జయ బెయిల్ పిటిషన్పై విచారణ ప్రారంభం | Arguments on Jayalalithaa's bail plea begins in karnataka high court | Sakshi
Sakshi News home page

జయ బెయిల్ పిటిషన్పై విచారణ ప్రారంభం

Published Wed, Oct 1 2014 10:34 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

Arguments on Jayalalithaa's bail plea begins in karnataka high court

హైదరాబాద్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టులో బుధవారం విచారణ ప్రారంభమైంది. జయ తరపున సీనియర్ న్యాయవాది రాంజెఠ్మాలనీ వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో తక్షణం బెయిల్ మంజూరు చేయాలని, ప్రత్యేక కోర్టు విధించిన నాలుగేళ్ల జైలుశిక్షను రద్దుచేయాలని కోరుతూ జయలలిత దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

కాగా జయ బెయిల్ దరఖాస్తుపై విచారణను వెకేషన్ బెంచ్ తొలుత వచ్చేనెల 6వ తేదీకి వాయిదా వేసింది. అయితే, సత్వర విచారణ కోరుతూ, జయలలిత తరఫున రాంజెఠ్మలానీ నేతృత్వంలోని న్యాయవాదుల నివేదన మేరకు విచారణ బుధవారం చేపట్టేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీహెచ్ వాఘేలా సారథ్యంలోని హైకోర్టు ధర్మాసనం అంగీకరించింది.

దాంతో జయ బెయిల్ పిటిషన్పై నేడు న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. మరోవైపు కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ నేతలు, కార్యకర్తలు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. జయకు బెయిల్ రావాలంటూ తమిళనాడు వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు పూజలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement