Anshu Prakash
-
భయంకరమైన తుపాను దూసుకొస్తోంది!
న్యూఢిల్లీ: ‘అంఫన్’ అత్యంత తీవ్రమైన తుపాను అని, 1999 తరువాత బంగాళాఖాతంలో ఏర్పడిన రెండో అతి పెద్ద తుపానుగా భారత వాతావరణ శాఖ(ఐఎండీ) చీఫ్ మత్యుంజయ్ మహాపాత్ర పేర్కొన్నారు. ఇది ఉత్తర వాయువ్య దిశ వైపు కదులుతోందని, సముద్రంలో దాని గాలి వేగం ప్రస్తుతం 200-240 కిలోమీటర్లుగా ఉందని వెల్లడించారు. జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్, టెలికం కార్యదర్శి అన్షు ప్రకాశ్‌తో కలిసి మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, తూర్పు, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలతో పాటు కోల్‌కతా, హుగ్లీ, హౌరా ప్రాంతాల్లో ‘అంఫన్’ తుపాను తీవ్రత ఉండే అవకాశముందన్నారు. ఈ ప్రాంతాల్లో గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు. ఉష్ణమండల తుపాను కారణంగా కేరళకు రుతుపవనాలు కొంచెం ఆలస్యంగా రానున్నాయని, జూన్ 5 నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని మత్యుంజయ్ మహాపాత్ర వివరించారు. రెండు సవాళ్లు ఎదుర్కొంటున్నాం కరోనా, అంఫన్ తుపానులతో రెండు సవాళ్లను ఎదుర్కొంటున్నామని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ అన్నారు. అంఫన్ తుపాను అతి తీవ్రంగా మారిన నేపథ్యంలో తమ బృందాలను బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు పంపించినట్టు చెప్పారు. పశ్చిమ బెంగాల్లో 19, ఒడిశాలో 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మొహరించినట్టు వెల్లడించారు. అదనంగా మరో 6 ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లను కూడా సిద్ధంగా ఉంచామన్నారు. ప్రతి బెటాలియన్‌లో నాలుగు బృందాలు ఉంటాయని చెప్పారు. (అంఫన్ బీభత్సం మామూలుగా ఉండదు!) జనరేటర్లు సిద్ధం చేసుకోండి అంఫన్ తుపాను నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లోని టెలికం సర్వీసు ప్రొవైడర్లు అప్రమత్తంగా ఉండాలని టెలికం కార్యదర్శి అన్షు ప్రకాశ్ సూచించారు. ఈదురు గాలులతో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున తగినంత సంఖ్యలో జనరేటర్ సెట్లను ఏర్పాటు చేసుకుని, సరిపడా డీజిల్‌తో సన్నద్దంగా ఉండాలన్నారు. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడితే ఈ జనరేటర్ల సహాయంతో టెలికం టవర్లను పనిచేయించవచ్చని తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఎంఎంఎస్‌ల ద్వారా సమాచారం చేరవేయనున్నట్టు తెలిపారు. స్థానిక భాషల్లో, ఉచితంగా ఈ సేవలు అందిస్తామన్నారు. తుపాను తీరం దాటేవరకు ఇంట్రా-సర్కిల్ రోమింగ్ కొనసాగుతుందని వెల్లడించారు. (అంఫన్‌తో జాగ్రత్త) -
ఏజీఆర్ ‘పరిష్కారం’పై వొడా–ఐడియా కసరత్తు..
న్యూఢిల్లీ: ఏజీఆర్ బాకీల కారణంగా దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) .. ఈ సమస్య నుంచి గట్టెక్కడంపై కసరత్తు చేస్తోంది. కంపెనీ చైర్మన్ కుమార మంగళం బిర్లా .. మంగళవారం కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్‌తో సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు సాగిన చర్చల్లో వొడాఫోన్ ఐడియా ఎండీ, సీఈవో రవీందర్ టక్కర్ కూడా పాల్గొన్నారు. అయితే, చర్చల సారాంశాన్ని వెల్లడించేందుకు బిర్లా నిరాకరించారు. ‘ఇప్పుడే ఏం చెప్పలేము‘ అంటూ భేటీ అనంతరం ఆయన వ్యాఖ్యానించారు. వీఐఎల్ సంస్థ ఏజీఆర్ బాకీలు కట్టగలదా, దివాలా ప్రకటించే అవకాశం ఉందా వంటి ప్రశ్నలకు ఆయన సమాధానమివ్వడానికి నిరాకరించారు. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల కింద టెల్కోలు దాదాపు రూ. 1.47 లక్షల కోట్లు కట్టాలంటూ టెలికం శాఖ డిమాండ్ చేస్తోంది. వీఐఎల్ సుమారు రూ. 53,000 కోట్లు కట్టాల్సి ఉంది. బాకీల చెల్లింపుల్లో ఆదేశాల ఉల్లంఘనపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో మిగతా టెల్కోలతో పాటు వీఐఎల్ సోమవారం రూ. 2,500 కట్టింది. మరో వారం రోజుల్లోగా ఇంకో రూ. 1,000 కోట్లు కడతామని పేర్కొంది. మరోవైపు, బాకీలు కట్టని టెల్కోల బ్యాంకు గ్యారంటీలను స్వాధీనం చేసుకోవాలని టెలికం శాఖ భావిస్తోంది. అదే జరిగితే వీఐఎల్ వంటివి మూతబడే ప్రమాదముంది. బాకీలపై వెసులుబాటు లభించకపోతే మూసివేత తప్పదంటూ బిర్లా గతంలోనే వ్యాఖ్యానించడం గమనార్హం. -
5జీపై టెల్కోలతో టెలికం శాఖ భేటీ
న్యూఢిల్లీ: వేగవంతమైన 5జీ సేవల ప్రయోగాత్మక పరీక్షలకు సంబంధించి టెల్కోలు, వివిధ ఉత్పత్తుల వెండార్లతో కేంద్ర టెలికం శాఖ (డాట్) మంగళవారం భేటీ అయ్యింది. టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్ సారథ్యంలో జరిగిన ఈ సమావేశం దాదాపు గంటపైగా సాగింది. ప్రయోగాత్మకంగా పరీక్షలు జరిపేందుకు హువావే సహా సంబంధిత సంస్థలన్నింటికీ 5జీ స్పెక్ట్రం కేటాయిస్తామంటూ కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రకటించిన నేపథ్యంలో తాజా సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. భద్రతాపరమైన కారణాల రీత్యా హువావేను అమెరికా నిషేధించిన సంగతి తెలిసిందే. మరోవైపు, వైర్‌లైన్ సేర్విసులు అందించే విషయంలో నెట్వర్క్ టెస్టింగ్‌కి సంబంధించి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిబంధనల ముసాయిదాపై చర్చాపత్రం విడుదల చేసింది. ఇందులో చాలా మటుకు ప్రతిపాదనలు మొబైల్ సరీ్వసు నెట్వర్క్ టెస్టింగ్ నిబంధనల తరహాలోనే ఉన్నాయి. వీటి ప్రకారం వ్యాపారపరంగా సరీ్వసులు ప్రారంభించేందుకు ముందుగా.. ట్రయల్ దశలో టెస్టింగ్ కోసం సబ్‌స్క్రయిబర్స్‌ను చేర్చుకునేందుకు టెలికం సంస్థకు అనుమతి ఉంటుంది. సబ్‌్రస్కయిబర్స్‌ను చేర్చుకోవడానికి కనీసం 15 రోజుల ముందు.. సదరు నెట్వర్క్ సామర్థ్యాల సమగ్ర వివరాలను డాట్‌కు ఆపరేటరు సమరి్పంచాల్సి ఉంటుంది. -
స్పెక్ట్రం వేలానికి లైన్ క్లియర్
న్యూఢిల్లీ: దాదాపు రూ. 5.22 లక్షల కోట్ల రిజర్వు ధరతో స్పెక్ట్రం వేలం ప్రణాళిక ఖరారైంది. డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) శుక్రవారం దీనికి ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం 22 సర్కిళ్లలో 8,300 మెగాహెట్జ్ స్పెక్ట్రంను మార్చి–ఏప్రిల్‌లో వేలం వేయనున్నారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సుల మేరకు డీసీసీ ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసినట్లు టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్ తెలిపారు. మరోవైపు, కొచ్చి, లక్షద్వీప్ మధ్య సబ్‌మెరైన్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ ప్రతిపాదనకు కూడా డీసీసీ ఆమోదం తెలిపింది. సుమారు రూ. 1,072 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుతో 11 ద్వీపాలకు కనెక్టివిటీ లభిస్తుంది. ముందుగా 25 శాతం కట్టాలి.. స్పెక్ట్రం వేలానికి సంబంధించి ప్రాథమికంగా రూ. 4.9 లక్షల కోట్ల విలువ చేసే స్పెక్ట్రం వేలానికి ట్రాయ్ సిఫార్సులు చేసింది. అయితే, కొన్ని సర్కిళ్లలో రిలయన్స్ కమ్యూనికేషన్స్, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ సంస్థల లైసెన్సులు ముగిసిపోనుండటంతో.. ఆ తర్వాత వాటిని కూడా ప్రణాళికలో కలిపింది. తాజా వేలంలో 1 గిగాహెట్జ్ లోపు స్పెక్ట్రం కొనుగోలు చేసిన సంస్థలు ముందుగా ధరలో 25 శాతం మొత్తాన్ని, 1 గిగాహెట్జ్‌కు మించి కొనుగోలు చేసిన సంస్థలు 50 శాతం మొత్తాన్ని కట్టాల్సి ఉంటుంది. ముందస్తుగా కొంత కట్టిన తర్వాత రెండేళ్ల పాటు మారటోరియం లభిస్తుంది. ఆ తర్వాత మూడో ఏడాది నుంచి 16 వార్షిక వాయిదాల్లో మిగతా మొత్తాన్ని కట్టాలి. ప్రభుత్వ సూచన మేరకు అధ్యయనం చేసిన ట్రాయ్.. 700 మెగాహెట్జ్ నుంచి 3400–3600 మెగాహెట్జ్ దాకా వివిధ బ్యాండ్లలో స్పెక్ట్రంను వేలం వేయొచ్చని సిఫార్సు చేస్తూ 2018 ఆగస్టు 1న నివేదికనిచ్చింది. -
60 వేలకుపైగా వీఆర్ఎస్ దరఖాస్తులు
న్యూఢిల్లీ: స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని(వీఆర్ఎస్) ఎంచుకున్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఉద్యోగుల సంఖ్య ఇప్పటికి 60,000 దాటింది. టెలికం సెక్రటరీ అన్షూ ప్రకాశ్ శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. బీఎస్ఎన్ఎల్ విషయంలో గడచిన కొద్ది రోజుల్లో వీఆర్ఎస్కు దరఖాస్తు పెట్టుకున్న ఉద్యోగుల సంఖ్య 57,000కుపైగా ఉందని, ఎంటీఎన్ఎల్ సంబంధించి సంఖ్యను కూడా కలుపుకుంటే ఇది 60,000 దాటుతోందని ఆయన తెలిపారు. బీఎస్ఎన్ఎల్లో ఒక్క శుక్రవారం మధ్యాహా్ననికే వీఆర్ఎస్కోసం దరఖాస్తు పెట్టుకున్న వారి సంఖ్య 40,000 నుంచి 57,000కు చేరిందని సమాచారం. వీఆర్ఎస్ పథకానికి స్పందన ‘‘అసాధారణం’’ అని ఆయన పేర్కొన్నారు. 94,000 మందికి వీఆర్ఎస్ ఇవ్వాన్నది ప్రభుత్వ లక్ష్యంగా సైతం ఆయన సూచించారు. స్పందన బాగుంది: బీఎస్ఎన్ఎల్ సీఎండీ అంతక్రితం బీఎస్ఎన్ఎల్ సీఎండీ పీకే పుర్వార్ మాట్లాడుతూ, సంస్థలో వీఆర్ఎస్ కింద ఇప్పటికి 40,000 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ‘‘ఇప్పటి వరకూ 40,000కుపైగా దరఖాస్తులు వస్తే, ఇందులో 26,000 మంది గ్రూప్ ‘సీ’కి చెందినవారు. అన్ని కేడర్ల నుంచీ పథకానికి స్పందన బాగుంది’’ అని పుర్వార్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్కు సంబంధించి నవంబర్ 5 నుంచి అమల్లోకి వచి్చన ఈ పథకం డిసెంబర్ 3 వరకూ అమల్లో ఉంటుంది. సంస్థలో దాదాపు 1.50 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో లక్ష మంది వీఆర్ఎస్ ప్రయోజనం పొందడానికి అర్హులు. 70,000 నుంచి 80,000 మంది ఈ పథకాన్ని ఎంచుకుంటారని, దీనివల్ల దాదాపు రూ.7,000 కోట్ల వేతన బిల్లు భారం తగ్గుతుందని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది. కేంద్రం పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకారం బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించింది. నష్టాలు, రుణభారంతో కుదేలవుతున్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 69,000 కోట్ల మేర పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించడం తెలిసిందే. దీని ప్రకారం ఎంటీఎన్ఎల్ ఇప్పటికే తమ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించింది. రెండు కంపెనీల రుణభారం రూ.40,000 కోట్ల పైగా ఉంది. -
సీఎస్‌పై దాడి చార్జిషీట్లో కేజ్రీవాల్ పేరు
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై దాడి కేసులో సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం సిసోడియాలను నిందితులుగా చేరుస్తూ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమర్ విశాల్‌కు సమర్పించిన చార్జిషీట్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో 11 మంది ఎమ్మెల్యేల పేర్లున్నాయి. ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌ను అధికారిక విధులు నిర్వర్తించకుండా అడ్డుకునేందుకు, గాయపరిచేందుకు కేజ్రీవాల్, సిసోడియా తదితరులు కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, చంపేస్తామని బెదిరించారని అందులో పేర్కొన్నారు. కాగా, చార్జిషీటుపై ఈనెల 25వ తేదీన విచారణ చేపడతామని మెజిస్ట్రేట్ ప్రకటించారు. -
కేజ్రీవాల్‌కు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. ఆయన వ్యక్తిగత సలహాదారుడు వీకే జైన్ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఉదయం జైన్ తన రాజీనామా లేఖను సీఎంవో కార్యాలయానికి, లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల తన పదవి నుంచి వైదోలుగుతున్నట్లు తన రాజీనామ లేఖలో పేర్కోన్నారు. అయితే ఢిల్లీ చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాశ్‌పై దాడి కేసులో జైన్ సాక్షి ఉండటంతో ఆయన రాజీనామా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు రెండురోజుల క్రితమే జైన్‌ను సీఎస్ దాడి వ్యవహారంలో పోలీసులు విచారించారు కూడా. కాగా, గతనెల 22వ తేదీన ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ అన్షు పై ఆప్ ఎమ్మెల్యేలు అమానుతుల్లా ఖాన్, ప్రకాశ్ జార్వల్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని.. ఎమెల్యేలు దాడి చేయటం చూశానని విచారణలో జైన్ తెలిపారు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి సీఎం కార్యాలయానికి దూరంగా ఉంటున్న జైన్.. హఠాత్తుగా రాజీనామా చేయటం విశేషం. ఇప్పటికే వరుస ఆరోపణలతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న కేజ్రీవాల్‌కు.. ఇప్పుడు జైన్ రాజీనామా దిగ్భ్రాంతికి కలిగించేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
కేజ్రీవాల్ ఇంట్లో సీసీటీవీ దృశ్యాలు ట్యాంపరింగ్
న్యూ ఢిల్లీ : ఢిల్లీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అన్షు ప్రకాశ్‌పై దాడి కేసులో ఆప్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలే సూచనలే కన్పిస్తున్నాయి. సీఎం ఆరవింద్ కేజ్రీవాల్ నివాసం నుంచి సేకరించిన సీసీటీవీ దృశ్యాలు ట్యాంపరింగ్ జరిగినట్టు తెలుస్తుందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న కేజ్రీవాల్‌ని ఇది మరింత ఇబ్బందులకు గురిచేసేలా ఉంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ బెయిల్ పిటిషన్‌పై తీస్ హజారి అడిషనల్ సెషన్ష్ కోర్టు జడ్జీ అంజు బజాజ్ చందన విచారణ చేపట్టారు. సీఎస్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లాడని చెబుతున్న సమయానికి, సీసీటీవీలో నమోదైన సమయానికి మధ్య వ్యత్యాసం ఉందని పోలీసులు తెలిపారు. కేజ్రీవాల్ సలహాదారుడు వీకే జైన్ సీఎస్ అర్థరాత్రి తర్వాత సీఎం నివాసానికి వచ్చారని పేర్కొన్న విషయాన్ని కూడా కోర్టు ముందు ఉంచారు. దీనిపై డిఫెన్స్ లాయర్ బీఎస్ జూన్ వాదిస్తూ సీసీటీవీలో సీఎస్ కేజ్రీవాల్ నివాసానికి 11.24 గంటలకు వచ్చి, 11.31 కు వెళ్లినట్టు తెలుస్తోందన్నారు. ఇది పోలీసులు చెబుతున్న సమయానికి దాదాపు నలభై నిమిషాల తేడా ఉందన్నారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక వస్తే ఏది నిజమో తెలుస్తోందన్నారు. దీనిపై పబ్బిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. ఎమ్మెల్యే జర్వాల్‌పై ఇంతకు ముందు అనేక కేసులు ఉన్నాయని తెలిపారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన జూన్, అతను ఏ కేసులోను దోషిగా తెలలేదన్నారు. ఇది ఒక రాజకీయ కక్ష సాధింపుగా పేర్కొన్నారు. ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించక ముందే కేసు నమోదు చేశారన్నారు. అందువల్ల ఈ కేసుని పరిగణలోకి తీసుకొకూడదని అన్నారు. ఈ దాడి సీఎం క్యాంప్ ఆఫీస్‌లో జరగలేదని, సీఎం నివాసంలోని డ్రాయింగ్ రూంలో జరిగిందని ఆడిషనల్ డీసీపీ హీరేంద్ర సింగ్ కోర్టుకి తెలిపారు. జర్వాల్ గతంలో కింది స్థాయి అధికారులపై దాడి చేశాడని, ఇప్పుడు ఉన్నత స్థాయి అధికారిపై దాడికి పాల్పడ్డడాని పేర్కొన్నారు. జర్వాల్ బెయిల్ ఫిటిషన్‌పై తీర్పును కోర్టు మంగళవారం మధ్యహ్నం 2 గంటలకు వెల్లడించనుంది. -
'మేం ఒప్పుకోం.. సీఎం సారీ చెప్పాల్సిందే'
సాక్షి, న్యూఢిల్లీ : తమ పార్టీ ఎమ్మెల్యేలు దాడి చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పాల్సిందేనని ఢిల్లీలోని ఐఏఎస్ అధికారుల ఫోరం డిమాండ్ చేసింది. నల్ల బ్యాడ్జీలు కట్టుకొని వారంతా నిరసన వ్యక్తం చేస్తూ ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. 'ముఖ్యమంత్రి మాకు లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. జరిగిన సంఘటనపై క్షమాపణలు చెప్పాల్సిందిపోయి వారు తోసిపుచ్చుతున్నారు. దీని ప్రకారం, సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం కూడా ఈ దాడి కుట్రలో భాగస్వామ్యం అయినట్లు అనిపిస్తోంది' అని ఐఏఎస్‌ల ఫోరం సెక్రెటరీ పూజ జోషి అన్నారు. ప్రచార ప్రకటనలకు సంబంధించి మాట్లాడాలని అర్థరాత్రి పిలిపించి తనపై దాడికి పాల్పడ్డారని ఢిల్లీ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అన్షు ప్రకాశ్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, అన్షు చేసిన ఆరోపణలను కేజ్రీవాల్, ఆయన మంత్రి వర్గం ఖండించింది. అయితే, అన్షుపై దాడి నిజంగానే జరిగినట్లు నిర్ధారణ అయింది. దాడి కారణంగా ఆయన కింది పెదవి కమిలిపోయిందని, చెవుల లోపలి భాగంలో చీము కూడా వస్తుందని వైద్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయనకు చికిత్స చేసిన వివరాలతో కూడిన ఒక పేజీ నివేదికను కూడా బహిరంగ పరిచారు. ఆయనకు మెడ భాగంలో కూడా కొంచెం దెబ్బ తగిలిందని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా ఈ ఘటనపై పోలీసులు తాజాగా ప్రకటన చేస్తూ కేజ్రీవాల్ ఇంటి నుంచి తాము స్వాధీనం చేసుకున్న సీసీటీవీ ఫుటేజీని చెరిపేసి ప్రయత్నం చేశారని, అందులో టైమింగ్స్ వేర్వేరు చూపిస్తున్నాయని, ఫుటేజిని ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు. -
ఈ ధోరణికి పేరేమిటి?
ఆ పార్టీ వాళ్లు ఇలాంటి హింసను చట్టబద్ధం చేస్తే ఆ స్థాయి అధికారుల మీద దాడికి సంబంధించి దేశం నలుమూలలా ఉన్న కొరకరాని కొయ్యల వంటి రాజకీయనాయకులకు వేరే విధమైన సంకేతాలు వెళతాయి. నిజాయితీ కల అధికారి ఒక ముఖ్యమంత్రి లేదా కేంద్ర మంత్రి ఆదేశాలను తప్పుడు ఆదేశాలుగా భావించి తిరస్కరించినప్పుడు దానికి పరిష్కారం ఊహించండి. అలాంటి అధికారిని మీ ఇంట్లో జరిగే భేటీలోనో లేక అతడి కార్యాలయంలోనో చితకబాదడమే పరిష్కారమా? ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గుండెలు తీసిన భయానక వీధి రౌడీలతో రూపొం దిందన్న విషయంలో ఎవరికీ అనుమానం లేదు. కానీ ఆప్‌ను గట్టిగా వ్యతిరేకించేవారితో సహా చాలామంది అంగీకరించే మరొక విషయం మాత్రం ఉంది. నరేంద్ర మోదీ ప్రభ వెలిగిపోతున్న కాలంలో, అంటే 2014–15 సంవత్సరం శీతాకాలంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ 70 స్థానాలకు గాను 67 చోట్ల గెలిచింది. అలా అధికారం చేపట్టినప్పటి నుంచి బీజేపీకి అది ఇబ్బందికరంగా పరిణిమించింది. కేంద్రం ఆ పార్టీ ప్రభుత్వంతో ప్రచ్ఛన్నయుద్ధం ప్రారంభించింది కూడా. ఆఖరికి పూర్తి రాష్ట్ర హోదా లేనప్పటికి, ఉన్న ఆ తక్కువ అధికారాలను కూడా చలాయించకుండా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి, మృదుభాషి, చాలామంది అభిమానించే అన్షు ప్రకాశ్ (1986 బ్యాచ్) మీద సోమవారం రాత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి నివాసంలో చేయి చేసుకున్న సంఘటన జరిగిందని చెబితే, దానిని చాలామంది సందేహిస్తారంటే నేను నమ్మను. ప్రభుత్వాలకీ, అధికారులకీ ఘర్షణ పాతదే ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకీ, ప్రభుత్వోద్యోగులకీ మధ్య ఘర్షణ కొత్త విషయం కాదు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సహా ప్రభుత్వోద్యోగులను ముఖ్యమంత్రులు కించపరిచే సంస్కృతి కూడా కొత్తది కాదు. చాలామంది నాయకులు అధికారులను తమ తస్మదీయుల చుట్టూ తిరిగేటట్టు చేసి, అందులో నుంచి పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మాయావతి అధికారుల బదలీ విషయంలో మహారాణి అనిపించుకున్నారు. అలాంటి అధికారాన్ని చలాయించడం గర్వకారణంగా కూడా ఆమె భావించేవారు. 2005లో ఆమెతో నేను ‘వాక్ ది టాక్’ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ విషయాన్ని మాయావతి ఘనంగా చెప్పారు కూడా. తన గురువు కాన్షీరామ్‌ను మొదటిసారి కలుసుకున్నప్పుడు (ఈ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు కాన్షీరామ్ హుమాయూన్ రోడ్‌లోని నివాసం ఫస్ట్‌ఫ్లోర్‌లో కోమాలో ఉన్నారు) ఆమె ఐఏఎస్ పరీక్షకు సమాయత్తమవుతున్నారు. ఐఏఎస్ పరీక్షను పట్టించుకోవద్దనీ, తనతో పాటు రాజకీయాలలో చేరమని ఆయన చెప్పారు. ‘నీవు మామూలు ఐఏఎస్ అధికారివి కావాలని అనుకుంటున్నావు. కానీ ఆ ఐఏఎస్ అధికారులంతా నీ చుట్టూ తిరిగేటట్టు నేను చేస్తాను’ అని ఆయన అన్నారు. అలాగే చేసిన వాగ్దానాన్ని కాన్షీరామ్ నిలబెట్టుకున్నారు కూడా. బెహెన్జీ కూడా ఏమీ తగ్గకుండా వారిని తన చుట్టూ తిప్పించుకున్నారు. 2007 ఎన్నికల సమయంలో బదయూన్లో జరిగిన ఒక సభలో సభికుల హర్షధ్వానాల నడుమ ఇందుకు తగ్గట్టే ఆత్మస్తుతి కూడా చేసుకున్నారు. తను పేరు చెబితేనే ఉద్యోగస్వామ్యం గడగడలాడిపోతుందని ఆమె అన్నారు. మాయావతి అంటే గడగడలాడిపోవడానికి అవసరమైనంత భయాన్ని ఆమె అధికారులకి పుష్కలంగా ఇచ్చారు. ఆమె తరుచూ వారిని బదలీలు చేసేవారు. బదలీ చేసిన కొత్త ప్రదేశానికి వారు కుటుంబాలను తరలించే అవకాశం లేకుండా అవి జరిగేవి. దీనితో కుటుంబాలను పదే పదే తిప్పడం ఇష్టం లేక ఉద్యోగులు సర్కిట్ హౌస్‌లో మకాం పెట్టేవారు. చదువుకుంటున్న పిల్లలు ఉంటే మరీ ఇబ్బంది. ఏ పోస్టులో ఎవరు ఎంతకాలం ఉంటారో ఎవరికీ తెలిసేది కాదు. నిజానికి మాయావతి అంటే ఎంత భయపడేవారో, అంతగానూ అధికారులు ద్వేషించేవారు. కేంద్ర సర్వీసులలోకి, ఆఖరికి ద్వితీయ స్థానాలకు వెళ్లడానికి కూడా ప్రయత్నించేవారు. ఇలా ఉద్యోగుల పట్ల దురుసుగా వ్యవహరించిన రాష్ట్రాలలో నాకు తెలిసి హరియాణా కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా బన్సీలాల్, ఓంప్రకాశ్ చౌతాలా హయాములు అధికారులను వేధించడానికి పేర్గాంచాయి. ఆ సమయంలో అక్కడ తరుచూ ఉద్యోగుల బదలీలు ఉండేవి. వారి మీద అవినీతి కేసులు మోపేవారు. విజిలెన్స్ దర్యాప్తులు వంటి చర్యలు ఉండేవి. అలాగే అంతకు ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఇష్టులని పేరు పడిన వారికి బాధ్యతలు అప్పగించకుండా కూర్చోబెట్టడం కూడా జరిగేది (ఇలాంటి శిక్షకే ఖుద్దే లైన్ అని పేరు. అదేమిటో అనువదించి చెప్పడం ఇక్కడ బొత్తిగా అనవసరం). ఇలాంటి ఉదాహరణలు ఇంకా చాలా చెప్పవచ్చు. రాజకీయ నేతల కుత్సిత మనస్తత్వానికి అద్దం పడుతూ ఉండే ఇంకొన్ని వాస్తవిక ఘటనలను కూడా ఉదాహరించవచ్చు. పత్రికా రచయితగా నా నలభయ్ ఏళ్ల జీవితంలో ఇలాంటి మరొక ఘటన జరిగినట్టు వెంటనే చెప్పమంటే నాకు కష్టమే. ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీద చేయి చేసుకోవడం, అందులోను ముఖ్యమంత్రి నివాసంలో అది జరిగిన ఉదంతం నాకు తక్షణం ఏదీ గుర్తుకు రావడం లేదు. దాడి జరగలేదంటే ఎవరూ నమ్మరు వైద్యుల నివేదిక, ఇప్పటిదాకా లభించిన వీడియో ఆధారాలు పరిశీలించినా, మూడు దశాబ్దాలుగా మంచి పేరు సంపాదించుకున్న అన్షు ప్రకాశ్ మాటను బట్టి ముఖ్యమంత్రి నివాసంలో దాడి జరిగిందనే వాస్తవాన్ని సందేహించడానికి అవకాశం తక్కువే. కాబట్టి ఇందులో వాస్తవం ఏమిటి అనేదాని గురించి చర్చ అనవసరం. ఇప్పుడు ముఖ్యమంత్రి సహాయకుడు వీకే జైన్ కూడా ప్రకాశ్ మీద చేయి చేసుకున్న మాట నిజమని నిర్ద్వంద్వంగా చెబుతున్నారు. రోజులూ గంటలూ గడిచే కొద్దీ ఆప్ అధికార ప్రతినిధి సహా ఇతర నాయకులు కూడా తమ తమ వైఖరులను సడలిస్తూ వచ్చారు. అసలు అలాంటి దాడి ఏదీ జరగలేదని మొదట చెప్పారు. తరువాత మరింత అలక్ష్యంతో, న్యాయమూర్తి లోయా హత్య కేసులో అమిత్‌షాను ప్రశ్నించడానికి ఏమీ లేనట్టే భావిస్తూ, ‘ఏవో రెండు దెబ్బల’కే ముఖ్యమంత్రి ఇంటికి పోలీసులను పంపించి విచారిస్తారు అనే వరకు వారి మాటలు నడిచాయి. ఈ వైఖరిని మీరు పాత తరహా దబాయింపు అని పేర్కొనవచ్చు. నేను ఇంకో అడుగు ముందుకు వేసి దీనిని రాజ్యాంగపరమైన దురహంకారానికి మించినదని అంటాను. పశ్చాత్తాపం సంగతి పక్కన పెడదాం. మీ పాలనలో ఉన్న వ్యక్తి మీద జరిగిన దాడికి చిన్న సానుభూతి పదం కూడా నోటి నుంచి రాలేదు. భౌతికదాడికి గురైన వ్యక్తికి సంఘీభావం అసలే ప్రకటించలేదు. ఢిల్లీ స్థాయిలో అరవింద్ కేజ్రీవాల్ ఆప్, కేంద్రంలో నరేంద్ర మోదీ బీజేపీ గడచిన మూడేళ్లుగా సంఘర్షిస్తూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనీ, పంపిన ఫైళ్లనీ లెఫ్టినెంట్ గవర్నర్లు నిరాకరిస్తూనే ఉన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు చేసిన నియామకాలను లెఫ్టినెంట్ గవర్నర్లు మార్చడం లేదా నిరాకరించడం చేశారు. ముఖ్యమంత్రి సన్నిహిత ఐఏఎస్ అధికారి రాజేంద్రకుమార్ మీద సీబీఐ దాడి చేయించి అవినీతి కేసును నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న అవినీతి నిరోధక శాఖను వారి అధీనం నుంచి తొలగించారు. ఆర్థిక లబ్ధి ఉన్న పదవులలో ఉన్నారన్న ఆరోపణతో ఈ మధ్యనే 20 మంది ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులను చేస్తూ ఎన్నికల సంఘం రాష్ట్రపతికి సిపారసు చేసింది. ఆ వారాంతంలోనే రాష్ట్రపతి అనుమతి కూడా వచ్చింది. ఇలా చెప్పుకుంటూ వెళితే ఆ జాబితాకు అంతు ఉండదు. కానీ ఇది అధికారులు, నియమ నిబంధనల పేరుతో కేంద్రం వైపు నుంచే ఎక్కువ దాడి జరిగిన సంగతిని మనకి చెబుతుంది. దీనికి కేవలం మాటలతోనే ఆప్ ఎదురుదాడికి దిగింది. ఆ మాటలలో చాలా ప్రసిద్ధమైనవి లేదా చాలా అవమానకరమైనవి మోదీని గురించి కేజ్రీవాల్ చేసిన వర్ణనలే. మోదీని కేజ్రీవాల్ అబద్ధాల కోరు, మానసిక రోగి అన్నారు. ప్రకాశ్ మీద జరి గిన దాడి నేపథ్యంలో ఈ మాటల యుద్ధం పరాకాష్టకు చేరుకుంది. ఇదే సంస్కృతి విస్తరిస్తే... ఇది దేనికి దారితీస్తుందంటే, మనం దేనిని మున్నెన్నడూ లేనిది అంటున్నామో, అదే కొత్త ఉదాహరణను కూడా ప్రవేశపెడుతుంది. అన్షు ప్రకాశ్ విషయంలో మనలని ఎక్కువ భయపెట్టేది అదే. ఆప్‌ను భయానక వీధి రౌడీల మూక అని మనం చెప్పాల్సిందే. కానీ ఆ పార్టీ వాళ్లు ఇలాంటి హింసను చట్టబద్ధం చేస్తే ఆ స్థాయి అధికారుల మీద దాడికి సంబంధించి దేశం నలుమూలలా ఉన్న కొరకరాని కొయ్యల వంటి రాజకీయనాయకులకు వేరే విధమైన సంకేతాలు వెళతాయి. నిజాయితీ కల అధికారి ఒక ముఖ్యమంత్రి లేదా కేంద్ర మంత్రి ఆదేశాలను తప్పుడు ఆదేశాలుగా భావించి తిరస్కరించినప్పుడు దానికి పరిష్కారం ఊహించండి. అలాంటి అధికారిని మీ ఇంట్లో జరిగే భేటీలోనో లేక అతడి కార్యాలయంలోనో చితకబాదడమే పరిష్కారమా? ఈ వ్యవహారంలో మనకు వినపడుతున్న వాదనల్లో ఒకటి ఏమిటంటే.. ప్రధాన కార్యదర్శి లేక అధికారులు.. రెండున్నర లక్షలమంది ప్రజలకు రేషన్ కార్డులను తిరస్కరించిన విషయాన్ని పట్టించుకోలేదన్నదే. అలా అని చెప్పి రాజకీయ నేతలు ఈ అధికార్ల పైకి మూకను ఉసిగొల్పుతారా? రాజకీయ నేతలు, ప్రభుత్వ సర్వీసులో ఉన్న అధికారులకు మధ్య సున్నితమైన సంబంధం ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా ఎదుర్కోవాలనేది మంచి నాయకత్వానికి తెలుసు. ఒక రాష్ట్ర నాయకుడు, అదీ ఢిల్లీ వంటి పరిమిత అధికారాలు కల రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి సమస్యలను పరిణామాలు దిగజారిపోని రీతిలో పరిష్కరించాల్సి ఉంది. తనకు సాధ్యం కానప్పడు సమస్యను అత్యున్నత రాజ్యాంగాధికారుల దృష్టికి తీసుకుపోవలసి ఉంటుంది. అది కూడా విఫలమైతే, బహిరంగంగా నిరసన తెలుపడం, మీడియా దృష్టికి తీసుకుపోవడం, (ఆప్‌కి ఇది వెన్నతో పెట్టిన విద్య) వంటి అవకాశాలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. కానీ మీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీ ఇంట్లో దెబ్బలు తినడం – రెండు చెంపదెబ్బలే కావచ్చు– గర్వించవలసిన విషయం మాత్రం కాదు. 2014లో నా పుస్తకం ‘యాంటిసిపేటింగ్ ఇండియా’ ముందుమాటలో నేను ఒక ముఖ్యమైన అంశం ప్రస్తావించాను. మోదీ, రాహుల్, కేజ్రీవాల్ త్రయం మన వర్తమాన రాజకీయాల్లో అద్భుతమైన లక్షణాలను ప్రదర్శించనున్నారని, జర్నలిస్టుల జీవితాలకు ఇవి ఏమాత్రం విసుగెత్తించే క్షణాలు కావని నేను రాశాను. పైగా ఈ ముగ్గురు నేతలూ పరిణితి సాధిస్తారని అభిప్రాయం వ్యక్తం చేశాను. మోదీ ప్రధాన స్రవంతి సమన్వయం వైపుగా పయనిస్తారని, రాహుల్ బహిరంగ జీవితంలో బిడియాన్ని పక్కన పెడతారని రాశాను. కేజ్రీవాల్ వ్యవస్థాగతమైన శాంతివైపు పయనిస్తారని రాశాను. ఈ మూడో అంశంలో నా అంచనా తప్పు అని ఈ వారం మనకు చెబుతోంది. వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ శేఖర్ గుప్తా twitter@shekargupta -
చిక్కుల్లో ఆప్ సర్కారు
సరిగ్గా మూడేళ్లక్రితం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను మట్టి కరిపించి 70 స్థానాలకు 67 గెల్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని వరస సంక్షోభాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఆ పార్టీకి అసెంబ్లీలో ప్రత్యర్థులు దాదాపు లేకపోవచ్చుగానీ వెలుపల చాలామంది ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ల సంగతలా ఉంచి కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్, ఉన్నతా ధికారగణం వగైరాలతో అది వ్యవహరించాల్సి ఉంటుంది. కనుకనే ఆచితూచి అడు గేయడం ఆ పార్టీకి అవసరం. కానీ చాలాసార్లు ఆ విషయంలో అది విఫలమవు తూనే వస్తోంది. తాజాగా అక్కడి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్‌పై ఆప్ ఎమ్మెల్యేలిద్దరు చేయి చేసుకున్న ఉదంతం ఆ సంగతిని రుజువు చేస్తోంది. రాజ్యాం గబద్ధంగా రావలసినవి రాబట్టుకోవడం ముఖ్యమే. కానీ అందుకు అనుసరించే విధానాలు హేతుబద్ధంగా ఉండాలి. పోరాటం విడనాడి ప్రాధేయపడాలని ఎవరూ చెప్పరు. న్యాయంగా రావలసినవాటి గురించి పోరాడటం వేరు – అందుకు దౌర్జన్యానికి దిగడం వేరు. 2015 ఫిబ్రవరిలో అఖండ మెజారిటీ సాధించాక పార్టీ శ్రేణులను ద్దేశించి కేజ్రీవాల్ పదే పదే చెప్పిన మాట–అహంకారాన్ని దరిదాపులకు రానీయొద్దన్నదే. ఈ ఫలితాలు తనను భయపెడుతున్నాయని కూడా అప్పట్లో ఆయనన్నారు. ఇందుకు కారణాలున్నాయి. పోలైన ఓట్లలో 54.3 శాతం ఆయన పార్టీ ఖాతాలోనే పడ్డాయి. కాంగ్రెస్, బీజేపీలకొచ్చిన ఓట్ల శాతాలను కలిపినా అది ఆప్ దరిదాపుల్లో లేదు. బీజేపీకి 32.3 శాతం, కాంగ్రెస్‌కు 9.7 శాతం మాత్రమే వచ్చాయి. కనుకనే కేజ్రీవాల్ తమ పార్టీ శ్రేణులకు అంతగా హితవు చెప్పారు. కానీ ఢిల్లీ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేల్లో కొందరి సంగతలా ఉంచి కేజ్రీవాలే దీన్ని మరిచిపోయా రని ఈ మూడేళ్లలో జరిగిన పరిణామాలు చెబుతున్నాయి. ఏదో విషయంలో అటు కేంద్రంతోనూ, ఇటు అధికార యంత్రాంగంతోనూ అక్కడి ప్రభుత్వం ఘర్షణ పడు తూనే ఉంది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అధికార నివాసంలో సమావేశం జరిగినపుడు ఆప్ ఎమ్మెల్యేలు అమనతుల్లా ఖాన్, ప్రకాష్ జర్వాలు తనపై పిడిగుద్దులు కురిపించి గాయపరిచారని అన్షుప్రకాష్ కేసు పెట్టగా, ఆయన తమను కులం పేరుతో దూషిం చాడని ప్రకాష్ జర్వాతోపాటు మరో ఎమ్మెల్యే అజయ్ దత్ కేసు పెట్టారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పెట్టిన కేసులో ఇద్దరు ఎమ్మెల్యేలనూ అరెస్టు చేసి రిమాండుకు పంపారు. తొలుత ఈ ఘటనను తాను చూడలేదని బుధవారం చెప్పిన కేజ్రీవాల్ సలహాదారు వీకే జైన్... ఆ తర్వాత స్వరం మార్చి అందుకు తాను ప్రత్యక్షసాక్షినని గురువారం వాంగ్మూలం ఇచ్చారు. ఇందులో నిజానిజాలేమిటన్న సంగతలా ఉంచి అసలేమీ జరగకుండా పరిస్థితి ఇంతవరకూ రాదన్నది వాస్తవం. చానెళ్లకు విడుదల చేయాల్సిన ఒక వాణిజ్య ప్రకటన గురించి, రేషన్ పంపిణీ గురించి ఇంత వివాదం తలెత్తిందంటే, అది సీనియర్ ఐఏఎస్ అధికారిని కొట్టేంతవరకూ వచ్చిందంటే ఆశ్చ ర్యం కలుగుతుంది. ఇంతకూ రేషన్ పంపిణీ గురించి జరిగిన ఈ సమావేశంలో పౌరసరఫరాల మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ లేరు! ఇలా అధికారులతో ఆప్ నేతలు గొడవపడటం తొలిసారి కాదు. కీలకమైన అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం వద్దే కేంద్రీకృతమైన ఢిల్లీ వంటిచోట కొందరు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వంపై చిన్న చూపు ఉన్నదంటే అందులో వింతేమీ లేదు. అలాంటి పరిస్థితిని తమకు అనుకూ లంగా మలుచుకుని ఎదగడానికి ప్రయత్నించేవారు సహజంగానే ఉంటారు. అలాగే ఎన్నికైన ప్రజా ప్రతినిధులు చిత్తశుద్ధితో మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నారని గ్రహించి ప్రజలకు ఉపయోగపడే పథకాలు, కార్యక్రమాలు అమలు కావడానికి దోహదపడేవారూ ఉంటారు. అంతిమంగా ఇలాంటి అధికారులందరితో పనిచే యించుకోవాల్సింది, సమన్వయంతో మెలగాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. కేంద్ర, రాష్ట్రాల మధ్య వైరం వల్ల తమకు సస్పెన్షన్లు, వేతనాల కోతలు, సీబీఐ దాడులు తప్పడం లేదని ఆమధ్య ఢిల్లీ ఐఏఎస్‌ల సంఘం, సబార్డినేట్ సర్వీసుల సంఘం ఆవేదన వ్యక్తం చేశాయి. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై అఖిల భారత ఐఏ ఎస్‌ల సంఘం సకాలంలో స్పందించి అటు తమ సహచరుల పనితీరు విషయంలో సలహాలిస్తూ ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి వారెదుర్కొంటున్న సమస్యల్ని తీసుకెళ్లి ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదు. ఈ పరిణామాల పర్యవసా నంగా కేజ్రీవాల్ ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతిన్నట్టే అధికారగణం విశ్వసనీయతపై కూడా సందేహాలు ఏర్పడుతున్నాయని ఆ సంఘం గుర్తించాలి. ఢిల్లీ పరిస్థితి విచిత్రమైనది. అక్కడ పేరుకు ప్రభుత్వం, అసెంబ్లీ ఉన్నా... ఆ ప్రభుత్వం దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరి అధికారాలు చలాయించలేదు. శాసనాలు చేయడానికి అసెంబ్లీకి ఉండే అధికారాలు కూడా పరిమితమైనవి. ప్రతి దానికీ కేంద్రం వైపు చూడాల్సిందే. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అత్యంత కీలకమైన ఉపకరణమని భావించే పోలీసు శాఖ కూడా కేంద్రం చేతుల్లోనే ఉంటుంది. అది దేశ రాజధాని ప్రాంతం కావడం వల్ల రాజ్యాంగంలోని 239ఏఏ అధికరణ ద్వారా ఈ ప్రత్యేక పరిస్థితిని కల్పించారు. అయితే ఢిల్లీకి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తా మని ఒకానొక సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్, బీజేపీలు రెండూ కేంద్రంలో తమ నేతృత్వంలో ప్రభుత్వాలు వచ్చినా ఆ హామీ నెరవేర్చడానికి సిద్ధ పడలేదు. 2013లో ఎన్నికై స్వల్పకాలం పాలించిన సమయంలో యూపీఏ సర్కారు ఉన్నా, ఇప్పుడు ఎన్డీఏ సర్కారున్నా ఆప్ సమస్యలు షరా మామూలే. ఢిల్లీ సర్కా రుకు తగినన్ని అధికారాలివ్వడమంటే వ్యక్తిగతంగా కేజ్రీవాల్‌కు అధికారా లివ్వడం కాదు. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజల అభీష్టాన్ని, ఆకాంక్షలను గుర్తిం చడం. వారికి మెరుగైన పాలన అందడానికి దోహదపడటం. భిన్నాభిప్రాయాలున్న వ్యక్తులనూ, పార్టీలనూ, ప్రభుత్వాలనూ గౌరవించే సంస్కృతిని ఆచరిస్తే ప్రజాస్వా మ్యంపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది. వారికి కూడా ప్రజాస్వామిక సంస్కృతి అలవడుతుంది. అందుకు బదులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం కలహిం చుకున్నప్పుడు ఓడేది ప్రజాస్వామ్యమే. -
కేజ్రీవాల్ ఇంటికి 70మంది పోలీసులు
-
కేజ్రీవాల్ ఇంటికి 70మంది పోలీసులు
సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్‌పై దాడి విషయంలో ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్ ఇంటికి వచ్చారు. దాడికి సంబంధించిన ఆధారాలు దొరుకుతాయోమోనని ఇళ్లు మొత్తం సోదాలు నిర్వహించడం మొదలుపెట్టారు. ఈ చర్యను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. తన ఇంట్లో సోదాలు చేయడం కాదని, పోలీసులకు దమ్ముంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను లోయా కేసు విషయంలో ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. మరోపక్క, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేతలు అశుతోష్, సంజయ్ సింగ్ పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. తమ పార్టీని, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఇదంతా బీజేపీ చేస్తున్న కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసులు కావాలనే అరవింద్ కేజ్రీవాల్ సలహాదారుపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ రోజు దాడి ఘటనకు సంబంధించి వారికి అనుకూలంగా మార్చి ప్రకటన చేయించుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అధికార ప్రతినిధి అరుణోదయ్ ప్రకాశ్ ట్విటర్ ద్వారా తెలిపిన వివరాల ప్రకారం 60 నుంచి 70 మంది పోలీసులు కేజ్రీవాల్ నివాసం చేరుకున్నారు. 'సీఎం ఇంటిని పూర్తిగా పోలీసులు ఆక్రమించారు. పెద్ద మొత్తంలో ఎలాంటి అనుమతి లేకుండానే పోలీసులు ప్రవేశించారు. ఢిల్లీ పోలీసులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ప్రజాస్వామ్యంలో కనీస మర్యాద అంటూ ఒకటి ఉంటుంది. ప్రతి పౌరుడికి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులున్నాయి. పేదలకోసం, ఒక మంచి సమాజం కోసం అలుపెరగకుండా పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఇంత దారుణంగా అవమానిస్తారా?' అని అరుణోదయ్ ట్విటర్ ద్వారా ప్రశ్నించారు. CM house taken over by police. Huge number of police force enters CM house without any intimation. Police Raj kills democracy in Delhi. Police spread all over inside CM house. If this what they can to do an elected CM, think what they can with poor people!!! — arunoday (@arunodayprakash) February 23, 2018 There is minimum courtesy in democracy. Every citizen has rights under constitution. Is it an attempt to humiliate a CM who is working tirelessly for the poor and the last man of the society? — arunoday (@arunodayprakash) February 23, 2018 -
కేజ్రీవాల్ కొంప ముంచాడు
సాక్షి, న్యూఢిల్లీ : తాము అసలు దాడి చేయలేదని, కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌పై జరిగిన దాడి విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతుండగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సలహాదారు కొంపముంచారు. దాడిని తాను స్వయంగా చూశానని కేజ్రీవాల్ సలహాదారు వీకే జైన్ పోలీసులకు చెప్పారు. ప్రకాశ్‌పై ఆప్ ఎమ్మెల్యేలు అమనుతుల్లా ఖాన్, ప్రకాశ్ జర్వాల్ దాడి చేయడం తాను చూశానని, తానే అందుకు సాక్షినంటూ వెల్లడించారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌కు గురువారం వివరించారు. సీఎస్ ప్రకాశ్‌పై దాడి చేసిన నేపథ్యంలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించేందుకు రిమాండ్‌లోనే ఉంచాలంటూ మేజిస్ట్రేట్‌ను కోరారు. ఆ ఇద్దరికి ఇప్పుడే బెయిల్ ఇవ్వొద్దని, తాము మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. అయితే, ఇరువురి వాదనలు విన్న మేజిస్ట్రేట్ తుది నిర్ణయాన్ని వెలువరించలేదు. దీనిపై నేడు (శుక్రవారం) తేలాల్సి ఉంది. మరోపక్క, ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించని విషయం తెలిసిందే. -
'అది నిజమే.. కింది పెదవి కమిలిపోయింది'
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అన్షు ప్రకాశ్‌పై దాడి నిజంగానే జరిగినట్లు నిర్ధారణ అయింది. దాడి కారణంగా ఆయన కింది పెదవి కమిలిపోయిందని, చెవుల లోపలి భాగంలో చీము కూడా వస్తుందని వైద్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయనకు చికిత్స చేసిన వివరాలతో కూడిన ఒక పేజీ నివేదికను బహిరంగ పరిచారు. ఆయనకు మెడ భాగంలో కూడా కొంచెం దెబ్బ తగిలిందని పేర్కొన్నారు. సోమవారం రాత్రి తనపై ఆప్ ఎమ్మెల్యేలు దాడి చేశారని సీఎస్ అన్షు ప్రకాశ్ ఢిల్లీ ఉత్తర డీసీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ‘సోమవారం రాత్రి 8.45 గంటలకు సీఎం సలహాదారు నాకు ఫోన్ చేసి అర్ధరాత్రి సీఎం నివాసంలో సమావేశానికి హాజరుకావాలని చెప్పారు. అక్కడికి వెళ్లాక ప్రచార ప్రకటనలకు సంబంధించి వివరణ అడుగుతూనే నాపై ఎమ్మెల్యేలు అమానతుల్లా ఖాన్, ప్రకాశ్ జర్వాల్ దాడి చేశారు. అదృష్టం కొద్ది ఏదో ఒకలా తప్పించుకొని బయటపడ్డాను' అని ప్రకాశ్ చెప్పిన విషయం తెలిసిందే. లెఫ్టినెంట్ గవర్నర్‌కు కూడా ఆయన సమాచారం ఇచ్చారు. మరోవైపు ఈ దాడి కేసులో ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. అలాగే, దీనిపై స్పందించేందుకు సీఎం కేజ్రీవాల్ కూడా నిరాకరించారు.