
జమ్మూకశ్మీర్: పుల్వామా జిల్లాలో ఉగ్రదాడి కలకలం సృష్టించింది. ఎస్పీఓ ఫయాజ్ అహ్మద్ ఇట్లోకి చొరబడిన ఉగ్రవాదులు ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఫయాజ్ భార్య, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా.. ఫయాజ్ అహ్మద్, ఆయన భార్య మరణించారు. కుమార్తెను శ్రీనగర్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక దుండగుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు.
కాగా, శ్రీనగర్‌లోని మెంగన్‌వాజీ నౌగాం ప్రాంతంలో ప్రార్థనలకు వెళ్లే సమయంలో మరో పోలీసు అధికారి పర్వైజ్ అహ్మద్ దార్‌పై ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు మంగళవారం కాల్పులు జరిపారు. అలాగే గత నెలలో జావైద్ అహ్మద్ అనే పోలీసు అధికారిపై తన నివాసం సమీపంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగపడ్డారు. వీరిద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
చదవండి:
రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోండి
అణచివేత శకం ముగియాలి
Comments
Please login to add a commentAdd a comment