జమ్మూ: ఆర్మీక్యాంప్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డ ఘటనతో జమ్మూలో హై అలర్ట్ ప్రకటించారు. అఖ్నుర్ సెక్టార్‌లోని ఆర్మీ క్యాంప్ జీఆర్‌ఈఎఫ్(జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్)పై ఈరోజు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఘటనలో క్యాంప్‌లో పనిచేసే ముగ్గురు కూలీలు మృతి చెందినట్లు తెలిపారు. అయితే దాడిలో పాల్గొన్నది ఎంతమంది పాల్గొన్నరానేదానిపై స్పష్టత లేదని, దాడి అనంతరం వారు పరారైనట్లు పేర్కొన్నారు. కాగా ఈ ఏడాదిలో ఉగ్రవాదులు దాడి చేయడం ఇదే తొలిసారి. మరోవైపు ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
జమ్మూలో హై అలర్ట్
Published Mon, Jan 9 2017 9:23 AM | Last Updated on Tue, Aug 28 2018 7:14 PM
Advertisement
Advertisement