Anmol Ambani
-
అన్మోల్ అంబానీకి సెబీ రూ. 1 కోటి జరిమానా
న్యూఢిల్లీ: రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌కి సంబంధించి కార్పొరేట్ రుణాలకు ఆమోదం తెలిపే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైనందుకు గాను పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ అంబానీకి సెబీ రూ. 1 కోటి జరిమానా విధించింది. అలాగే రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్ చీఫ్ రిస్క్ ఆఫీసర్ కృష్ణన్ గోపాలకృష్ణన్‌కి రూ. 15 లక్షల ఫైన్ విధించింది. 45 రోజుల్లోగా ఇద్దరూ ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నిధుల మళ్లింపు కేసులో అనిల్ అంబానీతో పాటు మరో 24 మంది సెక్యూరిటీస్ మార్కెట్లో పాల్గొనకుండా సెబీ ఆగస్టులో నిషేధం విధించింది. తాజాగా సోమవారం ఇచ్చిన ఆదేశాల ప్రకారం, జనరల్ పర్పస్ కార్పొరేట్ రణాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దంటూ కంపెనీ డైరెక్టర్ల బోర్డు నుంచి స్పష్టమైన సూచనలు ఉన్నప్పటికీ బోర్డు సభ్యుడైన అన్మోల్ అంబానీ వాటిని పట్టించుకోకుండా ఎక్యురా ప్రొడక్షన్స్ అనే సంస్థకు రూ. 20 కోట్ల లోన్‌కి ఆమోదముద్ర వేశారని ఆరోపణలు ఉన్నాయి. -
క్రిషా అంబానీ బర్త్‌డే అత్తగారి ప్రశంసలు: వైరల్ వీడియో, ఎవరీ క్రిషా!
సాక్షి,ముంబై: అంబానీ ఫ్యామిలీకి సంబంధించి సోషల్‌మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ, నటి టీనా అంబానీ దంపతుల కుమారుడు జై అన్మోల్ అంబానీ తన భార్య క్రిషా అంబానీ పుట్టిన రోజును (మే 5న) వీడియోలో ఇపుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఈ వీడియోలో జై అన్మోల్ అంబానీ పక్కనే నిలబడి భార్యతో కేక్ కట్ చేయించడాన్ని చూడొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు ఈ స్టైలిష్ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. అటు క్రిషా కూడా తన స్టైలిష్ ఔట్ఫిట్తో ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. బెల్ స్లీవ్స్, ప్రింటెడ్ మస్టర్డ్-హ్యూడ్ మ్యాక్సీ డ్రెస్‌లో చాలా అందంగా కనిపించింది. ఈ కపుల్ కేక్ కటింగ్ వేడుక ఆసక్తికరంగా మారింది. మరోవైపు క్రిషా అంబానీ పుట్టిన రోజు సందర్భంగా, క్రిషా అంబానీ అత్తగారు టీనా అంబానీ ఇన్‌స్టా ద్వారా కోడలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. "హ్యాపీ బర్త్‌డే డార్లింగ్ క్రిషా.. నువ్వు మాతో ఉండటం చాలా గర్వంగా ఉంది’’ అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. (తొలి పదిరోజుల్లోనే కోట్ల అమ్మకాలు: వామ్మో అన్ని కొనేశారా!) తెలివైన అమ్మాయి. ఇన్నోవేషన్లకు, ఐడియాల పుట్ట. ఇంటికి శక్తి, యుక్తి వెలుగు.. అన్నింటికి మించి లవింగ్ డాటర్ టీనా కోడలిపై ప్రశంసలు కురిపించారు. కాగా జై అన్మోల్ అంబానీ, క్రిషా గత ఏడాది ఫిబ్రవరి 20న ముంబైలో వివాహం చేసుకున్నారు. ఈ జంట తరచు సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. (బీమా పాలసీపై క్రెడిట్ కార్డ్ లోన్స్: ఇకపై ఇలా చేయలేరు!) View this post on Instagram A post shared by Tina Ambani (@tinaambaniofficial) View this post on Instagram A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis) -
అంబానీ కుమారుడు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ పెద్ద కుమారుడు, రిలయన్స్ క్యాపిటల్ డైరెక్టర్ అన్మోల్ అంబానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల పెరుగుదల దృష్ట్యా వ్యాపారాలపై విధించిన ఆంక్షలపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంతేకాదు నటులు, ప్రొఫెషనల్ క్రికెటర్లు, రాజకీయ నాయకులకు లేని ఆంక్షలు వ్యాపారాలకు ఎందుకుంటూ మండిపడ్డారు. అసలు 'ఎసెన్షియల్’ అర్థం ఏమిటి? అంటూ మహారాష్ట్ర అధికారులపై విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రొఫెషనల్ 'నటులు' వారి వారి సినిమాల షూటింగ్ కొనసాగించుకోవచ్చు. ప్రొఫెషనల్ 'క్రికెటర్లు' అర్థరాత్రి వరకు ఆడుకోవచ్చు. ప్రొఫెషనల్ 'రాజకీయ నాయకులు' భారీగా గుమిగూడిన జనాలతో ర్యాలీలను కొనసాగించవచ్చు. కానీ వ్యాపారం లేదా పని ఎసెన్షియల్ కాదా అని అన్మోల్ అంబానీ ప్రశ్నించారు. ఎవరి పని వారికి అత్యవసరమే అంటూ మహారాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మరోవైపు కరోనా కేసుల పెరుగుదల మధ్య మహారాష్ట్రలో వ్యాక్సిన్లు అయి పోతున్నాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఇక మూడు రోజులకు సరిపడా వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం 14 లక్షల వ్యాక్సిన్ మోతాదులు ఉన్నాయని, రాబోయే మూడు రోజులకు ఇవి సరిపోతాయని అన్నారు. కాగా దేశంలో రెండో దశలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో మరింత తీవ్రంగా పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలో పలు నగరాల్లో కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. సినిమా హాళ్ళు, పార్కులు, మ్యూజియంలు , రెస్టారెంట్లు అన్ని మత ప్రదేశాలను మూసి ఉంచాలని, ఉద్యోగులు ఇంటి నుండి పని చేయాలని, రాత్రిపూట సెక్షన్ 144, నైట్ కర్ఫ్యూ ఉంటుందని ఆదేశించింది. లాక్డౌన్ సమయంలో, అవసరమైన సేవలను మాత్రమే అనుమతిస్తామని మంత్రివర్గం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా వారాంతంలో (శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు) పూర్తి లాక్డౌన్ అమల్లో ఉంటుందని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఈ ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. What does essential even mean? EACH INDIVIDUALS WORK IS ESSENTIAL TO THEM. #scamdemic — Anmol A Ambani (@anmol_ambani) April 5, 2021 -
అనిల్ అంబానీకి పుత్రోత్సాహం
-
జూనియర్ అంబానీ మ్యాజిక్: జాక్‌పాట్
సాక్షి ముంబై: అనిల్ అంబానీ పెద్ద కుమారుడు, రిలయన్స్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ అన్మోల్ అంబానీ (26) ఫస్ట్ డీల్లోనే అదరహో అనిపించుకున్నారు. 25 రెట్ల లాభాలతో ఫస్ట్ ఫండ్ రైజింగ్ డీల్లోనే జాక్‌పాట్ కొట్టేశారు. రిలయన్స్ గ్రూపు అధికార ప్రతినిధి ఈ లావాదేవీని ధృవీకరించారు. కోడ్‌మాస్టర్స్ సంస్థలోని వాటాను యూరోప్, యూకేకు చెందిన 30కి పైగా సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారని సంస్థ వెల్లడించింది. ఇందుకు గాను సుమారు రూ.5 వేల కోట్ల వరకూ బిడ్లు దాఖలైనట్టు తెలిపారు. బ్రిటీష్ గేమింగ్ డెవలప్మెంట్ సంస్థ కోడ్‌మాస్టర్స్‌లో రిలయన్స్ 60 శాతం వాటాను రూ.1700 కోట్లకు విక్రయించారు. ఏకంగా 25 రెట్లకు పైగా లాభానికి ఈ వాటాను అమ్మారు. దీంతో ముఖ్యంగా రుణ సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులుపడుతున్న అనిల్ అంబానీ పుత్రుడి విజయంతో సంతోషంగా ఉన్నారు. ఎఫ్ 1 సిరీస్ వీడియో గేమ్స్‌ను తయారీ దిగ్గజ సంస్థ కోడ్‌మాస్టర్స్‌లో 2009లో మెజార్టీ వాటాను అడాగ్ గ్రూప్ సంస్థ సుమారు రూ.100 కోట్లకు కొనుగోలు చేసింది. తాజాగా ఈ వాటాను కేవలం 60శాతం వాటాను 17వందల కోట్ల రూపాయలకు విక్రయించడం వ్యాపార వర్గాల్లో విశేషంగా నిలిచింది. కాగా ఈ డీల్ తరువాత కోడ్‌మాస్టర్స్ లో రూ.850 కోట్లు విలువైన 30 శాతం వరకూ వాటా అడాగ్ గ్రూప్ రిలయన్స్ సొంతం. 1986లో కోడ్ మాస్టర్స్ ఏర్పాటైంది. సుమారు 500మంది ఉద్యోగులతో ఇంగ్లాండ్‌లో మూడు, మలేషియాలో ఒక కార్యాలయంతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2016 నాటికి, 31 మిలియన్ పౌండ్లుగా ఉన్న కోడ్‌మాస్టర్స్ ఆదాయం2018 ఆర్థిక సంవత్సరం నాటికి 64 మిలియన్ పౌండ్లతో రెట్టింపు వృద్ధిని నమోదు చేసింది. అలాగే కోడ్‌మాస్టర్స్ తో పాటు హాలీవుడ్ ఫిలిం స్టూడియో డ్రీమ్ వర్క్స్‌లో కూడా రిలయన్స్ గ్రూప్ పెట్టుబడులు పెట్టింది. -
రిలయన్స్ క్యాపిటల్ నుంచి డిజిటల్ సేవలు
కంపెనీ ఈడీ అన్మోల్ అంబానీ వెల్లడి న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ కంపెనీ కీలకం కాని ఆస్తుల విక్రయం ద్వారా భారీగా మూలధన లాభాలు పొందాలని యోచి స్తోంది. మరోవైపు డిజిటల్ సేవలందిండం ద్వారా కొత్త తరం వినియోగదారులను ఆకట్టుకోవాలని చూస్తోంది. గురువారం జరిగిన కంపెనీ వ్యాపార ప్రణాళికలను విశ్లేషకులకు వివరించే సమావేశంలో కంపెనీ ఈడీ అన్మోల్ అంబానీ ఈ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో కంపెనీ చైర్మన్, అన్మోల్ తండ్రి అనిల్ అంబానీ, గ్రూప్ కంపెనీల ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా హాజరయ్యారు. 24 సంవత్సరాల అన్మోల్ అంబానీ గత ఏడాది ఈడీగా రిలయన్స్ క్యాపిటల్‌లో చేరారు. మూడు నెలల్లో హోమ్ ఫైనాన్సింగ్ లిస్టింగ్ ప్రపంచంలో భారత్, చైనాలు పెద్ద డిజిటల్ మార్కెట్లని అన్మోల్ పేర్కొన్నారు. కొత్త తరం వినియోగదారులకు సేవలందించడానికి తమ వ్యాపారాలన్నింటినీ డిజిటలైజ్ చేయాలని యోచిస్తున్నామని వివరించారు. రిలయన్స్ గ్రూప్‌కు ఆర్థిక సేవల కంపెనీ కీలకమని, గ్రూప్‌లో అధిక వృద్ది ఉన్న వ్యాపారం ఇదని వివరించారు. కీలకం కాని ఆస్తుల విక్రయం జరుగుతోందని, వచ్చే మార్చి కల్లా భారీ స్థాయిలో మూలధన లాభాలు పొందగలమన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే మూడు నెలల్లో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్లిస్టింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ఫండ్లలో పెట్టుబడులు పెరిగాయ్.. రెండున్నరేళ్లలో భారత్‌లో భారీ మార్పులు వచ్చాయని, రెడ్ టేపిజమ్(ప్రభుత్వ విధానాల్లో సుదీర్ఘ జాప్యం)పోయి రెడ్ కార్పెట్ వచ్చిందని, చాలా సంస్కరణలు వచ్చాయని, వ్యాపార విశ్వసనీయత పెరిగిందని అనిల్ అంబానీ వ్యాఖ్యానించారు. చౌక ధరల గృహాలు, సార్వత్రిక బీమా, చెల్లింపుల బ్యాంక్‌ల ఏర్పాటు, ఆధార్ వంటివన్నీ భారత్‌లో ఆర్థిక సేవల వృద్ధికి దోహదపడే కీలకాంశాలని వివరించారు. -
త్వరలో రిలయన్స్ క్యాపిటల్ వివిధ విభాగాలు లిస్టింగ్
♦ వచ్చే ఏప్రిల్ కల్లా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిస్టింగ్ ♦ కమోడిటీ ఎక్స్చేంజీ మళ్లీ ప్రారంభిస్తాం ♦ వినియోగదారుల రుణాల కోసం కొత్త విభాగం ♦ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ వెల్లడి ఏజీఎమ్‌లో ప్రసంగం ముంబై: రిలయన్స్ క్యాపిటల్‌కు చెందిన వివిధ విభాగాలను త్వరలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయనున్నామని గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ తెలిపారు. గృహ రుణ విభాగాన్ని(రిలయన్స్ హోమ్ ఫైనాన్స్) వచ్చే ఏడాది ఏప్రిల్‌లో స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేస్తామని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన రిలయన్స్ క్యాపిటల్ ఏజీఎమ్ (వార్షిక సాధారణ సమావేశం)లో వాటాదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌లో 49 శాతం వాటా రిలయన్స్ క్యాపిటల్ వాటాదారులకే ఉంటుందని, రిలయన్స్ క్యాపిటల్ వాటాదారులకు ఉచితంగా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ షేర్లను కేటాయిస్తామని అంబానీ వివరించారు. అంతేకాకుండా వాణిజ్య రుణాల విభాగాన్ని, జీవిత బీమా, సాధారణ బీమా విభాగాలను కూడా తగిన సమయంలో లిస్ట్ చేస్తామని వివరించారు. వాటాదారుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ సంస్థల లిస్టింగ్‌పై తుది నిర్ణయాన్ని తీసుకుంటాయని వివరించారు. వినియోగదారులకు రుణాలిచ్చే కొత్త విభాగాన్ని అభివృద్ధి చేయనున్నామని పేర్కొన్నారు. కమోడిటీ ఎక్స్చేంజీని మళ్లీ ప్రారంభిస్తామని, వజ్రాలు, ముడిచమురు ఫ్యూచర్లపై ప్రధానంగా దృష్టి పెడతామని చెప్పారు. వజ్రాల ఫ్యూచర్స్ రోజువారీ టర్నోవర్ రూ.6,000 కోట్లు ఉండే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ప్రతి ఏడాది డివిడెండ్ చెల్లింపుల్లో వృద్ధి సాధించాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. జీఎస్టీతో భారీ మార్పు వర్షాలు బాగా కురుస్తాయన్న అంచనాలున్నాయని, వడ్డీరేట్లు తక్కువ స్థాయిల్లో ఉన్నాయని, ద్రవ్యోల్బణం కూడా కనిష్ట స్థాయిలోనే ఉందని దీంతో భారత ఆర్థిక వృద్ధి జోరుగా ఉండగలదని పేర్కొన్నారు. జీఎస్టీ కారణంగా ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులు రాబోతున్నాయని పేర్కొన్నారు. ఈ ఏజీఎంలో రిల యన్స్ క్యాప్ సీఈఓ శామ్ ఘోష్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఆర్‌కామ్‌లో రుణ భారం తగ్గించుకుంటాం: రిలయన్స్ కమ్యూనికేషన్స్ భారీ రుణ భారాన్ని ఏడాది కాలంలో 75 శాతం వరకూ తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నామని అంబానీ పేర్కొన్నారు. ఆర్‌కామ్‌లో ఎంటీఎస్, ఎయిర్‌సెల్ విలీన ప్రక్రియలు పూర్తయితే రుణ భారం రూ.20,000 కోట్ల వరకూ తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ రెండు కంపెనీల విలీనం పూర్తయితే, దేశంలోనే అత్యధిక స్పెక్ట్రమ్ ఉన్న రెండో అతి పెద్ద కంపెనీగా, 18 కోట్ల మంది వినియోగదారులతో నాలుగో అతి పెద్ద టెలికం కంపెనీగా అవతరిస్తామని వివరించారు. టవర్ల వ్యాపార విక్రయానికి సంబంధించిన కీలకమైన ప్రకటనను త్వరలోనే వెల్లడిస్తామని వివరించారు. తమ తండ్రి ధీరుబాయ్ అంబానీ స్వప్నాన్ని సాకారం చేయడానికి తన సోదరుడు ముకేశ్ అంబానీ రిలయన్స్ జియోతో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఆర్‌కామ్, రిలయన్స్ జియోల అనుబంధం దాదాపు విలీనంలాంటిదేనని అనిల్ అంబానీ అభివర్ణించారు. అన్మోల్ ప్రభావం.. రిలయన్స్ క్యాపిటల్‌లో కొత్త డెరైక్టర్‌గా తన కుమారుడు అన్మోల్ అంబానీ నియమితులైనప్పటి నుంచి రిలయన్స్ క్యాపిటల్ షేర్ 40 శాతం పెరిగిందని అనిల్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ అన్మోల్ ప్రభావం కొనసాగగలదన్న ఆశాభావాన్ని, ధీమాను ఆయన వ్యక్తం చేశారు. అన్మోల్ డెరైక్టర్‌గా చేరకముందు రిలయన్స్ క్యాపిటల్ షేర్ రూ.467గా ఉంది. సోమవారం ఈ షేర్ రూ.557 ధర వద్ద ముగిసింది. పూర్తి స్థాయి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా అన్మోల్ నియామకాన్ని ఈ ఏజీఎమ్‌లో వాటాదారుల ఆమోదించడం పట్ల వాటాదారులకు అనిల్ అంబానీ కృతజ్జతలు తెలిపారు. -
దూసుకొచ్చిన వారసుడు
ముంబై: కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ క్యాపిటల్ కంపెనీలోకి కొత్త వారసుడు దూసుకొచ్చాడు. రిలయన్స్ గ్రూప్ అధ్యక్షుడు అనిల్ ధీరూబాయ్ అంబానీ పెద్ద కొడుకు జై అన్మోల్ అంబానీ (24) ఎడిషనల్ డైరెక్టర్ గా నియమితుడయ్యారు. ఈ మేరకు కంపెనీ బోర్డు మంగళవారం ఆమోదం తెలిపింది. రిలయన్స్ క్యాపిటల్ బోర్డు ఆధ్వర్యంలోని నామినేషన్ అండ్ కాంపన్సేషన్ కమిటీ సిఫారసులకు మేరకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై అన్మోల్ అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ లో గత రెండేళ్లుగా తనకున్న అనుభవం వ్యాపారవృద్ధిలో తనకు సహాయపడనుందని తెలిపారు. ఫాస్ట్ లెర్నర్ గా వివిధ నిర్ణయాలసందర్భంగా యాక్టివ్ పార్టిసిపెంట్ గా ఉన్న అన్ మోల్ ను ఆహ్వానిస్తున్నామని, రిలయన్స్ కాపిటల్ ఈడీ, గ్రూప్ సీఈవో సామ్ ఘోష్ ఆయనకుస్వాగతం పలికారు. కాగా జై అన్మోల్ 2014 నుంచి రిలయన్స్ క్యాపిటల్ తన సేవలను అందించారు. 'వార్విక్ బిజినెస్ స్కూల్' నుంచి డిగ్రీ పొందిన ఇతడికి ఫైనాన్స్ రంగంపై ఆసక్తి ఎక్కువ. ఈ నేపథ్యంలో రిలయన్స్ క్యాపిటల్ వివిధ కంపెనీలను టేకోవర్ చేస్తూ దూసుకెడుతున్న సంగతి తెలిసిందే.