
అనకాపల్లి: మైనర్ బాలిక(14)పై అత్యాచారం చేసి, గర్భవతిని చేసిన ఇంటర్ విద్యార్థిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌ఐ తేజేశ్వరరావు బుధవారం తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలు. వి.మాడుగుల మండలం కింతలివల్లాపురం గ్రామానికి చెందిన కుటుంబం పనుల నిమిత్తం అనకాపల్లి మండలం ఊడేరు గ్రామానికి వలస వచ్చారు.
అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థి బాలికపై అత్యాచారం చేశాడు. ప్రస్తుతం 5వ నెల గర్భవతి. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తేజేశ్వరరావు తెలిపారు.