కర్ణాటక హైకోర్టు
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు బుధవారం విచారణ జరుపనుంది. కేసులో తక్షణం బెయిల్ మంజూరు చేయాలని, ప్రత్యేక కోర్టు విధించిన నాలుగేళ్ల జైలుశిక్షను రద్దుచేయాలని కోరుతూ జయలలిత దరఖాస్తు చేసుకున్నారు.
జయలలిత దరఖాస్తుపై విచారణను వెకేషన్ బెంచ్ తొలుత వచ్చేనెల 6వ తేదీకి వాయిదావేసింది. అయితే, వచ్చే నెల 2 నుంచి 6 వరకు సెలవులు అయినందున, సత్వర విచారణ కోరుతూ జయలలిత తరఫున రాంజెఠ్మలానీ నేతృత్వంలోని న్యాయవాదులు హైకోర్టు రిజిస్ట్రార్‌కు అందజేసిన నివేదన మేరకు విచారణ బుధవారం చేపట్టేందుకు ప్రధాన న్యాయమూర్తి డీహెచ్ వాఘేలా సారథ్యంలోని హైకోర్టు ధర్మాసనం అంగీకరించింది.
**