ముంబై డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ షాక్ మరోసారి నిరాశ ఎదురైంది. నిన్న ఈ కేసుని విచారించిన ముంబై కోర్టు అతన్ని14 ఎన్‌సీబీ కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతరం కేసుని స్పెషల్ కోర్టుకు అప్పగించింది.
అయితే శుక్రవారం కొనసాగిన విచారణలో ఆర్యన్ తరుఫు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. దీంతో కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం వచ్చే 3 నుంచి 5 రోజుల పాటు అతన్ని ఆర్థర్ రోడ్ జైలులో క్వారంటైన్ సెల్‌లో ఉంచనున్నారు.
అయితే ముంబై తీరంలో జరిగిన క్రూయిజ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నారని, గత వారం ఈ స్టార్ కిడ్‌తో కలిపి మొత్తం ఎనిమిదిని అరెస్టు చేసింది ఎన్‌సీబీ. గురువారం వరకూ ఎన్‌సీబీ ఆఫీస్‌లోనే ఉంచి విచారించగా, కోర్టు తీర్పుతో ఆర్థర్ రోడ్ జైలుకి తరలించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment