శ్రీనగర్: జమ్ముకశ్మీర్ పూంఛ్‌లో ఉగ్రవాదులు చేసిన దాడిలో ఐదుగురు భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ నిపుణుల బృందం కీలక ఆధారాలు సేకరించింది. ఉగ్రవాదులు ఈ దాడికి స్టికీ బాంబులు, స్టీల్ బుల్లెట్లు, గ్రనేడ్లు ఉపయోగించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
స్టికీ బాంబులు అంటే పేలుడు పరికరాలు. వీటిని వాహనానికి అమర్చి డిటోనేటర్ల ద్వారా లేదా టైమర్ సెట్ చేసి పేలుస్తారు. ఘటనా స్థలంలో స్టికీ బాంబులతో పాటు, రెండు గ్రనేడ్ పిన్నులు, బుల్లెట్లను ఫోరెన్సిక్ బృందం స్వాధీనం చేసుకుంది. జవాన్లపై ఉగ్రవాదులు 36 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
రక్షణ శాఖ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఈ దాడిలో రెండు ఉగ్ర సంస్థలకు చెందిన ఏడుగురు తీవ్రవాదులు పాల్గొన్నారు. వీరు పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలకు చెందినవారు అయి ఉంటారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన నివేదికను ఇంటెలిజెన్స్ బ్యూరో.. కేంద్ర హోంశాఖ, ఎన్‌ఐఏకు అందించింది.
దాడి అనంతరం నిందితుల కోసం వేట మొదలుపెట్టాయి భారత బలగాలు. 2000కు పైగా కామాండోలను రంగంలోకి దించి ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో హై అలర్ట్ విధించారు. నియంత్రణ రేఖ వద్ద నిఘాను మరింత పటిష్టం చేశారు.
చదవండి: ఉగ్రదాడిలో అమరులైన సైనికులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment