శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఓ బీజేపీ నేతపై ఉగ్రమూకలు కాల్పులు జరపగా నేడు మరో బీజేపీ సర్పంచ్‌ను పొట్టన పెట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే కుల్గాం జిల్లాలోని వెస్సు ప్రాంతానికి చెందిన సర్పంచ్ సాజద్ అహ్మద్ ఖాండేపై ఆయన ఇంటికి సమీపంలోనే ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్రగాయాలతో నెత్తురోడుతున్న అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. (బీజేపీ నేత కుటుంబంపై ముష్కరుల కాల్పులు)
బుల్లెట్ గాయాలతో ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా కుల్గాం ప్రాంతానికి చెందిన మరో సర్పంచ్ ఆరిఫ్ అహ్మద్ షాపై సైతం బుధవారం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అతడిని ఖజిగండ్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. రెండు రోజుల్లోనే ఇద్దరు సర్పంచ్‌లపై దాడి జరగడం ఆందోళన కలిగించే విషయం. మరోవైపు జూలైలోనూ బీజేపీ నేత వసీం అహ్మద్ బరిని, అతడి సోదరుడిని ఉగ్రమూకలు కాల్చి చంపిన విషయం తెలిసిందే. (కశ్మీర్‌లో కలకలం.. బీజేపీ కార్యకర్త కిడ్నాప్)
Comments
Please login to add a commentAdd a comment