అన్షు ప్రకాశ్, ఆరవింద్ కేజ్రీవాల్
న్యూ ఢిల్లీ : ఢిల్లీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అన్షు ప్రకాశ్‌పై దాడి కేసులో ఆప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలే సూచనలే కన్పిస్తున్నాయి. సీఎం ఆరవింద్ కేజ్రీవాల్ నివాసం నుంచి సేకరించిన సీసీటీవీ దృశ్యాలు ట్యాంపరింగ్ జరిగినట్టు తెలుస్తుందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న కేజ్రీవాల్‌ని ఇది మరింత ఇబ్బందులకు గురిచేసేలా ఉంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ బెయిల్ పిటిషన్‌పై తీస్ హజారి అడిషనల్ సెషన్ష్ కోర్టు జడ్జీ అంజు బజాజ్ చందన విచారణ చేపట్టారు. సీఎస్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లాడని చెబుతున్న సమయానికి, సీసీటీవీలో నమోదైన సమయానికి మధ్య వ్యత్యాసం ఉందని పోలీసులు తెలిపారు. కేజ్రీవాల్ సలహాదారుడు వీకే జైన్ సీఎస్ అర్థరాత్రి తర్వాత సీఎం నివాసానికి వచ్చారని పేర్కొన్న విషయాన్ని కూడా కోర్టు ముందు ఉంచారు.
దీనిపై డిఫెన్స్ లాయర్ బీఎస్ జూన్ వాదిస్తూ సీసీటీవీలో సీఎస్ కేజ్రీవాల్ నివాసానికి 11.24 గంటలకు వచ్చి, 11.31 కు వెళ్లినట్టు తెలుస్తోందన్నారు. ఇది పోలీసులు చెబుతున్న సమయానికి దాదాపు నలభై నిమిషాల తేడా ఉందన్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక వస్తే ఏది నిజమో తెలుస్తోందన్నారు. దీనిపై పబ్బిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. ఎమ్మెల్యే జర్వాల్‌పై ఇంతకు ముందు అనేక కేసులు ఉన్నాయని తెలిపారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన జూన్, అతను ఏ కేసులోను దోషిగా తెలలేదన్నారు. ఇది ఒక రాజకీయ కక్ష సాధింపుగా పేర్కొన్నారు. ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించక ముందే కేసు నమోదు చేశారన్నారు. అందువల్ల ఈ కేసుని పరిగణలోకి తీసుకొకూడదని అన్నారు.
ఈ దాడి సీఎం క్యాంప్ ఆఫీస్‌లో జరగలేదని, సీఎం నివాసంలోని డ్రాయింగ్ రూంలో జరిగిందని ఆడిషనల్ డీసీపీ హీరేంద్ర సింగ్ కోర్టుకి తెలిపారు. జర్వాల్ గతంలో కింది స్థాయి అధికారులపై దాడి చేశాడని, ఇప్పుడు ఉన్నత స్థాయి అధికారిపై దాడికి పాల్పడ్డడాని పేర్కొన్నారు. జర్వాల్ బెయిల్ ఫిటిషన్‌పై తీర్పును కోర్టు మంగళవారం మధ్యహ్నం 2 గంటలకు వెల్లడించనుంది.
Comments
Please login to add a commentAdd a comment