ఐటీ అధికారులకు ఉప్పందించారు. దీంతో లూథియానా, గిల్ రోడ్‌లోని అతని షాపుపై దాడులు నిర్వహించి రికార్డులను పరిశీలిస్తే.. పన్నాసింగ్ భారీగా పన్ను ఎగ్గొడుతున్నట్టుగా తేలింది. దీంతో ఉన్న పళంగా, అతడితో రూ.60 లక్షలు పన్ను కట్టించారు.
Comments
Please login to add a commentAdd a comment