కెల్లార్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం | Three Terrorists Killed In Encounter At Keller Area Of Shopian | Sakshi
Sakshi News home page

కెల్లార్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

Published Thu, Mar 28 2019 9:16 AM | Last Updated on Thu, Mar 28 2019 9:16 AM

Three Terrorists Killed In Encounter At Keller Area Of Shopian - Sakshi

శ్రీనగర్‌: షోపియాన్‌ జిల్లాలోని కెల్లార్‌ ప్రాంతంలో గురువారం ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. సీఆర్పీఎఫ్‌, ఆర్మీ బలగాలు సంయుక్తంగా కెల్లార్‌ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులకు ధీటుగా బదులిచ్చారు. ఘటన స్థలం నుంచి భద్రతా బలగాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఉగ్ర కదలికలపై ఆర్మీ బలగాలు ఇంకా సెర్చ్‌ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement