సాక్షి, న్యూఢిల్లీ: బీమా కోరేగావ్ కేసులో నిందితుడు వరవరరావు శాశ్వత బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 11న విచారణ చేపడతామని సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రస్తుతం మెడికల్ బెయిల్‌పై ఉన్న వరవరరావు.. శాశ్వత బెయిల్ మంజూరు చేయాలన్న అభ్యర్థనను ఏప్రిల్ 13న బాంబే హైకోర్టు తిరస్కరించింది.
విచారణ సమయంలో.. హైదరాబాద్‌లో ఉండేందుకు అవకాశం ఇవ్వాలన్న పిటిషన్‌నూ తోసిపుచ్చింది. అయితే.. మూడు నెలల పాటు మెడికల్ బెయిల్ పొడిగించింది. ఈ తరుణంలో బాంబే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ వరవరరావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గురువారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలాల వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment