న్యూఢిల్లీ: రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌కి సంబంధించి కార్పొరేట్ రుణాలకు ఆమోదం తెలిపే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైనందుకు గాను పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కుమారుడు అన్‌మోల్ అంబానీకి సెబీ రూ. 1 కోటి జరిమానా విధించింది. అలాగే రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ కృష్ణన్ గోపాలకృష్ణన్‌కి రూ. 15 లక్షల ఫైన్ విధించింది. 45 రోజుల్లోగా ఇద్దరూ ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నిధుల మళ్లింపు కేసులో అనిల్ అంబానీతో పాటు మరో 24 మంది సెక్యూరిటీస్ మార్కెట్లో పాల్గొనకుండా సెబీ ఆగస్టులో నిషేధం విధించింది. తాజాగా సోమవారం ఇచ్చిన ఆదేశాల ప్రకారం, జనరల్ పర్పస్ కార్పొరేట్ రణాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దంటూ కంపెనీ డైరెక్టర్ల బోర్డు నుంచి స్పష్టమైన సూచనలు ఉన్నప్పటికీ బోర్డు సభ్యుడైన అన్‌మోల్ అంబానీ వాటిని పట్టించుకోకుండా ఎక్యురా ప్రొడక్షన్స్ అనే సంస్థకు రూ. 20 కోట్ల లోన్‌కి ఆమోదముద్ర వేశారని ఆరోపణలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment