home finance
-
అన్మోల్ అంబానీకి సెబీ రూ. 1 కోటి జరిమానా
న్యూఢిల్లీ: రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌కి సంబంధించి కార్పొరేట్ రుణాలకు ఆమోదం తెలిపే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైనందుకు గాను పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ అంబానీకి సెబీ రూ. 1 కోటి జరిమానా విధించింది. అలాగే రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ కృష్ణన్ గోపాలకృష్ణన్‌కి రూ. 15 లక్షల ఫైన్ విధించింది. 45 రోజుల్లోగా ఇద్దరూ ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నిధుల మళ్లింపు కేసులో అనిల్ అంబానీతో పాటు మరో 24 మంది సెక్యూరిటీస్ మార్కెట్లో పాల్గొనకుండా సెబీ ఆగస్టులో నిషేధం విధించింది. తాజాగా సోమవారం ఇచ్చిన ఆదేశాల ప్రకారం, జనరల్ పర్పస్ కార్పొరేట్ రణాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దంటూ కంపెనీ డైరెక్టర్ల బోర్డు నుంచి స్పష్టమైన సూచనలు ఉన్నప్పటికీ బోర్డు సభ్యుడైన అన్మోల్ అంబానీ వాటిని పట్టించుకోకుండా ఎక్యురా ప్రొడక్షన్స్ అనే సంస్థకు రూ. 20 కోట్ల లోన్‌కి ఆమోదముద్ర వేశారని ఆరోపణలు ఉన్నాయి. -
హెచ్డీఎఫ్సీ లాభం రూ.4,600 కోట్లు
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ రుణ దిగ్గజం హెచ్డీఎఫ్సీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన (అనుబంధ సంస్థలన్నిటితో కలిపి) రూ.4,600 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.10,389 కోట్లతో పోలిస్తే 57.5 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం రూ.32,851 కోట్ల నుంచి రూ.34,090 కోట్లకు వృద్ధి చెందింది. ‘2019 సెప్టెంబర్ క్వార్టర్లో అనుబంధ సంస్థ గృహ్ ఫైనాన్స్‌ను బంధన్ బ్యాంక్‌లో విలీనం చేసేందుకు, వాటా విక్రయించిన కారణంగా రూ.8,000 కోట్ల లాభం లభించింది’ అని హెచ్డీఎఫ్సీ పేర్కొంది. ‘వాస్తవానికి, డివిడెండ్ ఆదాయాన్ని, వాటాల విక్రయం, అలాగే అంచనా క్రెడిట్ నష్టం(ఈసీఎల్) కేటాయింపులను తీసివేస్తే, క్యూ2లో నికర లాభం 27 శాతం పెరిగినట్లు లెక్క’ అని హెచ్డీఎఫ్సీ వైస్–చైర్మన్, సీఈఓ కేకి మిస్త్రీ పేర్కొన్నారు. స్టాండెలోన్‌గానూ 28 శాతం తగ్గుదల... కేవలం మార్ట్గేజ్ కార్యకలాపాలపై మాత్రమే చూస్తే (స్టాండెలోన్‌గా), క్యూ2లో హెచ్డీఎఫ్సీ నికర లాభం 28 శాతం తగ్గి రూ.2,870 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,962 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం సైతం రూ.13,494 కోట్ల నుంచి రూ.11,733 కోట్లకు తగ్గింది. నికర వడ్డీ ఆదాయం మాత్రం 21 శాతం పెరుగుదలతో రూ.3,021 కోట్ల నుంచి రూ. 3,647 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 3.3 శాతంగా ఉంది. ఇక మొండిబాకీ(ఎన్పీఏ)ల విషయానికొస్తే, క్యూ2లో స్థూల ఎన్పీఏలు 1.81 శాతంగా (రూ.8,511 కోట్లు) నమోదయ్యాయి. ఈ ఏడాది ఆగస్టులో సంస్థ రూ.10,000 కోట్ల ఈక్విటీ నిధులను సమీకరించింది. హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో వాటా అమ్మకం ద్వారా హెచ్‌డీఎఫ్‌సీకి రూ.1,241 కోట్ల స్థూల లాభం వచ్చింది. కాగా, కోవిడ్ ప్రభావంతో సహా క్యూ2లో కేటాయింపులు (ప్రొవిజనింగ్) రూ.436 కోట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే క్వార్టర్లో కేటాయింపులు రూ.754 కోట్లు. హెచ్డీఎఫ్సీ షేరు సోమవారం బీఎస్ఈలో 6 శాతం పెరిగి రూ. 2,043 వద్ద స్థిరపడింది. -
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్
• రూ.1,000 కోట్ల ఇష్యూకి రూ.3,000 కోట్ల బిడ్లు • రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ • ఎన్సీడీ ఇష్యూకు భారీ స్పందన న్యూఢిల్లీ: రిలయన్స్ క్యాపిటల్‌కు చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ తొలి ఎన్సీడీ(నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల) ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి తొలి రోజే అనూహ్యమైన స్పందన లభించింది. నేడు(శుక్రవారం) ముగిసే ఈ రూ.1,000కోట్ల ఎన్సీడీ ఇష్యూకు గురువారం నాడే రూ.3,000 కోట్ల బిడ్లు వచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించిందని సమాచారం. ఈ ఎన్సీడీ నిధులను రుణాలివ్వడానికి, పాత బకాయిలను తీర్చడానికి, ఇతర సాధారణ వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించాలని కంపెనీ యోచిస్తోంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం, గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఈ ఎన్సీడీ ఇష్యూ 3 రెట్లు ఓవర్సబ్స్క్రైబయింది. రూ.3,012.91 కోట్లకు బిడ్లు వచ్చాయి. రూ. 1,000 ముఖ విలువ గల సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ ఎన్సీడీల జారీ ద్వారా రూ.1,000 కోట్లు సమీకరించాలని రిలయన్స్ హోమ్ భావించింది. ఓవర్ సబ్‌స్క్రిప్షన్‌ను అట్టిపెట్టుకునే సౌలభ్యం కంపెనీకి ఉంది.