ఆ బీజేపీ నేతపై ఆరేళ్ల బహిష్కరణ వేటు!
బద్వాన్ (ఉత్తరప్రదేశ్): జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యకుమార్ నాలుకను కోసేస్తే.. రూ. 5 లక్షలు ఇస్తానని ఆఫర్ చేసిన బీజేపీ యువమోర్చా నాయకుడిపై వేటు పడింది. పార్టీని ఇబ్బందుల్లో పడేసేలా కన్హయ్యకుమార్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి యువమోర్చా నాయకుడు కుల్దీప్ వార్ష్‌నేపై యూపీ బద్వాన్ జిల్లా బీజేపీ యూనిట్ చర్యలు తీసుకుంది.
అతడిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడైన కుల్దీప్ కన్హయ్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. దీంతో అతన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని, అతని వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు హరిశ్ శాక్య తెలిపారు.