NCD
-
రూ. 400 కోట్ల సమీకరణలో ముత్తూట్ ఫిన్‌కార్ప్
హైదరాబాద్: ముత్తూట్ ఫిన్‌కార్ప్ సంస్థ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్సీడీ) ద్వారా రూ. 400 కోట్ల వరకు సమీకరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రూ. 300 కోట్ల వరకు గ్రీన్ షూ ఆప్షన్ కింద అట్టే పెట్టుకునే వెసులుబాటుతో రూ. 100 కోట్ల ఎన్సీడీలను జారీ చేసినట్లు సంస్థ తెలిపింది. రూ. 1,000 ముఖ విలువ ఉండే ఎన్సీడీలు సెప్టెంబర్ 14 వరకు అందుబాటులో ఉంటాయి. 24 నెలల నుంచి 96 నెలల వరకు కాలావధి ఉండే ఈ వీటిపై రాబడి రేటు 8.65 శాతం – 9.43 శాతం దాకా ఉంటుందని కంపెనీ సీఈవో షాజీ వర్గీస్ తెలిపారు. రూ. 1,100 కోట్ల వరకు గరిష్ట సమీకరణ పరిమితికి లోబడి తొలి విడతగా ఈ ఎన్సీడీలను జారీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.1,250 కోట్లు సమీకరణ
న్యూఢిల్లీ: గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ ఎన్సీడీల జారీ ద్వారా రూ.1,250 కోట్లు సమీకరించినట్టు ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా హిండెన్‌బర్గ్ నివేదిక విడుదల అయిన తర్వాత, అదానీ గ్రూప్ కంపెనీ తొలిసారి రుణ మార్గంలో నిధులు సమీకరించడం గమనార్హం. రూ.లక్ష ముఖ విలువ కలిగిన 1,25,000 సెక్యూర్డ్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ)ను ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో జారీ చేసినట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు అదానీ ఎంటర్ప్రైజెస్ సమాచారం ఇచి్చంది. ఎన్సీడీ రేటును సంస్థ ప్రకటించలేదు. కానీ, ఎన్ఎస్డీఎల్ డేటా ప్రకారం మూడేళ్ల ఎన్‌సీడీలపై 10 శాతం రేటు ఆఫర్ చేసి నిధులు సమీకరించినట్టు తెలుస్తోంది. అదానీ ఎంటర్ప్రైజెస్ చివరిగా గతేడాది సెపె్టంబర్లో బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించడం గమనార్హం. ప్రస్తుతం ఎన్‌సీడీలపై సంస్థ ఆఫర్ చేసిన 10 శాతం రేటు, ప్రభుత్వ బాండ్ ఈల్డ్ రేటు కంటే 3 శాతం అధికంగా ఉంది. వీటిపై అదానీ ఎంటర్ప్రైజెస్ ఏటా వడ్డీ చెల్లించనుంది. అదానీ గ్రూప్ షేర్ల ధరలు, కంపెనీల ఖాతాల్లో ఎన్నో అవకతవకలు ఉన్నాయంటూ హిండెన్‌బర్గ్ సంస్థ సంచలన ఆరోపణలు చేయడం, దీన్ని అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించడం గుర్తుండే ఉంటుంది. ఈ ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెబీ దర్యాప్తు చేస్తోంది. ఈ పరిణామాల తర్వాత అదానీ గ్రూప్ ప్రమోటర్లు కంపెనీల్లో స్వల్ప వాటాలను సీక్యూజీ పార్ట్న ర్స్కు ప్రైవేటుగా విక్రయించడం ద్వారా ఇన్వెస్టర్ల నమ్మకాన్ని చూరగొనే ప్రయత్నం కూడా చేశారు. -
నిధుల సమీకరణకు హెచ్డీఎఫ్సీ
న్యూఢిల్లీ: మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ నిధుల సమీకరణకు తెరతీసింది. మార్పిడి రహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకోనున్నట్లు తాజాగా వెల్లడించింది. ప్రయివేట్ ప్లేస్మెంట్ పద్ధతిలో పెట్టుబడులను సమీకరించనున్నట్లు పేర్కొంది. పదేళ్ల కాలావధితో ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎన్సీడీలను కేటాయించనున్నట్లు తెలియజేసింది. వెరసి దీర్ఘకాలిక నిధులను అందుకునే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. నిధులను గృహ రుణ బిజినెస్‌కు అవసరమయ్యే ఫైనాన్సింగ్, రీఫైనాన్సింగ్‌కు వినియోగించనున్నట్లు వివరించింది. నిధుల సమీకరణ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ షేరు ఎన్ఎస్ఈలో 0.4 శాతం నీరసించి రూ. 2,643 వద్ద ముగిసింది. -
ఎస్బీఐ కార్డ్ నిధుల సమీకరణ!
న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డ్ దిగ్గజం ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ బిజినెస్ వృద్ధికి అవసరమైన నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు పేర్కొంది. మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 3,000 కోట్లు సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు కంపెనీ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించింది. ఒకేసారి లేదా దశలవారీగా ప్రయివేట్ ప్లేస్మెంట్ పద్ధతిలో ఎన్సీడీల జారీని చేపట్టనున్నట్లు తెలియజేసింది. ఈ వార్తల నేపథ్యంలో ఎస్బీఐ కార్డ్ షేరు ఎన్‌ఎఎస్‌ఈలో స్వల్ప లాభంతో రూ. 918 వద్ద ముగిసింది. -
శారీరక శ్రమతోనే ఎన్సీడీ సమస్యలకు చెక్
సాక్షి, అమరావతి: బీపీ, షుగర్, ఇతర నాన్‌కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) నుంచి బయటపడడానికి నడక, వ్యాయామం వంటి శారీరకశ్రమే శరణ్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు. ఆయన సోమవారం మంగళగిరిలోని తన కార్యాలయం నుంచి రాష్ట్రంలోని ప్రైవేట్, ఎయిడెడ్, సాంకేతిక విద్యాసంస్థల యజమానులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీడీ సమస్యల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎం జగన్ ఆదేశించినట్టు చెప్పారు. ఇందులో భాగంగా అవగాహన కార్యక్రమాలను డ్రైవ్‌లా చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీనికి ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. రోజూ ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు నడక, వ్యాయామాలు చేసుకోవడానికి వీలుగా స్థలాలు, క్రీడామైదానాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. దీనిపై విద్యాసంస్థల యాజమాన్యాలు రెండు, మూడురోజుల్లో తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలపాలని కోరారు. రాష్ట్రంలో 1990లో 30 శాతం ఉన్న ఎన్సీడీ ప్రభావం ప్రస్తుతం 63 శాతానికి పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో 68 శాతం మరణాలకు ఎన్సీడీ సమస్యలే ప్రధాన కారణమన్నారు. ఈ క్రమంలో ఎన్సీడీ సమస్యల కట్టడిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. 30 ఏళ్లు పైబడిన వారికి వైద్యశాఖ స్క్రీనింగ్ చేసి ఆరోగ్య సమస్యలు గుర్తిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి ఐదుగురిలో ఒకరు బీపీ/షుగర్‌తో ఉన్నట్టు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, కమిషనర్ సురేష్‌బాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ హేమచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
టాటా పవర్ నిధుల సమీకరణ
ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా పవర్ మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించింది. ప్రయివేట్ ప్లేస్మెంట్లో భాగంగా 10,000 అన్సెక్యూర్డ్, రీడీమబుల్, ట్యాక్సబుల్, లిస్టెడ్, రేటెడ్, ఎన్సీడీలను జారీ చేసినట్లు కంపెనీ పేర్కొంది. రూ. 500 కోట్ల విలువైన సిరీస్–1 ఎన్‌సీడీలకు 2030 జనవరి 8న, మరో రూ. 500 కోట్ల విలువైన సిరీస్–2 ఎన్‌సీడీలకు 2032 డిసెంబర్ 29న గడువు ముగియనున్నట్లు తెలియజేసింది. ఈ బాండ్లను బీఎస్ఈలో లిస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. ఎన్సీడీల జారీ వార్తల నేపథ్యంలో టాటా పవర్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం నీరసించి రూ. 206 వద్ద ముగిసింది. -
ఎన్సీడీ హోల్డర్లకు వడ్డీ చెల్లింపుల్లో రెలిగేర్ ఫిన్వెస్ట్ డిఫాల్ట్
న్యూఢిల్లీ: నాన్-కన్వర్టబుల్ డిబెంచర్(ఎన్సీడీ) హోల్డర్లకు వడ్డీ చెల్లింపుపై రెలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్(ఆర్ఎఫ్ఎల్) విఫలమైంది. రెలిగేర్ ఎంటర్ర్పైజెస్ మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ, రుణభారంలో ఉన్న తన అనుబంధ సంస్థ రెలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్ (ఆర్ఎఫ్ఎల్) మార్చి 28న నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లకు చెల్లించాల్సిన వడ్డీ చెల్లింపులో డిఫాల్ట్ అయిందని తెలిపింది. ఈ విలువ దాదాపు రూ.2.41 కోట్లని ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సంస్థ తెలిపింది. సంస్థ డిఫాల్ట్ వరుసగా ఇది రెండవనెల. తనకు రావాల్సిన-చెల్లించాల్సిన రుణాల్లో అసమతుల్యత కారణంగా బాండ్ హోల్డర్లకు ఫిబ్రవరి 25న చెల్లించాల్సిన వడ్డీ చెల్లింపులో(రూ. 96 లక్షల వడ్డీ చెల్లింపుల్లో) ఆర్ఎఫ్ఎల్ గత నెల్లో డిఫాల్ట్ అయ్యింది. డిఫాల్ట్ ఎందుకంటే... ఈ మేరకు వెలువడిన ప్రకటన ప్రకారం, ఆర్ఎఫ్ఎల్ రుణదాతలు సూచించినట్లుగా, సంస్థ అన్ని చెల్లింపులకు రుణదాతలు నియమించిన ఏఎస్ఎం (ఏజెన్సీస్ ఫర్ స్పెషలైజ్డ్ మానిటరింగ్) నుండి ముందస్తు ధృవీకరణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని ప్రకారం, ఆర్ఎఫ్ఎల్ 2022 మార్చి 28న చెల్లించాల్సిన అర్హత కలిగిన డిబెంచర్ హోల్డర్లకు ‘ఎన్సీడీల సిరీస్-36 వడ్డీ చెల్లింపు సర్టిఫికేట్ కోసం’ ఏఎస్ఎంను ఆర్ఎఫ్ఎల్ అభ్యర్థించింది. అయితే ఇందుకు ఏఎస్ఎం ఆమోదం లభించలేదు. ఈ కారణంగా, అర్హత కలిగిన హోల్డర్లకు ఎన్సీడీ వడ్డీ మొత్తాన్ని ఆర్ఎఫ్సీ చెల్లించలేకపోతోంది. ఆర్బీఐ దిద్దుబాటు చర్యల చట్రంలో... ఆర్ఎఫ్ఎల్ బలహీన ఆర్థిక స్థితి కారణంగా జనవరి 2018 నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) దిద్దుబాటు చర్యల చట్రంలో (సీఏపీ) ఉంది. తాజా వ్యాపారాన్ని చేపట్టకుండా ఆంక్షలు ఉన్నాయి. రెలిగేర్ ఎంటర్ర్పైజెస్ ప్రమోటర్‌గా కొనసాగుతున్న ఆర్ఎఫ్ఎల్ పునరుద్ధరణ ప్రణాళికను మార్చి 11న ఆర్బీఐ తిరస్కరించింది. రుణభారంలో ఉన్న ఆర్ఎఫ్ఎల్పై ‘‘మోసపూరిత’’ ఆరోపణలు ఉండడమే దీనికి కారణం. అయితే ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ, ఆర్ఎఫ్ఎల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి, స్టే తెచ్చుకుంది. మాజీ ప్రమోటర్లు శివిందర్ సింగ్, అతని సోదరుడు మల్విందర్ సింగ్ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణల కారణంగా కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. దాదాపు రూ. 4,000 కోట్ల ఆర్థిక అవకతవకలపై పలు దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. (చదవండి: అమెరికాలో ఇన్సైడర్ ట్రేడింగ్.. కోట్లు కొల్లగొట్టిన ఏడుగురు భారతీయులు!) -
రెలిగేర్ ఫిన్వెస్ట్ చెల్లింపుల డిఫాల్ట్
న్యూఢిల్లీ: గతంలో జారీ చేసిన మార్పిడి రహిత బాండ్ల (ఎన్సీడీలు)పై వడ్డీ చెల్లింపుల్లో రెలిగేర్ ఫిన్వెస్ట్ లిమిటెడ్(ఆర్ఎఫ్ఎల్) విఫలమైంది. కంపెనీ బాండ్లు కలిగినవారికి ఈ నెల 25న చెల్లించవలసి ఉన్న రూ. 96 లక్షల వడ్డీ చెల్లిం పుల్లో డిఫాల్ట్ అయినట్లు కంపెనీ తాజాగా వెల్ల డించింది. మాతృ సంస్థ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్(ఆర్ఈఎల్) గత ప్రమోటర్లు కంపెనీ నిధులను అక్రమంగా తరలించడం, దుర్వినియోగం చేయడంతో ఆస్తి, అప్పుల సమన్వయంలో తేడాలొచ్చినట్లు వివరించింది. దీంతో తాజా సమస్య తలెత్తినట్లు ఆర్ఈఎల్ అనుబంధ సంస్థ రెలిగేర్ ఫిన్వెస్ట్ పేర్కొంది. కాగా.. ఈ సమస్యల నేపథ్యంలోనే ఆర్ఎఫ్ఎల్ను 2018 జనవరి నుంచి రిజర్వ్ బ్యాంక్ దిద్దుబాటు చర్యల ప్రణాళిక(సీఏపీ)లోకి తీసుకువచ్చింది. -
రూ.1,571 కోట్ల చెల్లింపుల్లో డీహెచ్ఎఫ్ఎల్ డిఫాల్ట్
న్యూఢిల్లీ: బాండ్లు, కమర్షియల్ పేపర్‌కు సంబంధించి రూ.1,571 కోట్ల చెల్లింపుల్లో డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీ విఫలమైంది. ఎన్సీడీ, కమర్షియల్ పేపర్స్‌కు సంబంధించి వడ్డీ చెల్లింపుల్లో విఫలమయ్యామని డీహెచ్ఎఫ్ఎల్ తెలిపింది. ఇటీవల కాలంలో వివిధ చెల్లింపుల్లో విఫలమవుతూ వస్తున్న డీహెచ్ఎఫ్ఎల్ కంపెనీకి దాదాపు రూ.90,000 కోట్ల రుణభారముంది. -
పేరే కాదు... తీరూ వేరువేరే!
ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి మనలో దాదాపు అందరికీ తెలుసు. కానీ, కంపెనీలు జారీ చేసే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ) గురించి తెలిసిన వారు మాత్రం తక్కువే. నిజానికివి కూడా డిపాజిట్ల లాంటివే. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలో వడ్డీ రేటు 7 శాతానికి అటూ, ఇటుగానే ఉంటే... ప్రముఖ ఎన్బీఎఫ్సీలు డిపాజిట్లపై 8 శాతం వడ్డీని ఇస్తుండగా... ఎన్‌సీడీల్లో వడ్డీ రేటు 9 శాతంపైనే ఉంటోంది. దీంతో అధిక వడ్డీ రేటు లభించే ఎన్సీడీల పట్ల ఆకర్షితులవటం సహజమే. అయితే, ఫిక్స్డ్ డిపాజిట్‌తో పోలిస్తే ఎన్సీడీలు కాస్త భిన్నమైనవి. వీటి విలువను ఎలా అంచనా వేయాలనే విషయమై నిపుణులు చెబుతున్న అభిప్రాయాల ఆధారంగా అందిస్తున్న కథనమిది... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం నిబంధనలు వేర్వేరు ఎన్సీడీలు, ఎఫ్‌డీల మధ్య నియంత్రణ పరంగా, వాటి నిర్మాణం పరంగా, రిస్క్ పరంగా చాలా వ్యత్యాసం ఉంది. ఆర్బీఐ వద్ద ప్రత్యేకంగా నమోదు చేసుకున్న ఎన్‌బీఎఫ్‌సీలకు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడానికి అనుమతి ఉంది. అందులోనూ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ క్రెడిట్ రేటింగ్ ఉన్న వాటినే ఫిక్స్డ్ డిపాజిట్ల స్వీకరణకు ఆర్బీఐ అనుమతినిస్తోంది. ఈ కంపెనీలు కూడా తమ సొంత నిధులతో పోలిస్తే గరిష్టంగా ఒకటిన్నర రెట్ల వరకే ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించేందుకు వీలుంటుంది. అలాగే, 1–5 ఏళ్ల కాల వ్యవధితో జారీ చేయాలి. పైపెచ్చు వార్షిక వడ్డీ 12.5%కి మించి ఆఫర్ చేయడానికి వీల్లేదు. ఈ సంస్థలు స్వీకరించిన డిపాజిట్లను తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ఆడిటర్లు ఎప్పటికప్పుడు ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఎన్సీడీలను కంపెనీలు, ఎన్బీఎఫ్సీలు జారీ చేస్తాయి. మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ కావడంతో వీటిని సెబీ నియంత్రిస్తుంటుంది. కనుక వీటిని జారీ చేసే కంపెనీలు ఇన్వెస్టర్లకు సమగ్ర వివరాలను ‘సెల్ఫ్ ప్రాస్పెక్టస్’ కింద వెల్లడించాలి. ఈ ప్రాస్పెక్టస్‌లో కంపెనీ వివరాలు, ఆర్థిక సమాచారం, రిస్క్ అంశాలు, వడ్డీ రేటు, మెచ్యూరిటీ తేదీ తదితర వివరాలు తెలియజేయాలి. ఎన్సీడీలను జారీ చేసే ప్రతి ఎన్బీఎఫ్సీ తన క్రెడిట్ రేటింగ్‌ను వెల్లడించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఇన్వెస్టర్ల డిబెంచర్ల ఉపసంహరణలకు తగినన్ని నిధులను నిర్వహించాలి. మొత్తం ఎన్‌సీడీల్లో సుమారు 25% మేర రిజర్వ్‌గా ఉంచాలి. క్రెడిట్ రేటింగ్ చాలా ముఖ్యం... బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక వడ్డీ రేటు ఉండటంతో ఇన్వెస్టర్లు ఎన్సీడీల పట్ల ఆకర్షితులవుతుంటారు. కానీ, అధిక వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నట్టు అయితే డిఫాల్ట్ రిస్క్ పెరుగుతున్నట్టుగా భావించాలి. అందుకే ఎన్‌సీడీల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఆయా ఇష్యూలకు సంబంధించి రిస్క్ ఏ మేరకు అన్నది తెలుసుకోవాలంటే, రేటింగ్ ఏజెన్సీలిచ్చిన క్రెడిట్ రేటింగ్‌ను గమనించడం ఓ చక్కని మార్గం. సాధారణంగా ఎన్సీడీలు ‘ఎ’ నుంచి ‘ఎఎఎ’ రేటింగ్ కలిగినవి అయితే తక్కువ రిస్క్‌ను సూచిస్తాయి. అదే ‘బిబిబి’ లేదా అంతకంటే తక్కువ రేటింగ్ ఉన్నవయితే మధ్యస్థం నుంచి అధిక డిఫాల్ట్ రిస్క్ కలిగి ఉన్నాయని అర్థం. అందుకని ఇన్వెస్ట్ చేసే ముందు ఎన్సీడీ క్రెడిట్ రేటింగ్‌ను చూడాలి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా రేటింగ్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ తర్వాత కాలంలో రేటింగ్ మారిపోవచ్చు. డిపాజిట్లకన్నా రిస్క్ ఎక్కువే... సెబీ ఇన్ని రకాల నియంత్రణలు విధించినప్పటికీ ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే ఎన్‌సీడీల్లో రిస్క్ ఎక్కువే. ఎలా అంటే... ►ఎన్సీడీలను తక్కువ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఉన్న కంపెనీలు కూడా జారీ చేయొచ్చు. కానీ, ఎఫ్డీలను మాత్రం ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఉన్నవే జారీ చేస్తాయి. ►చెల్లింపుల్లో విఫలమైతే లేదా ఆలస్యం అయితే ఎన్‌సీడీలతో పోలిస్తే ఎఫ్‌డీల విషయంలో నియంత్రణ సంస్థలు చాలా సీరియస్‌గా వ్యవహరిస్తాయి. ఎఫ్డీ చెల్లింపుల్లో విఫలమైతే ఆ కంపెనీపై కంపెనీ లాబోర్డు లేదా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చు. లేదా సివిల్ వ్యాజ్యాన్ని దాఖలు చేయవచ్చు. అదే ఎన్సీడీల చెల్లింపుల్లో వైఫల్యం ఉంటే ఇన్వెస్టర్లు మొదట అదే కంపెనీ డిబెంచర్స్ ట్రస్టీని సంప్రతించాల్సి ఉంటుంది. ►ప్రజల నుంచి డిపాజిట్ల సమీకరణకు ఆర్బీఐ అనుమతి లేని ఎన్‌బీఎఫ్‌సీలూ తమ నిధుల అవసరాలకు అధిక ఈల్డింగ్తో కూడిన ఎన్‌సీడీలతో బాండ్ మార్కెట్లోకి వెళుతుంటాయి. ఉదాహరణకు శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, కొసమట్టమ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫిన్‌కార్ప్, జేఎం ఫైనాన్షియల్ కంపెనీలు ఇటీవలే లాంచ్ చేసిన ఎన్సీడీల ఆఫర్లే. కారణం, వీటికి ప్రజల నుంచి ఎఫ్డీలను సమీకరించేందుకు ఆర్బీఐ రిజిస్ట్రేషన్ లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సెక్యూరిటీ ఎంత? ఎన్సీడీల్లోనూ సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ ఉంటాయి. సెక్యూర్డ్ కాస్త నయం. కంపెనీ దగ్గర నిధులు లేకుండా పోతే హామీలను విక్రయించి చెల్లింపులు చేయడానికి వీలుంటుంది. ఇక దీర్ఘకాల ఎన్సీడీలు చూడ్డానికే ఆకర్షణీయంగా అనిపిస్తాయి. ఎందుకంటే ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి. అయితే, దీర్ఘకాలంలో ఓ కంపెనీ క్రెడిట్ సామర్థ్యాన్ని అంచనా వేయడం కష్టం. ఒకవేళ మార్కెట్లో వడ్డీ రేట్లు పెరిగిపోతే అధిక రాబడులు వచ్చే వాటిల్లోకి పెట్టుబడులను మళ్లించుకునే అవకాశం కోల్పోతారు. అందుకని ఐదేళ్లకు మించి లాకిన్ ఉండే ఎన్‌సీడీలకు దూరంగా ఉండటమే నయం. -
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్
• రూ.1,000 కోట్ల ఇష్యూకి రూ.3,000 కోట్ల బిడ్లు • రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ • ఎన్సీడీ ఇష్యూకు భారీ స్పందన న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్‌కు చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ తొలి ఎన్సీడీ(నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల) ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి తొలి రోజే అనూహ్యమైన స్పందన లభించింది. నేడు(శుక్రవారం) ముగిసే ఈ రూ.1,000కోట్ల ఎన్సీడీ ఇష్యూకు గురువారం నాడే రూ.3,000 కోట్ల బిడ్లు వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించిందని సమాచారం. ఈ ఎన్సీడీ నిధులను రుణాలివ్వడానికి, పాత బకాయిలను తీర్చడానికి, ఇతర సాధారణ వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించాలని కంపెనీ యోచిస్తోంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం, గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఈ ఎన్సీడీ ఇష్యూ 3 రెట్లు ఓవర్సబ్స్క్రైబయింది. రూ.3,012.91 కోట్లకు బిడ్లు వచ్చాయి. రూ. 1,000 ముఖ విలువ గల సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ ఎన్సీడీల జారీ ద్వారా రూ.1,000 కోట్లు సమీకరించాలని రిలయన్స్ హోమ్ భావించింది. ఓవర్ సబ్‌స్క్రిప్షన్‌ను అట్టిపెట్టుకునే సౌలభ్యం కంపెనీకి ఉంది. -
ఎన్‌సీడీలపై వడ్డీ చెల్లింపుల్లో మరోసారి జేఎస్పీఎల్ విఫలం
న్యూఢిల్లీ: నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ) హోల్డర్లకు వడ్డీ చెల్లింపుల్లో జిందాల్ స్టీల్ అండ్ పవర్ (జేఎస్పీఎల్) మరోసారి విఫలం అరుు్యంది. ఎన్‌సీడీలకు గడువు ప్రకారం అక్టోబర్ 31 లోపు రూ.15.43 కోట్ల మేర వడ్డీ చెల్లించాల్సి ఉండగా, అందులో విఫలమైనట్టు స్వయంగా కంపెనీయే బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సమాచారం ఇచ్చింది. అంతకుముందు సెప్టెంబర్‌లోనూ గడువు తేదీ 30 నాటికి ఎన్‌సీడీలపై వడ్డీ చెల్లింపుల్లో జేఎస్పీఎల్ విఫలమైన విషయం విదితమే. నవీన్ జిందాల్‌కు చెందిన జేఎస్పీఎల్ రూ.46,000 కోట్ల రుణభారంతో సతమతం అవుతోంది. దీన్ని తగ్గించుకునేందుకు గత కొన్ని నెలల కాలంలో కంపెనీ ఆస్తుల విక్రయాలకు ప్రయత్నాలు సాగిస్తోంది. సతారాలోని 24 మెగావాట్ల విండ్ పవర్ ప్లాంట్‌ను ఇండియా ఇన్‌ఫ్రాస్టక్చ్రర్ ఫండ్-2కు విక్రరుుంచనున్నట్టు కంపెనీ అక్టోబర్‌లో ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో ఉన్న వెరుు్య మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్ విక్రయానికీ ఒప్పందం కుదుర్చుకుంది. -
రిలయన్స్ జియో ఎన్సీడీ ఇష్యూకి అనూహ్య స్పందన
♦ రూ.2,000 కోట్లకు రూ.3,700 కోట్ల బిడ్లు ♦ డిజిటల్ వ్యాపారం కోసమే ఈ నిధులు ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ జియో సంస్థ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల(ఎన్సీడీ) జారీ ద్వారా రూ.2,000 కోట్లు సమీకరించింది. బీఎస్ఈ ఇటీవలే కొత్తగా ప్రారంభించిన ‘బీఎస్ఈ బాండ్‘ ప్లాట్‌ఫామ్‌పై ఎన్సీడీల జారీ ద్వారా రిలయన్స్ జియో ఈ నిధులను రాబట్టింది. ఈ నిధులను డిజిటల్ సర్వీసుల వ్యాపార నిర్వహణ కోసం ఉపయోగిస్తామని పేర్కొంది. రూ.1,500 కోట్లు ఈ ఎన్సీడీ ఇష్యూ (రూ.500 కోట్ల గ్రీన్ షూ ఆప్షన్‌తో)కు అద్భుత స్పందన వచ్చింది. ఇష్యూ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే రూ.3,500 కోట్ల మేర బిడ్స్ వచ్చాయి. మొత్తం మీద రూ.3,700 కోట్ల బిడ్లు వచ్చాయి. ఐదేళ్ల ఈ ఎన్‌సీడీలకు వార్షిక కూపన్ రేటు 8.32 శాతంగా ఉంది. ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు, బ్యాంక్‌లు ఈ ఇష్యూలో పాల్గొన్నాయి. తమ ఇష్యూకి ఇంత స్పందన రావడం సంతోషకరంగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ట్రెజరర్ సౌమ్యో దత్తా చెప్పారు. తమ డిజిటల్ సర్వీస్ వ్యాపారంపై ఇన్వెస్టర్లకు ఉన్న విశ్వాసానికి ఈ అనూహ్య స్పందనే నిదర్శనమని పేర్కొన్నారు. -
ఎన్సీడీపై నీలినీడలు
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: అసంక్రమణ వ్యాధుల నివారణ కార్యక్రమం (ఎన్సీడీ)పై నీలినీడలు కమ్ముకున్నాయి. మంజూరై మూడేళ్లవుతున్నా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. కనీసం సిబ్బందిని కూడా నియమించలేదు. జిల్లాకు 2010లో ఎన్సీడీ కార్యక్రమం మంజూరయింది. బీపీ, మధుమేహం, ఆస్తమా, ఊబకాయం వంటి రోగులకు సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. అయితే కార్యక్రమం ప్రారంభించడంలో చూపించిన శ్రద్ధ ఆచరణలో చూపించలేదు. జిల్లాలో ఉన్న 12 సీహెచ్‌సీల్లో 12 ఎన్సీడీ క్లినిక్‌లు, కేంద్రాస్పత్రిలో 10 పడకల వార్డును ఏర్పాటు చేయాలి. నెల్లిమర్ల, బాడంగి, కురుపాం, ఎస్.కోట, గజపతినగరం, సాలూరు, పార్వతీపురం, భద్రగిరి, చీపురుపల్లి, జియ్యమ్మవలస, బొబ్బిలి, భోగాపురం సీహెచ్‌సీల్లో ఎన్సీడీ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలి. అయితే క్లినిక్‌లకు గదులు కేటాయించారు కానీ అందులో పనిచేయడానికి సిబ్బంది లేరు. దీంతో అవి నిరుపయోగంగా మిగిలాయి. కేంద్రాస్పత్రిలో పది పడకల వార్డును కేటాయించారు. ఇక్కడ కూడా సిబ్బంది లేకపోవడంతో మూత పడింది. అదేవిధంగా క్లీనిక్‌లను పర్యవేక్షించడానికి జిల్లా మేనేజర్ కూడా నియమించలేదు. నోటిఫికేషన్ ఇచ్చి..... ఎన్సీడీ క్లినిక్‌లలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి రెండు పర్యాయాలు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఇంతవరకు నియూమకాలు చేపట్టలేదు. 2012లో జిల్లా స్థాయిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి నోటిఫికేషన్ ఇచ్చారు. 12 డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 16 స్టాఫ్ నర్సులు, 12 కౌన్సిలర్లు, ఒక స్పెషలిస్టు వైద్యుడు, ఐదుగురు ఎంబీబీఎస్ వైద్యులు, లాజిస్టక్ ఆఫీసర్, లాజిస్టక్ ఆఫీసర్ అసిస్టెంట్ ఒకరు, 12 మంది ల్యాబ్ టెక్నీషయన్లు, 12 మంది వాచ్‌మన్ పోస్టులకు నోటి ఫికేషన్ ఇచ్చారు. వీటికి ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. అయితే నియూమకాలను మాత్రం చేపట్టలేదు. తర్వాత జిల్లా స్థాయిలో నోటిఫికేషన్‌ను రద్దచేస్తున్నామని ప్రకటించి, తిరిగి 2013లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎన్‌సీడీల్లో పనిచేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో జిల్లా నుంచి సుమారు 500 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. నోటిఫికేషన్ ఇచ్చి ఎనిమిది నెలలవుతున్నా ప్రభుత్వం ఇంతవరకు ఇంటర్వ్యూలు నిర్వహించలేదు. ఎన్‌సీడీక్లినిక్‌లు ఉన్నప్పటి కీ వాటిలో పనిచేయడానికి వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో బీసీ, మధుమేహం, మూర్ఛ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి సేవలు నిలిచిపోయాయి.