
న్యూఢిల్లీ: గతంలో జారీ చేసిన మార్పిడి రహిత బాండ్ల (ఎన్‌సీడీలు)పై వడ్డీ చెల్లింపుల్లో రెలిగేర్ ఫిన్‌వెస్ట్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌ఎల్) విఫలమైంది. కంపెనీ బాండ్లు కలిగినవారికి ఈ నెల 25న చెల్లించవలసి ఉన్న రూ. 96 లక్షల వడ్డీ చెల్లిం పుల్లో డిఫాల్ట్ అయినట్లు కంపెనీ తాజాగా వెల్ల డించింది. మాతృ సంస్థ రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్(ఆర్‌ఈఎల్) గత ప్రమోటర్లు కంపెనీ నిధులను అక్రమంగా తరలించడం, దుర్వినియోగం చేయడంతో ఆస్తి, అప్పుల సమన్వయంలో తేడాలొచ్చినట్లు వివరించింది. దీంతో తాజా సమస్య తలెత్తినట్లు ఆర్‌ఈఎల్ అనుబంధ సంస్థ రెలిగేర్ ఫిన్‌వెస్ట్ పేర్కొంది. కాగా.. ఈ సమస్యల నేపథ్యంలోనే ఆర్‌ఎఫ్‌ఎల్‌ను 2018 జనవరి నుంచి రిజర్వ్ బ్యాంక్ దిద్దుబాటు చర్యల ప్రణాళిక(సీఏపీ)లోకి తీసుకువచ్చింది.