Kulgam
-
Nasira Akhtar: చెట్ల మధ్య ఎక్కువ సమయం గడిపే నసీర.. అద్భుత ఆవిష్కరణతో..
‘ఏముందీ... అంతా బూడిద’ అంటుంటారు. చక్కని ఆలోచనలు సొంతం కావాలేగానీ బూడిదలో నుంచి కూడా బంగారంలాంటి అవకాశాలు జనిస్తుంటాయి. కాస్త కన్ఫ్యూజింగ్గా ఉందా! అయితే మీరు నసీరా అఖ్తర్ గురించి తెలుసుకోవాల్సిందే... కశ్మీర్‌లోని కుల్గామ్ ప్రాంతానికి చెందిన నసీరా అఖ్తర్ ‘మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది. అవి మనతో మౌనంగా సంభాషిస్తాయి’ అనే పెద్దల మాటను విన్నదో లేదోగానీ మొక్కలతో గడపడం ఆమెకు చెప్పలేనంత ఇష్టం. ఆ ఇష్టమే తనకు పర్యావరణంపై ఆసక్తిని పెంచింది. హైస్కూల్ రోజులలో క్లాస్‌రూమ్‌లో తన ప్రశ్నలు లేని రోజు అంటూ ఉండేది కాదు. ఏదో అడగాలి కాబట్టి అడగాలి అనే కోవకు చెందిన ప్రశ్నలు కావు అవి. తనలోని విజ్ఞానదాహానికి ప్రతీకలుగా నిలిచే ప్రశ్నలు. అయితే నసీరా ప్రశ్నలకు ఉపాధ్యాయులు ఎప్పుడూ విసుక్కునేవారు కాదు. చాలా ఓపికగా సమాధానాలు చెప్పేవారు. ‘నీలో సైంటిస్ట్ లక్షణాలు కనిపిస్తున్నాయి’ అని అంతా చమత్కారంగా అనేవాళ్లు. కట్ చేస్తే... నసీరాకు పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. అంతమాత్రాన ఇల్లే లోకం అనుకోలేదు. ఇంటి పనే సర్వస్వం అనుకోలేదు. దినపత్రికలు, మ్యాగజైన్లలో తనకు ఆసక్తి కలిగించే శాస్త్రీయ విషయాలకు సంబంధించిన వ్యాసాలను కత్తిరించి దాచుకునేది. ఊళ్లో మిగిలిన మహిళలకు భిన్నంగా ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కనిపించే నసీరాను ఎవరో ఒకరు వెక్కిరిస్తూనే ఉండేవారు. అయితే.. తన ప్రపంచంలో తాను ఉండే నసీరాకు వాటి గాలి సోకేది కాదు. చెట్ల మధ్య ఎక్కువ సమయం గడిపే నసీర ఒక కల కన్నది. మొక్కల నుంచి పర్యావరణానికి మేలు చేసే పదార్థాన్ని తయారుచేయాలి... అనేది ఆ కలల సారాంశం. సంవత్సరం గడిచింది. ఏవేవో ప్రయోగాలు చేస్తూనే ఉంది. రెండు సంవత్సరాలు గడిచాయి. ప్రయోగాలు ఆపలేదు. ఆ సమయంలోనే మనసులో ఏదో ఒక మూల చిన్న నిరాశ తొంగిచూసింది. అయితే అంతలోనే తాత చెప్పిన మంచిమాట గుర్తుకు వచ్చి తనను ఉత్సాహంతో ముందుకు తీసుకువెళ్లేది. ‘ఒక కాలం నీ కోసం ఎదురుచూస్తుంటుంది. అది దగ్గరికి వచ్చిన తరువాత ఎగుడు దిగుళ్లను సరిచేసి నీ ముందు రాచబాటను ఏర్పాటు చేస్తుంది’... తాత తనకు చెప్పిన కశ్మీరి జానపద కథల్లోని ఒక మాట ఇది. ఆ కథలేవీ గుర్తులేవు. కాని ఈ మాట మాత్రం తనకు చాలా గట్టిగా గుర్తుండిపోయింది. సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత... ఎనిమిది సంవత్సరాల తరువాత... తన ప్రయోగం ఫలించింది. పర్యావరణానికి హాని కలిగించకుండా స్థానికంగా పెరిగే మొక్కలను ఉపయోగించి పాలిథిన్ను బూడిదగా మార్చే బయోడిగ్రేడబుల్ హెర్బల్ ఫార్ములాను తయారుచేసి తొలి విజయకేతనం ఎగరేసింది. నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక ‘నారీశక్తి’ పురస్కారాన్ని అందుకుంది నసీరా. 48 సంవత్సరాల నసీరా అఖ్తర్‌కు మరెన్నో కలలు ఉన్నాయి. ఇప్పుడు వాటివైపు వడివడిగా అడుగులు వేస్తోంది. చదవండి: Pihu Mondal: నరకపు నీడ నుంచి వెలుగుల వైపు -
ఉగ్రవాదులు మరో ఘాతుకం.. కుల్గామ్‌లో బ్యాంకు మేనేజర్ హత్య
-
ఉగ్రవాదుల దుశ్చర్య.. కాల్పుల్లో ప్రభుత్వ టీచర్ మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో మైనార్టీలను లక్ష్యంగా ఉగ్ర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా కుల్గాం జిల్లాలో ఓ స్కూల్ టీచర్‌ను కాల్చి చంపారు ఉగ్రవాదులు. గోపాల్‌పోరా ప్రాంతంలో ప్రభుత్వ హైస్కూల్ ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ఆలోపే ఆమె కన్నుమూశారు. మృతురాలిని సాంబా ప్రాంతానికి చెందిన రజ్ని బాలా(36)గా పోలీసులు ప్రకటించారు. ఆమె కశ్మీరీ పండిట్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై స్పందించిన పోలీసులు.. ఉగ్రవాదుల్ని వీలైనంత త్వరగా ఏరివేస్తామని తెలిపారు. నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా ఈ దాడిని ఖండించారు. మూడు వారాల కిందట.. కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ అనే ప్రభుత్వ ఉద్యోగిని కార్యాలయంలోనే ఉగ్రవాదులు బుద్గంలో కాల్చి చంపిన విషయం తెలిసిందే. అదే విధంగా వారం కిందట.. టీవీ నటి అమ్రీన్ భట్‌ను సైతం ఉగ్రవాదులు కిరాతకంగా కాల్చి చంపారు. ఇదిలా ఉంటే.. ఈ నెలలో ఉగ్రదాడుల్లో ఇది ఏడో మరణం. ముగ్గురు పోలీస్ సిబ్బందికాగా, నలుగురు పౌరులు మరణించారు. కశ్మీరీ పండిట్లను వెనక్కి రప్పించి మరీ.. ప్రాణాలను బలిగొంటోందని కేంద్ర ప్రభుత్వంపై కశ్మీరీ పండిట్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు వాళ్ల భద్రత విషయంలో కశ్మీరీ పార్టీలన్నీ ఒకేతాటిపై వచ్చి కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. -
జమ్మూకశ్మీర్: కుల్గాంలో ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఆదివారం సాయంత్రం మరో ఇద్దరు స్థానికేతరులను కాల్చిచంపారు. ముష్కరుల కాల్పుల్లో ఒక కార్మికుడు గాయపడ్డాడు. ఇది గత 24 గంటల వ్యవధిలో స్థానికేతరులపై జరిగిన మూడో దాడి కావడం గమనార్హం. బిహార్ నుంచి వచ్చిన ఇద్దరు కార్మికులను పొట్టనపెట్టుకున్నారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది ముష్కరుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వరుసగా జరుగుతున్న ముష్కరుల దాడులతో పోలీసు ఉన్నతాధికారుల అప్రమత్తమయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులను తక్షణమే సమీపంలోని సెక్యూరిటీ క్యాంపులకు తరలించాలంటూ ఆదేశాలిచ్చారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో ఈ నెలలో ఇప్పటిదాకా 11 మంది బలయ్యారు. ఉగ్రవాదుల దుశ్చర్యలపై నిరసన జ్వాలలు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు భద్రతా సిబ్బందితోపాటు సామాన్య ప్రజలపై దాడులు చేస్తూ, వారి ప్రాణాలను బలి తీసుకుంటుండడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదుల దుశ్చర్యలను ఖండిస్తూ ఆదివారం పలు ప్రజా సంఘాలు రాష్ట్రంలో వేర్వేరు చోట్ల నిరసన ప్రదర్శన చేపట్టాయి. జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రవాద శక్తులకు పాక్ సర్కారు మద్దతునిస్తోందని ధ్వజమెత్తారు. పాక్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. పాక్ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇటీవల ముష్కరుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బందికి ప్రజలు నివాళులర్పించారు. శివసేన డోంగ్రా ఫ్రంట్, ఆల్ జమ్మూకశ్మీర్ పంచాయత్ కాన్ఫరెన్స్, రాష్ట్రీయ భజరంగ్ దళ్, జమ్మూ వెస్టు అసెంబ్లీ మూమెంట్, రాజ్‌పుత్ కర్ణీ సేన, భారతీయ జనతా యువమోర్చా నిరసనల్లో పాల్గొన్నాయి. ఉగ్రవాదులను ఏరిపారేస్తాం: లెఫ్టినెంట్ గవర్నర్ ప్రతి రక్తం బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రతిన బూనారు. ఆదివారం రేడియో కార్యక్రమం ‘ఆవామ్ కీ ఆవాజ్’లో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సాధారణ ప్రజలను, స్థానికేతరులను ఉగ్రవాదులు కాల్చి చంపుతుండడంపై ఘాటుగా స్పందించారు. ఉగ్రవాదులను, వారి సానుభూతిపరులను వేటాడుతామని హెచ్చరించారు. -
బీజేపీ సర్పంచ్‌ను కాల్చి చంపారు
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఓ బీజేపీ నేతపై ఉగ్రమూకలు కాల్పులు జరపగా నేడు మరో బీజేపీ సర్పంచ్‌ను పొట్టన పెట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే కుల్గాం జిల్లాలోని వెస్సు ప్రాంతానికి చెందిన సర్పంచ్ సాజద్ అహ్మద్ ఖాండేపై ఆయన ఇంటికి సమీపంలోనే ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్రగాయాలతో నెత్తురోడుతున్న అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. (బీజేపీ నేత కుటుంబంపై ముష్కరుల కాల్పులు) బుల్లెట్ గాయాలతో ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా కుల్గాం ప్రాంతానికి చెందిన మరో సర్పంచ్ ఆరిఫ్ అహ్మద్ షాపై సైతం బుధవారం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అతడిని ఖజిగండ్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. రెండు రోజుల్లోనే ఇద్దరు సర్పంచ్‌లపై దాడి జరగడం ఆందోళన కలిగించే విషయం. మరోవైపు జూలైలోనూ బీజేపీ నేత వసీం అహ్మద్ బరిని, అతడి సోదరుడిని ఉగ్రమూకలు కాల్చి చంపిన విషయం తెలిసిందే. (కశ్మీర్లో కలకలం.. బీజేపీ కార్యకర్త కిడ్నాప్) -
కానిస్టేబుల్‌ను చంపేసిన ఉగ్రవాదులు ఖతం!
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఆదివారం ఉదయం భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఉగ్రవాద మూకనే ఓ జమ్మూకశ్మీర్ కానిస్టేబుల్‌ను ట్రాప్ చేసి హతమర్చారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు రంగంలోకి దిగిన భద్రతా దళాలు ఆదివారం ఉదయం కుల్గామ్ జిల్లాలోని ఖుద్వానీ గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ గాలింపుల్లో ఉగ్రవాదులు ఎదురుపడటంతో వారికి, భద్రతా దళాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు హతమయ్యారు. ఇంకా ఆ ప్రాంతంలో భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగుతోంది. కానిస్టేబుల్ మహమ్మద్ సలీంను ట్రాప్ చేసి.. చితహింసలు పెట్టి హతమార్చిన ఉగ్రవాదులను ఎరివేసే ఆపరేషన్ కొనసాగుతోందని, జమ్మూకశ్మీర్ పోలీసులు, ఆర్మీ, భద్రతా దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారని రాష్ట్ర డీజీపీ ఎస్పీ వైద్ ట్విటర్లో తెలిపారు. -
ఆమె వీడియోతో బెదిరించి పలుమార్లు దారుణం!
సాక్షి, శ్రీనగర్: తనకు జరిగినట్లుగా మరో బాలికకుగానీ, మహిళలకు గానీ జరగకూడదని ఓ మైనర్ కన్నీటి పర్యంతమయ్యారు. తనను ఎన్నో రకాలుగా చిత్ర హింసలకు గురి చేశారని పోలీసులకు ఆమె వివరించారు. వివరాల్లోకెళితే.. కుల్గాం పోలీసులు కిడ్నాపర్ల చెర నుంచి గత నెలలో ఓ మైనర్ బాలికను రక్షించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. పోలీసులతో పాటు మహిళలు, బాలికల కిడ్నాప్, వేధింపుల కేసును సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు జనవరి 21న తనను కిడ్నాప్ చేశారని బాధిత మైనర్ బాలిక తెలిపింది. ఆపై ఆ కీచకులు తనకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని వాపోయింది. రేప్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ తనపై కీచకపర్వం కొనసాగించారని ఏడ్చేసింది. దేవుడి దయ వల్ల పోలీసులు నన్ను రక్షించారు. ఇలాంటి గతి ఎవరికీ పట్టకూడదని, బాలికలు, మహిళలు ఎవరికీ ఇలాంటి భయానక పరిస్థితి రావొద్దని కోరుకుంటున్నట్లు వివరించింది. ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించి మహిళలకు రక్షణ కల్పించాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది. -
కుల్గామ్‌లో ఎన్కౌంటర్
సాక్షి, శ్రీనగర్ : ఉగ్రమూకలకు, భద్రతాబలగాలకు మధ్య సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. కుడ్వాని ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన బలగాలు తనిఖీలు చేపట్టాయి. అదే సమయంలో రెచ్చిపోయిన ఉగ్రమూక సైనికులపై కాల్పులకు తెగబడింది. అప్రమత్తమైన భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో హిజ్బుల్ మొజాహిదీన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. సంఘటనా స్థలం నుంచి ఓ ఏకే 47, ఇన్సాస్ రైఫిల్‌లను స్వాధీనం చేసుకున్నారు. -
లష్కరే కమాండర్ మట్టూ హతం
- అతని అనుచరుడు ముజామిల్ కూడా.. - సజీవంగా చిక్కిన మరో ఉగ్రవాది శ్రీనగర్: కశ్మీర్లో మరో అగ్ర మిలిటెంట్‌ను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. అనంత్‌నాగ్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ జునైద్ మట్టూతో పాటు అతని సహచరుడు ముజామిల్ హతమయ్యాడు. బిజిబిహారా సమీపంలోని ఆర్వాని గ్రామంలోని ఓ ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ చేపట్టిన ఈ ఆపరేషన్‌లో మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. సంఘటనా స్థలం వద్ద తమపై రాళ్లు రువ్విన ప్రజలపై భద్రతా దళాలు కాల్పులు జరపడంతో ఇద్దరు చనిపోయారు. ఉగ్రవాదులు దాగి ఉన్న ఇంటిని భద్రతా దళాలు ఉదయం 8 గంటలకే చుట్టుముట్టాయి. 10 గంటలకు వారి నుంచి కాల్పులు మొదలవడంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో 8 గంటల పాటు ముగ్గురు ఉగ్రవాదులు ఇంటిలోనే చిక్కుకుపోయారు. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని స్థానికులు రాళ్లు రువ్వడం తమకు ప్రతిబంధకంగా మారిందని పోలీసులు తెలిపారు. రూ. 10 లక్షల రివార్డు రెండేళ్లుగా ఉగ్ర కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్న మట్టూ తలపై పోలీసులు రూ. 10 లక్షలు ప్రకటించారు. 18 ఏళ్ల వయసులో మిలిటెన్సీలో చేరిన మట్టూ, కశ్మీర్లో మోస్ట్ వాంటెడ్ 12 మంది ఉగ్రవాదుల జాబితాలో ఒకడు. గతేడాది పోలీసు వాహనంపై దాడిచేసి ముగ్గురిని హతమార్చిన దాడిలో అతడి పాత్ర ఉంది. గురువారం కుల్గాం జిల్లాలో ఓ పోలీసు అధికారి హత్యలో మట్టూ ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. గతేడాది బుర్హాన్ వనీ తరువాత లోయలో చనిపోయిన మూడో టాప్ మిలిటెంట్ మట్టూనే. ఇద్దరు పౌరుల మృతి ఉగ్రవాదులను మట్టుపెట్టే ఆపరేషన్‌లో భద్రతా దళాలు నిమగ్నమై ఉన్నపుడు స్థానికులు వారితో ఘర్షణకు దిగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ క్రమంలో అల్లరిమూకలను చెదరగొట్టడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోగా, 10 మంది గాయపడ్డారు. పాక్ కాల్పుల్లో జవాన్ మృతి రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట శుక్రవారం పాక్ సైన్యం కాల్పులు జరపడంతో భారత సైనికుడు మృతిచెందాడు. భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది. పాక్ కాల్పుల్లో గాయపడిన జవాన్ నాయక్(34) భక్తావర్ సింగ్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. నాయక్ సొంతూరు పంజాబ్ హోషిరాపూర్ జిల్లాలోని హజీపూర్. ఉగ్ర దాడిలో ఆరుగురు పోలీసుల మృతి శ్రీనగర్: కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో శుక్రవారం పోలీసుల వాహనంపై ఉగ్రవాదులు మెరుపు దాడికి పాల్పడటంతో ఆరుగురు పోలీసులు చనిపోయారు. పోలీసులు అనంతనాగ్‌లో విధులు ముగించుకుని అచాబల్ తిరిగి వెళ్తుండగా కుల్గాడ్ గ్రామంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తర్వాత మృతుల ముఖాలను ఛిద్రం చేసి, పోలీసుల ఆయుధాలను తీసుకుని పారిపోయారు. ఈ దాడికి పాక్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే బాధ్యత ప్రకటించుకుందని అధికారులు తెలిపారు. తమ కమాండర్ జునైద్ మట్టూని హతమార్చినందుకు ప్రతీకారంగానే లష్కరే ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతం, మట్టూ హతమైన ఎన్కౌంటర్ జరిగిన చోటుకు 20 కి.మీ. దూరంలో ఉంది. -
ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రదాడి
- జమ్ముకశ్మీర్‌లోని కృష్ణఘాటి సెక్టార్లో ఘటన శ్రీనగర్: కల్లోల కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భారత సైన్యాన్ని టార్గెట్ చేసుకుని దాడికి పాల్పడ్డారు. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిలోని కుల్గామ్ సమీపంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారని, మనవాళ్లు కూడా ముష్కరులపైకి ఎదురుకాల్పులు జరిపారని ఆర్మీ అధికారులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని, దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియజేస్తామని అధికారులు చెప్పారు. తాజా సమాచారం ప్రకారం ఉగ్రదాడిలో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. పేట్రేగిన పాక్: ఉగ్రదాడి జరగడానికి కొద్ది నిమిషాల ముందు కృష్ణఘటి సెక్టార్‌లోని సరిహద్దు వెంబడి పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. అప్రమత్తమైన భారత బలగాలు.. పాక్‌కు గట్టి జవాబిచ్చాయని అధికారులు చెప్పారు. -
కశ్మీర్లో మళ్లీ విరుచుకుపడ్డ ఉగ్రవాదులు
ఉడి దాడి ఘటనతో 18మంది జవాన్లను బలిగొన్న ఉగ్రవాదులు సోమవారం దక్షిణ కశ్మీర్లో మళ్లీ విరుచుకుపడ్డారు. సెంట్రల్ సెక్యురిటీ ఫోర్స్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి ఘటనలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయాల పాలయ్యారు. దక్షిణ శ్రీనగర్‌లోని 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుల్గామ్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్(సీఆర్పీఎఫ్) ప్రారంభించే రోడ్డు ఓపెనింగ్ పార్టీలో అనుమానిత మిలిటెంట్లు గ్రనేడ్‌తో దాడికి పాల్పడారని పోలీసులు పేర్కొన్నారు. ఈ గ్రెనేడ్ టార్గెట్ కోల్పోయి, రోడ్డు పక్కకు పేలిందని చెప్పారు. ఈ ఘటనలో ఐదుగురు సీఆరీపీఎఫ్ జవాన్లు గాయాలు పాలయ్యారని, వారిని ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు వివరించారు. కశ్మీర్లో నెలకొన్న అల్లర్లకు కుల్గామ్ ప్రాంతం ఎక్కువగా ప్రభావితమైంది. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హన్ వనీ ఎనౌకౌంటర్ అనంతరం కశ్మీర్ లోయలో ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ అల్లర్లతో మరణించిన 90మందిలో ఎక్కువగా కుల్గామ్ ప్రాంతానికి చెందిన వారే. -
ఆయుధాల చోరీ చేసి ఉగ్రవాదుల పరారీ
శ్రీనగర్: జమ్ముకాశ్మీర్ లో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. ఆయుధాలతో సహా పరారైన ఘటన కుల్గామ్ జిల్లాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. అధికారుల సమాచారం మేరకు... గుర్తుతెలియని కొందరు ఉగ్రవాదులు కుల్గామ్ జిల్లా అడిజన్ ప్రాంతంలో పోలీస్ స్టేషన్లో చొరబడ్డారు. పోలీసుల వద్ద ఉన్న 4 రైఫిళ్లను చోరీ చేసినట్లు తెలిపారు. రెండు ఎస్ఎల్ఆర్ లు, రెండు ఇన్ సాస్ రైఫిల్స్ ఉన్నట్లు వివరించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.