న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్‌కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. జైన్‌తో పాటు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు వైభవ్ జైన్, అంకుశ్ జైన్‌లకు కూడా బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది.
మనీలాండరింగ్ కేసులో సత్యేంజర్ జైన్‌ను మే 30న అరెస్టు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఆయన జూన్‌లో బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా.. నిరాశే ఎదురైంది. ఇప్పుడు రెండో సారి బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది.
ఈ కేసులో విచారణకు జైన్ సహకరించడం లేదని, దర్యాప్తు ముందుకుసాగకుండా తమను తప్పదోవ పట్టిస్తున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో న్యాయస్థానం జైన్‌కు బెయిల్ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసింది.
2017 ఆగస్టు 24న నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా జైన్‌ను ఈడీ అదికారులు మే 30న అరెస్టు చేశారు. అప్పటినుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. తిహాడ్ జైల్లో జైన్‌కు వీఐపీ సదుపాయాలు కల్పిస్తున్నాడనే ఆరోపణలతో ఆ జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశారు.
చదవండి: ధైర్యముంటే భారత్ జోడో యాత్ర ఆపండి.. రాహుల్ గాంధీ ఛాలెంజ్
Comments
Please login to add a commentAdd a comment