మక్కా మసీదులో తప్ప.. | 'No where in the world can anyone be safe except may be in Mecca masjid' tweets Ram Gopa Varma | Sakshi
Sakshi News home page

మక్కా మసీదులో తప్ప..

Published Fri, Jul 15 2016 5:50 PM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM

మక్కా మసీదులో తప్ప..

మక్కా మసీదులో తప్ప..

ఫ్రాన్స్ లో జరిగిన ఉగ్రదాడిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో స్పందించాడు. 'నీస్ పై జరిగిన దాడి నైస్ కాదు. ఇలాంటి దాడి ఎక్కడైనా జరగొచ్చు. ఇలాంటివి ఆగిపోవాలని దేవుడిని ప్రార్థించాలని ఉంది, కానీ ఏ దేవుడిని వేడుకోవాలో తెలియడం లేదు. ఉగ్రవాదులు నరమేధం సృష్టించడానికి బాంబులు కూడా అక్కర్లేదు.. వాహనాలు ఉంటే చాలనే భయంకర వాస్తవాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తుంది. నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు పిచ్చి జోకుల్లా తయారయ్యాయి. నీస్ నగరంపై జరిగిన దాడి ఒకటే నిరూపిస్తుంది.. ప్రపంచంలో ఎక్కడా ఏ ఒక్కరూ సురక్షితంగా ఉండలేరేమో, బహుశా ఒక్క మక్కా మసీదులో తప్ప' అంటూ ట్వీట్లు ఎక్కుపెట్టాడు వర్మ.

కాగా ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం బాస్టిల్‌ డే సందర్భంగా నీస్‌ నగరంలో జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొన్న జనాలపైకి ఉగ్రవాదులు అతివేగంగా ట్రక్కును నడిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 84 మంది మృతి చెందగా.. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement