సోమాలియాలో ఉగ్రవాదుల దాడి | Terrorist attack in Somalia | Sakshi
Sakshi News home page

సోమాలియాలో ఉగ్రవాదుల దాడి

Published Fri, Jun 16 2017 12:53 AM | Last Updated on Tue, Sep 5 2017 1:42 PM

సోమాలియాలో ఉగ్రవాదుల దాడి

సోమాలియాలో ఉగ్రవాదుల దాడి

31 మంది మృతి
మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నగరంలోని ప్రముఖ రెస్టారెంట్‌పై అల్‌–షబాబ్‌ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో మొత్తం 31 మంది మరణించగా, దాదాపు 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎదురుకాల్పుల్లో దాడికి పాల్పడ్డ ఐదుగురు ఉగ్రవాదుల్ని పోలీసులు హతమార్చారు.

పోలీసుల కథనం ప్రకారం.. పేలుడు పదార్థాలు, తుపాకులతో రెస్టారెంట్‌ వద్దకు దూసుకొచ్చిన ఉగ్రవాదులు కారు బాంబుతో భయోత్పాతం సృష్టించారు. అనంతరం రెస్టారెంట్‌లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. భద్రతా బలగాలు రెస్టారెంట్‌ను ముట్టడించడంతో ఇరు వర్గాల మధ్య రాత్రంగా ఎదురుకాల్పులు కొనసాగాయి. అనంతరం భద్రతా బలగాలు రెస్టారెంట్‌లోకి చొచ్చుకుపోయి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు పోలీసు ఉన్నతాధికారి కెప్టెన్‌ మహమూద్‌ హుస్సేన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement