జయకు బెయిల్ నిరాకరణ
బెయిల్ మంజూరుకు తగిన కారణాలు లేవన్న కర్ణాటక హైకోర్టు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టులో మంగళవారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జయుతో పాటు శశికళ, సుధాకరన్, ఇళవరసిల బెయిల్ పిటిషన్లను జస్టిస్ ఏవీ చంద్రశేఖర నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం కొట్టివేసింది. జయలలితకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ భవానీ సింగ్ విచారణ సందర్భంగా చెప్పినా ఆయున వాదనతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రశేఖర ఏకీభవించలేదు.
కిక్కిరిసిన కోర్టు హాలులో తీర్పు పాఠాన్ని చదివిన న్యాయమూర్తి ‘అవినీతి.. మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. ఇది ఆర్థిక అసమానతలకు దారితీస్తుంది. అవినీతి మానవ చరిత్రలోనే ఒక జాడ్యంగా మారిపోయింది అవినీతి కేసులను అధిక ప్రాధాన్యత ప్రాతిపదికపై పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు ఆదేశించింది. అవినీతిని తేలికగా తీసుకోవటానికి వీల్లేదు. తీవ్రమైన చర్యలు తీసుకోని పక్షంలో అది సమాజానికి జాడ్యంగా మారుతుంది. అవినీతి సమాజ వ్యతిరేకమైందని 2012లో సుప్రీం కోర్టు ఒక కేసు విచారణలో వ్యాఖ్యానించింది. అందువల్ల తమిళనాడు మాజీ సీఎంకు బెయిల్ మంజూరు చేయడానికి సహేతుక కారణాలు కనిపించడం లేదు’ అన్నారు. ఆస్తుల కేసులో జయను దోషిగా నిర్ధారిస్తూ, గత నెల 27న బెంగళూరు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్షను, రూ.వంద కోట్ల జరిమానాను, శశికళ, సుధాకరన్, ఇళవరసిలకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు తలా రూ.పది కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టుకు వెళ్లడంపై జయదే నిర్ణయుం
బెరుుల్ తిరస్కరిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ, సుప్రీం కోర్టుకు వెళ్లే విషయమై జయలలితే స్వయుంగా నిర్ణయం తీసుకుంటారని ఆమె తరఫున హైకోర్టులో వాదించిన ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ తెలిపారు. హైకోర్టు ఆదేశాలు తనను నిరాశ పరిచాయన్నారు. అంతకు ముందు హైకోర్టులో ఆయన వాదనలు వినిపిస్తూ, జయలలితకు సత్వరమే బెయిల్ మంజూరు చేయాలని విన్నవించారు. దాణా కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని ఉటంకించారు. అయితే ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించలేదు. బెయిల్‌కు ముందు లాలూ ప్రసాద్ యూదవ్ పది నెలలు జైలులో ఉన్నారని గుర్తు చేశారు. కాగా, సుప్రీం కోర్టులో బుధవారం బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేయడానికి జయ తరఫు న్యాయవాదులు సన్నాహాలు చేసుకుంటున్నారు. తన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించినట్టు తెలిసిన వెంటనే జయలలిత కుప్పకూలి పోయారు. తన బెయిల్ పిటిషన్‌పై వాదనల గురించి తెలుసుకోవడానికి ఆమె వుంగళవారం ఉదయుం నుంచే టీవీని వీక్షిస్తూ ఉన్నారు. బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైందని తెలియడంతో ఆమె కుప్పకూలారు. వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. లో-బీపీతో బాధ పడుతున్నట్లు గుర్తించి ఆమెకు వైద్యం చేశారు.
భారీ బందోబస్తు: జయలలిత బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో హైకోర్టులోనూ, పరప్పన అగ్రహార జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా జయ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో తమిళనాడుకు వెళ్లాల్సిన కేఎస్‌ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దు చేశారు. మరోవైపు జయలలితను తమిళనాడు జైలుకు తరలించే విషయమై తవు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోజాలదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని జయలలితను తమిళనాడు జైలుకు తరలించాలన్న మాజీ ప్రధాని దేవెగౌడ వ్యాఖ్యపై ఆయన మంగళవారం స్పందించారు. ఈ అంశంపై సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
‘కన్నడిగులను జైల్లో పెడతాం’
చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బెయిల్ కోసం తపించిపోతున్న ఆ పార్టీ శ్రేణులు కర్ణాటకపై పోస్టర్ల యుద్ధానికి శంఖారావం పూరించారు. జయకు బెయిల్ ఇవ్వకుంటే తమిళనాడులోని కన్నడీగులను జైల్లో పెడతాం జాగ్రత్త అంటూ చెన్నై నలుమూలలా పోస్టర్లను అంటించడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కావేరీ జలాల వాటా విషయంలో ఉభయు రాష్ట్రాలకూ పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమనే స్థాయిలో విభేదాలు, విద్వేషాలు ఉన్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య ఇలాంటి విద్వేషాలున్న తరుణంలో జయలలిత బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న పరిణావుం, తమిళనాడు ప్రజలకు, ముఖ్యంగా అన్నాడీఎంకే శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. సోమవారం రాత్రి కర్ణాటక హైకోర్టుకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ‘‘హెచ్చరిక..హెచ్చరిక. వంచనతో కూడిన తీర్పును వెలువరించిన కర్ణాటక న్యాయస్థానమా!..జనం ముఖ్యమంత్రి అమ్మను వెంటనే విడుదల చేయి, లేకుంటే తమిళనాడులో నివసించే కర్ణాటక ప్రజలందరినీ చెరలో పెడతాం’’ అని హెచ్చరిస్తూ పోస్టర్లను అంటిం చారు. పోస్టర్లలో మంత్రి వలర్మతి, టీ నగర్ ఎమ్మెల్యే కలైరాజన్ తదితర ప్రముఖుల పేర్లు ఉండటం చర్చనీయాంశమై ఉద్రిక్తతకు దారితీసింది. చెన్నై పోలీస్ కమిషనర్ జార్జ్ ఆదేశాలతో కానిస్టేబుళ్లు పోస్టర్లను చింపివేశారు. అరుుతే కర్ణాటక పేరెత్తకుండానే మంగళవారం సాయంత్రం మరో పోస్టరు వెలిసింది. ‘ఖండిస్తున్నాం..తీవ్రంగా ఖండిస్తున్నాం. సత్యమే జీవితం గా బతుకుతున్న నీతిమంతురాలిని జైల్లో పెట్టిన నీకు శ్మశానంలోనూ చోటు లేదు..విడుదల చెయ్ అమ్మను విడుదల చెయ్’అంటూ పోస్టర్లు అంటించారు.