JSPL
-
ఫెడరల్ బ్యాంక్ లాభం జూమ్
ముంబై: ప్రైవేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 64 శాతం జంప్‌చేసి రూ. 601 కోట్లను తాకింది. మొండి రుణాలకు కేటాయింపులు తగ్గడం ఇందుకు సహకరించింది. గతేడాది(2021–22) క్యూ1లో రూ. 367 కోట్లు మాత్రమే ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 13 శాతం పుంజుకుని రూ. 1,605 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు నామమాత్ర వృద్ధితో 3.22 శాతానికి చేరాయి. అయితే ఇతర ఆదాయం 30 శాతం క్షీణించి రూ. 453 కోట్లకు పరిమితమైంది. మరోవైపు ఫీజు ఆదాయం రూ. 255 కోట్ల నుంచి రూ. 441 కోట్లకు ఎగసింది. మొత్తం ప్రొవిజన్లు సగానికి తగ్గి రూ. 373 కోట్లకు పరిమితమయ్యాయి. తాజా స్లిప్పేజెస్ రూ. 444 కోట్లుకాగా.. స్థూల మొండిబకాయిలు 3.5 శాతం నుంచి 2.69 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 14.57 శాతంగా నమోదైంది. జేఎస్పీఎల్ లాభం హైజంప్ ప్రైవేట్ రంగ దిగ్గజం జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్పీఎల్) ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 2,771 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 14.2 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 10,643 కోట్ల నుంచి రూ. 13,069 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 7,234 కోట్ల నుంచి రూ. 10,567 కోట్లకు పెరిగాయి. కాగా.. క్యూ1లో స్టీల్ ఉత్పత్తి స్వల్పంగా తగ్గి 1.99 మిలియన్ టన్నులకు పరిమితంకాగా.. అమ్మకాలు 1.61 ఎంటీ నుంచి 1.74 ఎంటీకి బలపడ్డాయి. పెల్లెట్ ఉత్పత్తి 2.16 ఎంటీ నుంచి 1.92 ఎంటీకి వెనకడుగు వేసింది. వీటి విక్రయాలు భారీగా క్షీణించి 0.03 ఎంటీకి చేరినట్లు కంపెనీ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో జేఎస్పీఎల్ షేరు 4.5 శాతం పతనమై రూ. 345 వద్ద ముగిసింది. -
ఇక స్టీల్ ధరలు పైపైకే!
న్యూఢిల్లీ: ఉక్కు ధరలు పెరగనున్నాయి. తయారీ వ్యయం అధికం అయినందున స్టీల్ ధరలు జూలై నుండి పెరుగుతాయని భావిస్తున్నట్టు జిందాల్ స్టీల్, పవర్ ఎండీ వి.ఆర్.శర్మ తెలిపారు. ‘బొగ్గు ధర టన్నుకు రూ.17,000 ఉంది. ఒడిషాలో అతిపెద్ద సరఫరాదారుగా ఉన్న ఒడిషా మినరల్ కార్పొరేషన్ విక్రయిస్తున్న ఇనుము ధాతువు ధర ఇంకా అధికంగా ఉంది. ఇప్పటికే ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇంకా తగ్గించే అవకాశం లేదు. జూలై నుంచి ప్రాథమిక కంపెనీల స్టీల్ ధరలు పైపైకి వెళ్లనున్నాయి. ద్వితీయ శ్రేణి కంపెనీలు ఇప్పటికే టన్నుకు రూ.2 వేలు పెంచడం ద్వారా ధర రూ.55 వేలకు చేరింది. ఇతర సమస్యలూ పరిశ్రమకు భారంగా ఉన్నాయి. బొగ్గు కొరత ఉంది. బొగ్గు సరఫరాకై రేక్స్ అందుబాటులో లేవు’ అని వివరించారు. -
జేఎస్పీఎల్ నష్టాలు రూ.399 కోట్లు
న్యూఢిల్లీ: జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్(జేఎస్పీఎల్) కంపెనీకి రెండో త్రైమాసిక కాలంలో రూ.399 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.279 కోట్ల నికర లాభం వచ్చిందని జేఎస్పీఎల్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.9,983 కోట్ల నుంచి రూ.8,940 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ధరలు, లాభదాయకత బాగా తగ్గినా, రెయిల్స్, ప్లేట్స్ వంటి విభిన్నమైన విలువాధారిత ఉత్పత్తుల తోడ్పాటుతో ఒకింత ఊరట లభించిందని వివరించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రుణ భారం రూ.36,501 కోట్లుగా ఉందని పేర్కొంది. -
తగ్గిన జేఎస్పీఎల్ నష్టాలు
న్యూఢిల్లీ: అధిక ఆదాయాల దన్నుతో నవీన్ జిందాల్ గ్రూపులో భాగమైన జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జేఎస్పీఎల్) జూన్ త్రైమాసికంలో నష్టాలను గణనీయంగా తగ్గించుకుంది. రూ.420 కోట్ల నష్టాన్ని కంపెనీ ప్రకటించింది. ఇది అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ.1,238 కోట్లు కావడం గమనార్హం. మొత్తం ఆదాయం గతేడాది ఇదే కాలంలో పోల్చి చూసుకుంటే 19.5 శాతం పెరుగుదలతో రూ.6,126 కోట్లకు చేరింది. పన్నుకు ముందస్తు లాభం 63 శాతం మెరుగుపడినట్టు కంపెనీ తెలిపింది. ఇక జూన్ క్వార్టర్ నాటికి నికర రుణ భారం అంతకుముందు త్రైమాసికం స్థాయిలోనే కొనసాగింది. స్టీల్ ఉత్పత్తి 1.26 మిలియన్ టన్నులుగా ఉంది. కంపెనీ సబ్సిడరీ జిందాల్ పవర్ లిమిటెడ్ పనితీరు మెరుగుపడింది. నిధుల సమీకరణ ఇక కంపెనీ తన రుణ భారాన్ని తగ్గించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించింది. అధీకృత మూలధనం ప్రస్తుతమున్న రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పెంచేందుకూ బోర్డు అంగీకారం తెలిపింది. -
ఎన్‌సీడీలపై వడ్డీ చెల్లింపుల్లో మరోసారి జేఎస్పీఎల్ విఫలం
న్యూఢిల్లీ: నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ) హోల్డర్లకు వడ్డీ చెల్లింపుల్లో జిందాల్ స్టీల్ అండ్ పవర్ (జేఎస్పీఎల్) మరోసారి విఫలం అరుు్యంది. ఎన్‌సీడీలకు గడువు ప్రకారం అక్టోబర్ 31 లోపు రూ.15.43 కోట్ల మేర వడ్డీ చెల్లించాల్సి ఉండగా, అందులో విఫలమైనట్టు స్వయంగా కంపెనీయే బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సమాచారం ఇచ్చింది. అంతకుముందు సెప్టెంబర్‌లోనూ గడువు తేదీ 30 నాటికి ఎన్‌సీడీలపై వడ్డీ చెల్లింపుల్లో జేఎస్పీఎల్ విఫలమైన విషయం విదితమే. నవీన్ జిందాల్‌కు చెందిన జేఎస్పీఎల్ రూ.46,000 కోట్ల రుణభారంతో సతమతం అవుతోంది. దీన్ని తగ్గించుకునేందుకు గత కొన్ని నెలల కాలంలో కంపెనీ ఆస్తుల విక్రయాలకు ప్రయత్నాలు సాగిస్తోంది. సతారాలోని 24 మెగావాట్ల విండ్ పవర్ ప్లాంట్‌ను ఇండియా ఇన్‌ఫ్రాస్టక్చ్రర్ ఫండ్-2కు విక్రరుుంచనున్నట్టు కంపెనీ అక్టోబర్‌లో ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో ఉన్న వెరుు్య మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్ విక్రయానికీ ఒప్పందం కుదుర్చుకుంది.