సోషల్‌ మీడియా ట్రెండిగ్‌లో #ReleaseAryanKhan | Release Aryan Khan Yash Tag Trends on Social Media | Sakshi
Sakshi News home page

Aryan Khan Drug's Case: సోషల్‌ మీడియా ట్రెండిగ్‌లో #ReleaseAryanKhan

Published Fri, Oct 8 2021 2:06 PM | Last Updated on Fri, Oct 8 2021 5:10 PM

Release Aryan Khan Yash Tag Trends on Social Media - Sakshi

ముంబైలో క్రూయిజ్ షిప్‌లో నిషేధిత డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న కేసులో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్‌ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఏడుగురు అరస్టయిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన బెయిల్‌ పిటిషన్‌ విచారణ అనంతరం కస్టడీని 14 రోజులకు పొడిగించిన ముంబై కోర్టు, ఈ కేసును స్పెషల్ ఎన్‌డీపీఎస్ కోర్టుకి అప్పగించింది. దీంతో శుక్రవారం మరోసారి అతని బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎంతోమంది సోషల్‌ మీడియాలో ఆర్యన్‌కి మద్దతు తెలుపుతున్నారు.

ఈ కేసు విషయమై ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు, అభిమానులు షారుక్‌ ఫ్యామిలీకి సపోర్టుగా నిలిచారు. కాగా అతని దగ్గర డ్రగ్స్‌ దొరకలేదు. అతను డ్రగ్స్‌ తీసుకోలేదు అయినా ఇప్పటికీ జైలులో ఉంచడం కరెక్ట కాదంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో ట్విట్టర్‌లో #ReleaseAryanKhan ట్రేండింగ్‌లోకి వచ్చింది. కొన్ని ట్విట్స్‌ ఈ యాష్‌ట్యాగ్‌తో సోషల్‌ మీడియాని ముంచెత్తుతున్నాయి.

చదవండి: నాలుగేళ్లుగా డ్రగ్స్‌ తీసుకుంటున్నా: ఆర్యన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement