
న్యూఢిల్లీ: జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్(జేఎస్‌పీఎల్) కంపెనీకి రెండో త్రైమాసిక కాలంలో రూ.399 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.279 కోట్ల నికర లాభం వచ్చిందని జేఎస్‌పీఎల్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.9,983 కోట్ల నుంచి రూ.8,940 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ధరలు, లాభదాయకత బాగా తగ్గినా, రెయిల్స్, ప్లేట్స్ వంటి విభిన్నమైన విలువాధారిత ఉత్పత్తుల తోడ్పాటుతో ఒకింత ఊరట లభించిందని వివరించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రుణ భారం రూ.36,501 కోట్లుగా ఉందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment