రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టు రేపటికి(బుధవారం) వాయిదా వేసింది.
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టు రేపటికి(బుధవారం) వాయిదా వేసింది. స్టేటస్ రిపోర్టు సమర్పించాలని ఢిల్లీ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. లొంగిపోయేందుకు తమకు భద్రత కల్పించాలని ఉమర్ ఖలీద్, మరికొందరు జేఎన్ యూ విద్యార్థులు పెట్టుకున్న పిటిషన్ ను విచారణకు హైకోర్టు స్వీకరించింది.
రాజద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్, ఇతర విద్యార్థులను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన మరో పిటిషన్ పై విచారణకు కూడా ఉన్నత న్యాయస్థానం అంగీకరించింది. చట్టానికి అడ్డుతగులుతున్న జేఎన్ యూ వీసీ, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఈ పిటిషన్ లో కోరారు.