రిలయన్స్ హోమ్ ఫైనాన్స్
• రూ.1,000 కోట్ల ఇష్యూకి రూ.3,000 కోట్ల బిడ్‌లు
• రిలయన్స్ హోమ్ ఫైనాన్స్
• ఎన్‌సీడీ ఇష్యూకు భారీ స్పందన
న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్‌కు చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ తొలి ఎన్‌సీడీ(నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల) ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి తొలి రోజే అనూహ్యమైన స్పందన లభించింది. నేడు(శుక్రవారం) ముగిసే ఈ రూ.1,000కోట్ల ఎన్‌సీడీ ఇష్యూకు గురువారం నాడే రూ.3,000 కోట్ల బిడ్‌లు వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించిందని సమాచారం. ఈ ఎన్‌సీడీ నిధులను రుణాలివ్వడానికి, పాత బకాయిలను తీర్చడానికి, ఇతర సాధారణ వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించాలని కంపెనీ యోచిస్తోంది.
బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం, గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఈ ఎన్‌సీడీ ఇష్యూ 3 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబయింది. రూ.3,012.91 కోట్లకు బిడ్‌లు వచ్చాయి. రూ. 1,000 ముఖ విలువ గల సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ ఎన్‌సీడీల జారీ ద్వారా రూ.1,000 కోట్లు సమీకరించాలని రిలయన్స్ హోమ్ భావించింది. ఓవర్ సబ్‌స్క్రిప్షన్‌ను అట్టిపెట్టుకునే సౌలభ్యం కంపెనీకి ఉంది.