Mind Tree
-
ఐటీ దిగ్గజాల కీలక నిర్ణయం: ఆందోళనలో టెకీలు
ఐటీ దిగ్గజ కంపెనీలు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్-19, లాక్డౌన్ కాలంలో తీసుకొచ్చిన వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలికేందుకు సంసిద్దమవుతున్నాయి. ఇప్పటికే టీసీఎస్ అక్టోబర్ 1 నుంచి వారంలో 5 రోజులు ఆఫీసు నుంచే పనిచేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఇపుడిక విప్రో, క్యాప్‌జెమినీ LTIMindtree టాప్ కంపెనీలు వారంలో అన్ని రోజులు లేదా సగం రోజులు ఇక ఆఫీసుకు రావాలని ఉద్యోగులను ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎకనామిక్స్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం రిమోట్ వర్క్, వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు ఇక ముగిసినట్టే కనిపిస్తోందని ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు. వారానికి 5 రోజులు లేదా వారానికి 3-4 రోజులు ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చి చెప్పాయి. దేశంలోని ప్రధాన ఐటీ హబ్‌లైన పూణె , బెంగళూరు, హైదరాబాద్‌లోని పలు కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు మౌఖిక, అనధికారిక కమ్యూనికేషన్ ద్వారా సంబంధిత ఆదేశాలు జారీ చేశాయి. అయితే కొంతమంది మాత్రం ఇంకా రిమోట్ వర్క్ ఉద్యోగాల వేటలో తలమునకలై ఉన్నారు. (మళ్లీ వార్తల్లోకి జార్ఖండ్: ఇక ఆ ఇండస్ట్రీకి తిరుగే లేదు!) కాగా గ్లోబల్‌గా నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఐటీ సంస్థలను కలవరపెడుతున్నాయి. ఆదాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో భారీ మందగమనాన్ని ఎదుర్కొంటున్నాయి. ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. వందలమందిని లేఆఫ్స్ చేశాయి. కొత్త నియామకాలను దాదాపు నిలిపి వేశాయి. రానున్న కాలంలో ఇది మరింతగా ముదురుతుందనే ఆందోళనను నిపుణులువ్యక్తం చేస్తున్నారు. -
ఎల్టీఐ–మైండ్‌ట్రీ ఆవిర్భావం
ముంబై: డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీ గ్రూప్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ లిమిటెడ్ విలీనమయ్యాయి. ఎల్టీఐ–మైండ్‌ట్రీ పేరుతో కొత్త సంస్థ ఏర్పాటైనట్లు ఎల్అండ్టీ తాజాగా వెల్లడించింది. దీంతో సంయుక్త సంస్థ దేశీ ఐటీ సర్వీసుల రంగంలో 5.25 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఆరో పెద్ద కంపెనీగా ఆవిర్భవించినట్లు తెలియజేసింది. విలీనం వెనువెంటనే అమల్లోకి వచ్చినట్లు ఎల్అండ్టీ గ్రూప్ చైర్మన్ ఏఎం నాయక్ ప్రకటించారు. ఎల్టీఐ మైండ్‌ట్రీలో ట్రేడింగ్ 24 నుంచి ప్రారంభంకానున్నట్లు వెల్లడించారు. రూ. 1.53 లక్షల కోట్ల(సోమవారం ముగింపు) మార్కెట్ విలువతో సాఫ్ట్వేర్ రంగంలో ఐదో ర్యాంకులో నిలుస్తున్నట్లు తెలియజేశారు. విలీన సంస్థలో ఎల్అండ్టీ 68.73 శాతం వాటాను కలిగి ఉంది. విలీనంలో భాగంగా మైండ్‌ట్రీ వాటాదారులకు తమవద్ద గల ప్రతీ 100 షేర్లకు 73 ఎల్టీఐ షేర్లు జారీ చేయనున్నట్లు నాయక్ తెలియజేశారు. ఇందుకు ఈ నెల 24 రికార్డ్ డేట్‌గా నిర్ణయించారు. ఈ ఏడాది మే నెలలో రెండు కంపెనీల విలీనానికి తెరతీసిన సంగతి తెలిసిందే. విలీనం నేపథ్యంలో ఎన్ఎస్ఈలో మైండ్‌ట్రీ షేరు 2.7 శాతం ఎగసి రూ. 3,760 వద్ద, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ 2 శాతం బలపడి రూ. 5,161 వద్ద ముగిశాయి. -
ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ విలీనం
ముంబై: డిజిటల్ సర్వీసుల్లో భారీ ఆర్డర్ల కోసం పోటీపడే దిశగా ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ (ఎల్టీఐ), మైండ్‌ట్రీలను విలీనం చేస్తున్నట్లు ఇంజనీరింగ్, నిర్మాణ రంగాల దిగ్గజం ఎల్అండ్టీ గ్రూప్ వెల్లడించింది. విలీన సంస్థ పేరు ఎల్టీఐమైండ్ట్రీగా ఉంటుందని వివరించింది. 3.5 బిలియన్ డాలర్ల ఆదాయంతో టెక్ మహీంద్రా తర్వాత రెవెన్యూపరంగా దేశీయంగా ఆరో అతి పెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థగా ఎల్టీఐ ఉండనుంది. అవసరమైన అనుమతులన్నీ వచ్చాక వచ్చే పదకొండు నెలల్లో ప్రక్రియ పూర్తి కాగలదని ఎల్అండ్టీ గ్రూప్ పేర్కొంది. విలీన సంస్థకు దేబాశీష్ చటర్జీ సారథ్యం వహిస్తారు. ఎల్టీఐ సీఈవో సంజయ్ జలోనా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు ఎల్అండ్టీ చైర్మన్ ఏఎం నాయక్ చెప్పారు. 2 కంపెనీల్లో ఎల్అండ్టీకి మెజారిటీ వాటాలు ఉన్నా యి. పూర్తిగా స్టాక్స్ రూపంలో ఉండే ఈ డీల్ ప్రకా రం మైండ్‌ట్రీ షేర్‌హోల్డర్ల దగ్గరున్న ప్రతి 100 షేర్ల కు 73 ఎల్టీఐ షేర్లు లభిస్తాయి. ఎల్టీఐమైండ్ట్రీలో ఎల్అండ్టీకి 68.73% వాటాలు ఉంటాయి. టార్గెట్ 10 బిలియన్ డాలర్లు 100 మిలియన్ డాలర్లకు పైగా విలువ చేసే భారీ డీల్స్ కోసం పోటీపడేందుకు ఈ విలీనం ఉపయోగపడగలదని నాయక్ తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీలకు లభిస్తున్న ప్రాజెక్టుల విలువ దాదాపు 25 మిలియన్ డాలర్ల స్థాయిలోనే ఉంటోందని ఆయన చెప్పారు. ఆదాయ పరిమాణం తక్కువగా ఉండటం వల్ల పెద్ద కాంట్రాక్టులకు బిడ్ చేయడం సాధ్యపడటం లేదని నాయక్ తెలిపారు. వచ్చే అయిదేళ్లలో విలీన సంస్థ ఆదాయాలు 10 బిలియన్ డాలర్లకు చేరుకోగలదన్న ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇది 3.5 బిలియన్ డాలర్లుగా ఉంది. 80వేల పైచిలుకు సిబ్బంది విలీన సంస్థలో 80,000 మంది పైగా సిబ్బంది ఉంటారు. విలీనంతో తాము కొత్తగా 15–20% మందిని కొత్తగా రిక్రూట్ చేసుకోవాల్సి రానున్నట్లు నాయక్ తెలిపారు. ఎల్అండ్టీలో ఐటీ విభాగంగా 2000లో ఎల్టీఐ ఏర్పాటైంది. 2019లో మైండ్‌ట్రీలో ఎల్అండ్టీ గ్రూప్ మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. చదవండి: ఫ్రెషర్లకు అదిరిపోయే శుభవార్త..! కాగ్నిజెంట్‌లో భారీగా నియామకాలు! -
మైండ్‌ట్రీతో జట్టుకట్టిన, శాపియన్స్
న్యూఢిల్లీ: బీమా రంగ సొల్యూషన్స్ అందించేందుకు ఐటీ సర్వీసుల కంపెనీ మైండ్‌ట్రీ, విదేశీ సంస్థ శాపియన్స్ ఇంటర్నేషనల్ చేతులు కలిపాయి. ప్రాథమికంగా ఇన్సూరెన్స్ వ్యవస్థల(సిస్టమ్స్) అభివృద్ధికి డిజైన్‌ను అందించనున్నట్లు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో రెండు కంపెనీలూ పేర్కొన్నాయి. భాగస్వామ్యం ద్వారా తొలుత ఉత్తర అమెరికాపై దృష్టి సారించనున్నట్లు తెలియజేశాయి. తదుపరి యూరప్, ఆసియాలలో విస్తరించే ప్రణాళికలున్నట్లు వెల్లడించాయి. ప్రాపర్టీ, క్యాజువాలిటీ, లైఫ్, యాన్యుటీ ఇన్సూరెన్స్ మార్కెట్లలో మైండ్‌ట్రీతో జత కడుతున్నందుకు సంతోషిస్తున్నట్లు శాపియన్స్ ఉత్తర అమెరికా ప్రెసిడెంట్, జీఎం జామీ యోడర్ పేర్కొన్నారు. రెండు సంస్థల సంయుక్త సామర్థ్యాలు డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, బిజినెస్ సొల్యూషన్స్‌లో గరిష్ట ప్రయోజనాలు కల్పించనున్నట్లు మైండ్‌ట్రీ బీఎఫ్ఎస్ఐ విభాగం చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ముకుంద్ తెలిపారు. చదవండి: ఎంఈసీఎల్‌తో సీఎంపీడీఐఎల్ విలీనం సన్నాహాల్లో ప్రభుత్వం! -
విలీన బాటలో దిగ్గజ ఐటీ కంపెనీలు?
ముంబై: సాఫ్ట్వేర్ సేవల మధ్యస్థాయి కంపెనీలు ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ లిమిటెడ్ విలీనం కానున్నట్లు తెలుస్తోంది. మౌలిక రంగ ఇంజినీరింగ్ దిగ్గజం ఎల్అండ్టీ గ్రూప్‌నకు చెందిన ఈ రెండు సంస్థలు విలీనమైతే 22 బిలియన్ డాలర్ల(రూ. 1,65,000 కోట్లు) విలువైన ఐటీ కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు అంచనా. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ లిమిటెడ్ బోర్డులు విలీనానికి అనుగుణంగా షేర్ల మార్పిడి అంశాన్ని పరిశీలించనున్నట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. కొద్ది రోజులుగా మాతృ సంస్థ లార్సెన్ అండ్ టుబ్రో(ఎల్అండ్టీ) లిస్టెడ్ ఐటీ కంపెనీలు రెండింటి విలీనానికున్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేసినట్లు వెల్లడించాయి. తద్వారా గ్లోబల్ డిజిటల్ దిగ్గజాలతో విలీన సంస్థ పోటీపడేందుకు వీలుంటుందని మౌలిక రంగ దిగ్గజం ఎల్అండ్టీ భావిస్తున్నట్లు తెలియజేశాయి. వచ్చే వారమే? మౌలిక దిగ్గజం ఎల్అండ్టీ లిమిటెడ్ నియంత్రణలోని ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ లిమిటెడ్ విలీనానికి షేర్ల మార్పిడి అంశంపై వచ్చే వారం మొదట్లోనే బోర్డులు చర్చించే వీలున్నట్లు తెలుస్తోంది. ఐటీ సేవల కంపెనీ మైండ్‌ట్రీను 2019లో ఎల్అండ్టీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మైండ్‌ట్రీలో ఎల్అండ్టీకి 61 శాతం వాటా ఉంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) తాజాగా రూ. 65,287 కోట్లు (8.7 బిలియన్ డాలర్లు)స్థాయికి చేరింది. ఇక ఎల్అండ్టీకి 74 శాతం వాటా కలిగిన ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ విలువ రూ. 1,02,825 కోట్లు(13.7 బిలియన్ డాలర్లు)గా నమోదైంది. వెరసి విలీన సంస్థ మార్కెట్ క్యాప్ 22 బిలియన్ డాలర్లను అధిగమించనున్నట్లు మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. క్లయింట్ల విషయంలో.. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ విలీనమైతే క్లయింట్లు లేదా బిజినెస్‌లో పరస్పర అతిక్రమణ నామమాత్రంగానే ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. సర్వీసులకు అధిక ధరలు పొందేందుకు, వ్యయాల నియంత్రణకు రెండు సంస్థల మధ్య ఒప్పందం దారి చూపుతుందని అంచనా వేశాయి. అయితే విలీనం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లే వీలున్నట్లే.. ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉన్నదని మీడియా వర్గాలు అభిప్రాయపడ్డాయి. కాగా.. ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు ఎల్అండ్టీ ప్రతినిధి ఒకరు నిరాకరించగా.. మైండ్‌ట్రీ, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ నుంచి స్పందన కరువైనట్లు తెలియజేశాయి. మైండ్‌ట్రీ క్యూ4(జనవరి–మార్చి) త్రైమాసిక ఫలితాలను సోమవారం(18న) విడుదల చేయగా.. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్పనితీరు నేడు(19న) వెల్లడికానుంది. కోవిడ్–19 ఎఫెక్ట్ కొద్ది నెలలుగా ప్రపంచస్థాయిలో విస్తరించిన కోవిడ్–19 మహమ్మారితో డిజిటైజేషన్‌కు డిమాండు బాగా పెరిగినట్లు ఐటీ నిపుణులు చెబుతున్నారు. దీంతో సాఫ్ట్వేర్ సేవల కంపెనీలకు బిజినెస్ అవకాశాలు భారీగా విస్తరిస్తున్నట్లు తెలియజేశారు. ఐటీ ఔట్సోర్సింగ్ దిగ్గజాలు సైబర్ సెక్యూరిటీ, ఆటోమేషన్, మెషీన్‌లెర్నింగ్ సపోర్ట్ తదితర నవతరం సేవలు అందించేందుకు పోటీ పడుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సేవలకు పెరుగుతున్న డిమాండును అందుకునేందుకు ఐటీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. షేర్లు డీలా: మైండ్‌ట్రీ షేరు ఎన్ఎస్ఈలో 3.3 శాతం క్షీణించి రూ. 3,965 వద్ద నిలవగా.. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ 2.5 శాతం నష్టంతో రూ. 5,890 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో మైండ్‌ట్రీ రూ. 4,020–3,834 మధ్య ఊగిసలాడింది. మైండ్‌ట్రీ లాభం జూమ్ న్యూఢిల్లీ: ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ మైండ్‌ట్రీ లిమిటెడ్ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు ప్రదర్శించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 49% జంప్‌చేసి రూ. 473 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2020–21) క్యూ4లో రూ. 317 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 37 శాతంపైగా ఎగసి రూ. 2,897 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 2,109 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఇక పూర్తి ఏడాదికి మైండ్‌ట్రీ కన్సాలిడేటెడ్ నికర లాభం 49% వృద్ధితో రూ. 1,653 కోట్లకు చేరింది. ఆదాయం రూ. 7,968 కోట్ల నుంచి రూ. 10,525 కోట్లకు ఎగసింది. ఇది 31% అధికం. షేరుకి రూ. 27 చొప్పున తుది డివిడెండును కంపెనీ ప్రకటించింది. కాగా, మెండ్‌ట్రీ, ఎల్అండ్టీ టెక్ మధ్య విలీన వార్తలపై స్పందిస్తూ ఇవన్నీ ఊహాగానాలేనంటూ మైండ్‌ట్రీ సీఈవో, ఎండీ దేవశిష్ చటర్జీ దేవశిష్ కొట్టిపారేశారు. చదవండి: -
ఇద్దరు ఐటీ ఉద్యోగులకు కరోనా
న్యూఢిల్లీ/సాక్షి, బెంగళూరు: భారత్‌లో కరోనా వైరస్ భయాందోళనలు సృష్టిస్తోంది. ఇద్దరు ఐటీ ఉద్యోగులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. డెల్, మైండ్ ట్రీ ఐటీ కంపెనీలకు చెందిన ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకినట్టు బుధవారం ఆ కంపెనీలు వెల్లడించాయి. అమెరికా టెక్సాస్ నుంచి వచ్చిన ఒకరికి కరోనా వైరస్ సోకింది. మైండ్ ట్రీ కంపెనీకి చెందిన ఉద్యోగి ఆఫీసు పని మీద ఇతర దేశానికి వెళ్లి వచ్చారు. ఈ ఉద్యోగులిద్దరూ భారత్‌కు వచ్చాక వారు కలిసిన సంబంధీకులను నిర్బంధంలో ఉంచి వైద్య పరీక్షలు చేస్తున్నారు. అది కరోనా మరణం కాదు: కర్ణాటక మంత్రి మన దేశంలో కరోనా వైరస్ సోకినట్టుగా అనుమానిస్తున్న ఒక వృద్ధుడు మరణించారు. ఇటీవల సౌదీ యాత్రకి వెళ్లొచ్చిన 76 ఏళ్ల కర్ణాటక వాసి మహమ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ జ్వరం, దగ్గు, జలుబు ఉండటంతో ఐదోతేదీన కలబురిగి జిల్లా మెడికల్ కాలేజీకి, తర్వాత 9న హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. వైరస్ లక్షణాలు తగ్గకపోవడంతో అంబులెన్స్‌లో కలబురిగికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. అతనికి కోవిడ్ సోకిందన్న అనుమానంతో గతంలోనే రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం బెంగుళూరు ల్యాబ్‌కి పంపారు. హుస్సేన్‌కి కోవిడ్ సోకి ఉంటుందనే అనుమానాలున్నాయని కలబురిగి జిల్లా ఆరోగ్య శాఖ వెల్లడించింది. సిద్ధిఖీ వృద్ధాప్యంతోనే తుదిశ్వాస విడిచారని, వైరస్ సోకిందని ఆందోళన చెందవద్దని మంత్రి చెప్పారు. దౌత్య, అధికారిక, ఐరాస, ఉద్యోగ, ప్రాజెక్టు వీసాలు తప్ప మిగిలిన వీసాలన్నీ ఏప్రిల్ 15 వరకూ రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. -
మైండ్ ట్రీ 200% స్పెషల్ డివిడెండ్
న్యూఢిల్లీ: మిడ్– సైజ్ ఐటీ కంపెనీ మైండ్ ట్రీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 9 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.182 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.198 కోట్లకు పెరిగిందని మైండ్‌ట్రీ తెలిపింది. ఆదాయం రూ.1,464 కోట్ల నుంచి 26% వృద్ధితో రూ.1,839 కోట్లకు పెరిగిందని పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర లాభం 32% వృద్ధితో రూ.754కు, మొత్తం ఆదాయం 29 శాతం వృద్ధితో రూ.7,021 కోట్లకు పెరిగాయని మైండ్‌ట్రీ సీఈఓ, ఎమ్డీ రోస్టో రావణన్ తెలిపారు. వంద కోట్ల డాలర్లు దాటిన వార్షికాదాయం.... ఒక్కో షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని రావణన్ తెలిపారు. ఈ మధ్యంతర డివిడెండ్‌ను వచ్చే నెల 10లోగా చెల్లిస్తామని, అలాగే ఒక్కో షేర్‌కు రూ.4 తుది డివిడెండ్‌ను కూడా చెల్లించనున్నామని వివరించారు. అంతే కాకుండా రూ.20 (200%) స్పెషల్ డివిడెండ్‌ను కూడా ఇవ్వనున్నామని పేర్కొన్నారు. వార్షికాదాయం వంద కోట్ల డాలర్లు దాటిందని, కంపెనీ 20వ వార్షికోత్సవం జరుపుకుంటోందని, దీని కారణంగా ఈ స్పెషల్ డివిడెండ్‌ను ఇస్తున్నామని వివరించారు. రూ.368 కోట్ల డివిడెండ్ చెల్లింపులు... మొత్తం 16 కోట్ల ఈక్విటీ షేర్లున్నాయని, స్పెషల్ డివిడెండ్ కింద ప్రమోటర్లకు, వాటాదారులకు రూ.320 కోట్ల మేర చెల్లించనున్నామని ఈ సందర్భంగా రావణన్ తెలిపారు. మధ్యంతర డివిడెండ్‌ను కూడా కలుపుకుంటే మొత్తం డివిడెండ్ చెల్లింపులు రూ.368 కోట్లకు పెరుగుతాయని వివరించారు. ఈ స్పెషల్ డివిడెండ్ ప్రతిపాదనకు జూన్/జూలైల్లో జరిగే వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉందని పేర్కొన్నారు. (అప్పటికల్లా ఎల్ అండ్ టీ ఓపెన్ ఆఫర్ ముగుస్తుంది) గత ఆర్థిక సంవత్సరంలోనూ, గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లోనూ చెప్పుకోదగ్గ స్థాయి పనితీరు సాధించామని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కంపెనీని ఎల్అండ్టీ బలవంతంగా టేకోవర్ చేస్తోన్న విషయం తెలిసిందే. -
మైండ్ ట్రీ 1:1 బోనస్ షేర్లు
న్యూఢిల్లీ : అన్ని సెగ్మెంట్లలో పటిష్టమైన వృద్ధి కారణంగా మధ్య తరహా ఐటీ సంస్థ మైండ్‌ట్రీ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.151 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ3లో ఆర్జించిన నికర లాభం(రూ.141 కోట్లు)తో పోల్చితే 7 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. ఆదాయం రూ.912 కోట్ల నుంచి 33 శాతం వృద్ధితో రూ.1,215 కోట్లకు పెరిగిందని వివరించింది. ఈ క్యూ3లో మంచి ఆదాయ వృద్ధిని సాధించామని కంపెనీ సీఈఓ కృష్ణకుమార్ నటరాజన్ తెలిపారు. డాలర్ టర్మ్‌ల్లో నికర లాభం 0.2 శాతం వృద్ధితో 2.28 కోట్ల డాలర్లకు, ఆదాయం 25 శాతం వృద్ధితో 18.44 కోట్ల డాలర్లకు పెరిగాయని పేర్కొన్నారు. 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇవ్వనున్నామని నటరాజన్ తెలిపారు. రెండేళ్లలో బోనస్ షేర్లనివ్వడం ఇది రెండోసారని పేర్కొన్నారు. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.4 మధ్యంతర డివిడెండ్‌ను కూడా ఇవ్వనున్నామని వివరించారు. మ్యాగ్నెట్ 360 సంస్థను 5 కోట్ల డాలర్లకు (రూ.338.3 కోట్లు)అంతా నగదులోనే కొనుగోలు చేశామని నటరాజన్ పేర్కొన్నారు. -
కోలుకున్న మార్కెట్లు
109 పాయింట్లు అప్ 26,108 వద్దకు సెన్సెక్స్ కుప్పకూలిన ఐటీ షేర్లు రెండు రోజుల నష్టాల తరువాత మళ్లీ మార్కెట్లు కుదుటపడ్డాయి. సెన్సెక్స్ 109 పాయింట్లు పుంజుకుని 26,108 వద్ద ముగిసింది. తద్వారా 26,000 పాయింట్ల కీలక స్థాయికి ఎగువన నిలిచింది. ఇక నిఫ్టీ కూడా 31 పాయింట్లు లాభపడి 7,780 వద్ద స్థిరపడింది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో సెంటిమెంట్ మెరుగైందని నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఆర్థిక సంస్కరణలు వేగమందుకుంటాయన్న ఆశలు ఇన్వెస్టర్లలో ఏర్పడ్డాయని తెలిపారు. ప్రధానంగా బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, వినియోగ వస్తు రంగాలు 2.5-2% మధ్య పురోగమించాయి. టీసీఎస్ నేలచూపులు: ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో ప్రకటించిన ఫలితాలు నిరుత్సాహపరచడంతో ఐటీ దిగ్గజాలు టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ అమ్మకాలతో కుప్పకూలాయి. ఈ షేర్లు 9% చొప్పున పతనంకాగా, కేపీఐటీ, మైండ్‌ట్రీ సైతం 2.5% చొప్పున నీరసించాయి. టీసీఎస్‌లో విలీనంకానున్న సీఎంసీ 14%పైగా దిగజారింది. దీంతో బీఎస్ఈలో ఐటీ ఇండెక్స్ 4% పడిపోయింది. కాగా, మిగిలిన సెన్సెక్స్ దిగ్గజాలలో సెసాస్టెరిలైట్, హిందాల్కో 2.5% స్థాయిలో నష్టపోయాయి. అయితే మరోవైపు భెల్, హీరోమోటో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ, సిప్లా, ఎస్బీఐ, ఎల్అండ్టీ, భారతీ, యాక్సిస్ 3.5-2% మధ్య పురోగమించడంతో మార్కెట్లు లాభాలతో ముగిశాయి.