ఎన్సీడీలపై వడ్డీ చెల్లింపుల్లో మరోసారి జేఎస్పీఎల్ విఫలం
న్యూఢిల్లీ: నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్‌సీడీ) హోల్డర్లకు వడ్డీ చెల్లింపుల్లో జిందాల్ స్టీల్ అండ్ పవర్ (జేఎస్‌పీఎల్) మరోసారి విఫలం అరుు్యంది. ఎన్‌సీడీలకు గడువు ప్రకారం అక్టోబర్ 31 లోపు రూ.15.43 కోట్ల మేర వడ్డీ చెల్లించాల్సి ఉండగా, అందులో విఫలమైనట్టు స్వయంగా కంపెనీయే బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలకు సమాచారం ఇచ్చింది. అంతకుముందు సెప్టెంబర్‌లోనూ గడువు తేదీ 30 నాటికి ఎన్‌సీడీలపై వడ్డీ చెల్లింపుల్లో జేఎస్‌పీఎల్ విఫలమైన విషయం విదితమే.
నవీన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌పీఎల్ రూ.46,000 కోట్ల రుణభారంతో సతమతం అవుతోంది. దీన్ని తగ్గించుకునేందుకు గత కొన్ని నెలల కాలంలో కంపెనీ ఆస్తుల విక్రయాలకు ప్రయత్నాలు సాగిస్తోంది. సతారాలోని 24 మెగావాట్ల విండ్ పవర్ ప్లాంట్‌ను ఇండియా ఇన్‌ఫ్రాస్టక్చ్రర్ ఫండ్-2కు విక్రరుుంచనున్నట్టు కంపెనీ అక్టోబర్‌లో ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో ఉన్న వెరుు్య మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్ విక్రయానికీ ఒప్పందం కుదుర్చుకుంది.