న్యూఢిల్లీ: మార్టిగేజ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ నిధుల సమీకరణకు తెరతీసింది. మార్పిడి రహిత డిబెంచర్ల(ఎన్‌సీడీలు) జారీ ద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకోనున్నట్లు తాజాగా వెల్లడించింది. ప్రయివేట్ ప్లేస్‌మెంట్ పద్ధతిలో పెట్టుబడులను సమీకరించనున్నట్లు పేర్కొంది. పదేళ్ల కాలావధితో ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎన్‌సీడీలను కేటాయించనున్నట్లు తెలియజేసింది.
వెరసి దీర్ఘకాలిక నిధులను అందుకునే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. నిధులను గృహ రుణ బిజినెస్‌కు అవసరమయ్యే ఫైనాన్సింగ్, రీఫైనాన్సింగ్‌కు వినియోగించనున్నట్లు వివరించింది. నిధుల సమీకరణ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.4 శాతం నీరసించి రూ. 2,643 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment