కీచకుల చెర నుంచి బయటపడ్డ బాధితురాలు
సాక్షి, శ్రీనగర్: తనకు జరిగినట్లుగా మరో బాలికకుగానీ, మహిళలకు గానీ జరగకూడదని ఓ మైనర్ కన్నీటి పర్యంతమయ్యారు. తనను ఎన్నో రకాలుగా చిత్ర హింసలకు గురి చేశారని పోలీసులకు ఆమె వివరించారు. వివరాల్లోకెళితే.. కుల్గాం పోలీసులు కిడ్నాపర్ల చెర నుంచి గత నెలలో ఓ మైనర్ బాలికను రక్షించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. పోలీసులతో పాటు మహిళలు, బాలికల కిడ్నాప్, వేధింపుల కేసును సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
కొందరు గుర్తుతెలియని వ్యక్తులు జనవరి 21న తనను కిడ్నాప్ చేశారని బాధిత మైనర్ బాలిక తెలిపింది. ఆపై ఆ కీచకులు తనకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి, పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని వాపోయింది. రేప్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ తనపై కీచకపర్వం కొనసాగించారని ఏడ్చేసింది. దేవుడి దయ వల్ల పోలీసులు నన్ను రక్షించారు. ఇలాంటి గతి ఎవరికీ పట్టకూడదని, బాలికలు, మహిళలు ఎవరికీ ఇలాంటి భయానక పరిస్థితి రావొద్దని కోరుకుంటున్నట్లు వివరించింది. ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించి మహిళలకు రక్షణ కల్పించాలని బాధితురాలు విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment