Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Chandrababu Naidu Govt Neglected Womens with Aadabidda Nidhi1
ఆడబిడ్డ నిధిని ఇవ్వాలంటే.. ఆంధ్రాను అమ్మాలి

ఎన్నికలకు ముందు చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వచ్చాక మహా శక్తి కింద ఐదు కార్యక్రమాలు అమలు చేస్తాం. 19 నుంచి 59 ఏళ్ల మధ్య మహిళలందరికీ.. ఒక్కొక్కరికీ నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు.. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అందరికీ అందజేస్తాం. – 2024 మార్చి 13న టీడీపీ ‘కలలకు రెక్కలు’ నినాదంతో వెబ్‌ పోర్టల్‌లో పేర్లు నమోదు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా చంద్రబాబుఏరుదాటాక.. అచ్చెన్న ఆడవాళ్లకు నెలకు రూ.1,500 హామీని అమలు చేయాలంటే, ఆంధ్రానే అమ్మాలి. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి? పథకం ఎలా అమలు చేయాలి? అని ఆలోచన చేస్తూ చంద్రబాబు ముందుకెళ్తున్నారు. – విజయనగరం జిల్లా సభలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు‘ఇచ్చిన ప్రతి హామీకి క్యాలిక్యు­లేషన్‌ చేసి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్నాం. ఎలా అమలు చేయాలో తెలుసుకు­న్నాకే హామీ ఇచ్చాం. సూపర్‌ సిక్స్‌ వెరీ క్లియర్‌. ఇది మా ఎష్యూరెన్స్‌. పూర్తి చేస్తామని చెబుతున్నా. కెమేరాలు ఉన్నాయి. రికార్డు చేసుకోండి. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం. చేయకపోతే ప్రజలకు కాలర్‌ పట్టుకుని నిలదీసే హక్కు కూడా ఉంటుంది. –2023 డిసెంబరులో ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో నారా లోకేశ్‌‘వైఎస్సార్‌సీపీ నాయకులు అడుగుతున్నారు హామీలు ఎలా నిలబెట్టుకుంటారని...? అలాంటి వారందరికీ మీ లోకేశ్‌ ఒకటే సమాధానం ఇస్తున్నాడు. జగన్‌ అప్పుల అప్పారావు అయితే, మా చంద్రన్న సంపద సృష్టికర్త. మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు తెలిసి మా చంద్రన్న మహాశక్తి ప్రకటించారు. దాంట్లో ప్రధానంగా నాలుగు ప్రకటనలు ఉన్నాయి. మొదటిది ఆడబిడ్డ నిధి. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1,500 వాళ్ల ఖాతాలో వేస్తున్నాం. సంవత్సరానికి రూ.18 వేలు. ఐదేళ్లు రూ.90 వేలను తెలుగింటి ఆడపచుల అకౌంట్లలో మన చంద్రన్న వేయబోతున్నాడు’ –2023లో ఓ బహిరంగ సభలో నారా లోకేశ్‌‘రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ... రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా రూపొందించిన మేనిఫెస్టోను పక్కాగా అమలు చేస్తాం’–ప్రజాగళం పేరుతో 2024 ఏప్రిల్‌ 30న చంద్రబాబుతో కలిసి ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా అందులో పేర్కొన్న హామీల అమలుపై పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు.‘చంద్రబాబు–పవన్‌కళ్యాణ్‌ ఉమ్మడిగా ప్రకటించిన మేనిఫెస్టోలో ‘ప్రతి మహిళకు నెలకు రూ.1500’ (19 నుంచి 59 సంవత్సరాల వరకు) అని పేర్కొన్నారు. కానీ, ఎన్నికలకు ఏడాది, ఏడాదిన్నర ముందు నుంచే... మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ‘19–59 సంవత్సరాల వరకు’ అన్నది కూడా లేకుండా, భవిష్యత్‌కు గ్యారెంటీ–బాబు ష్యూరిటీ నినాదంతో ‘ఆడబిడ్డ నిధి’ నుంచి ‘18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500’ అంటూ ప్రత్యేక కరపత్రాలను రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు ఇంటింటికీ పంచుతూ ప్రచారం చేశారు’.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలందరికీ ప్రతి నెలా రూ.1,500 చొప్పున ఏటా రూ.18 వేలు ‘ఆడబిడ్డ నిధి’ ఇస్తామని ఇంటింటా బాండ్లు పంపిణీ చేసి.. తీరా గద్దెనెక్కాక చంద్రబాబు, కూటమి నేతలు మాట తప్పారు. సూపర్‌ సిక్స్‌ కింద మేనిఫెస్టోలో కూడా చేర్చి ఆ హామీ అమలు చేయకుండా మోసం చేశారు. తొలి ఏడాది రూ.32,400 కోట్లు ఎగ్గొట్టి అక్కచెల్లెమ్మలకు వెన్నుపోటు పొడిచారు. ఈ ఏడాదైనా ఇస్తారని ఆశగా ఎదురు చూస్తుంటే ‘ఆంధ్రాను అమ్మితే తప్ప ఇవ్వలేం’ అని చేతులెత్తేశారు. ప్రభుత్వ మోసం కారణంగా ఒక్క ఆడబిడ్డ నిధి పథకం కింద రాష్ట్రంలో మహిళలు గడిచిన 13 నెలల్లో ఏకంగా రూ.35,100 కోట్లు కోల్పోయారు. అధికారమే పరమావధిగా హామీల వర్షం కురిపించి.. ప్రజలను నమ్మించి.. గద్దెనెక్కాక వారిని నిలువునా మోసం చేయడంలో తనను మించిన వారు లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు చాటుకున్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే చంద్రబాబు, లోకేశ్‌ సహా టీడీపీకి చెందిన చిన్న, పెద్ద నాయకుల వరకు ప్రజల ఇళ్లకు వెళ్లి తమ ప్రభుత్వం వస్తే ఆడబిడ్డ నిధి కింద చంద్రబాబు ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఇచ్చేలా పథకం అమలు చేస్తారని ఊదరగొట్టారు. ‘గ్యారంటీ’ కార్డులను కూడా పంపిణీ చేశారు. తీరా 13 నెలల పాటు పథకం కింద డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి.. ఇప్పుడేమో ఈ పథకాన్ని అమలు చేస్తే రాష్ట్రాన్నే అమ్మాల్సి ఉంటుందంటూ ప్రభుత్వంలోని కీలక మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడం కూటమి మోసాలకు పరాకాష్టగా నిలిచింది. ఎగవేతపై 2 నెలల కిందటే బాబు సంకేతాలు⇒ ఆడ బిడ్డ నిధి హామీ అమలుపై సీఎం చంద్రబాబు పూర్తిగా చేతులేత్తేసినట్టే కనిపిస్తోంది. వాస్తవానికి రెండు నెలల కిందటే కర్నూలు బహిరంగ సభలో ఆయన ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. ఆయన మాట్లాడిన తీరే ఇందుకు నిదర్శనమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం–ప్రైవేట్‌ భాగస్వామ్యంతో పి–4 కార్యక్రమం ద్వారా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేస్తానని, అప్పటికీ పేదలు మిగిలితే అడ్డబిడ్డ నిధి కింద ఇచ్చే డబ్బులు పి–4కు అనుసంధానం చేసి మహిళల ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచిస్తానంటూ కర్నూలులో చంద్రబాబు వ్యాఖ్యానించారు.⇒ అంటే 2029 వరకు ఈ పథకం అమలు ఉండదని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలతో దీనికి మరింత బలం చేకూరుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వాస్తవానికి... ఎన్నికల్లో ఎలాగైనా గెలవడం అనే ఉద్దేశం తప్ప... ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వ పెద్దలకు చిత్తశుద్ధి లేదని వివరిస్తున్నారు. ఇందులోభాగంగానే హామీల అమలు నుంచి తప్పించుకునేందుకు సాకులు మీద సాకులు వెదుక్కుంటున్నారని చెబుతున్నారు.మహిళలు నష్టపోయిన మొత్తం రూ.35,100 కోట్లు⇒ ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అంటే వీరంతా 18 ఏళ్లు దాటినవారే. ఈ నేపథ్యంలో... టీడీపీ కూటమి ఎన్నికలకు ముందు చెప్పిన హామీ ప్రకారం మొత్తం 2.10 కోట్ల మందికి ప్రభుత్వం ప్రతి నెల రూ.1500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన దాదాపు 30 లక్షల మంది పెన్షనర్లను తీసేసినా రాష్ట్రంలో సుమారు 1.80 కోట్ల మంది ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులయ్యే అవకాశం ఉంది. వారికి ఏడాదికి రూ.18 వేలు చొప్పున 13 నెలల కాలంలో మొత్తం రూ.35,100 కోట్లు ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.⇒ ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున అందజేస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ ఎప్పటినుంచి అమలవుతుందా? అని రాష్ట్రవ్యాప్తంగా మహిళలు 13 నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. ఒక్కొక్క నెల ఆలస్యం అయ్యేకొద్దీ వారు కోల్పోతున్న మొత్తం పెరుగుతోంది. ఇలా గత 13 నెలల్లో రాష్ట్రంలోని పేద మహిళలందరూ నెలకు ఏకంగా రూ.2,700 కోట్ల చొప్పున ఇప్పటికి రూ.35,100 కోట్ల లబ్ధిని కోల్పోయారు.ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చిన వైఎస్‌ జగన్‌కోవిడ్‌ వంటి మహమ్మారులు ఎదురైనా వెనక్కుతగ్గని వైనంమేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్‌ అంత పవిత్రంగా భావించిన వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారంటే.. కచ్చితంగా అమలు చేస్తామని నిరూపించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్‌ వంటి మహమ్మారులు, అనుకోని విపత్తులు వచ్చినా అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ ఏమాత్రం వెనక్కుతగ్గలేదు.2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలును అపలేదు. కాగా, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేసిన నవరత్న పథకాలను చూపిస్తూ.. ‘రాష్ట్రం మరో శ్రీలంకలా తయారవుతుందోంటూ నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ దుష్ప్రచారం చేసింది. తీరా సరిగ్గా ఎన్నికల సమయానికి ప్రజలను ప్రలోభపెట్టేందుకు చంద్రబాబు కూటమి హామీల వరద పారించింది. అధికారం దక్కాక మాత్రం వాటిని ఒక్కోటిగా పక్కనపెడుతోంది.కుర్చీలో కూర్చున్నాకే తెలిసిందా..! కూటమి ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలను నట్టేట ముంచారు. ఆడబిడ్డ నిధి, బీసీ మహిళలకు 50 ఏళ్ల మహిళలకే పెన్షన్‌ ఇస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాలేదని, రాష్ట్రాన్ని అమ్మేయాలంటూ మంత్రులతో చెప్పిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో కుర్చీలో కూర్చున్నాకే తెలిసిందా? – బూడి ముత్యాలనాయుడు, మాజీ డిప్యూటీ సీఎం ఇది మంచి ప్రభుత్వమా? ఎన్నికల ముందేమో సంపద సృష్టిస్తాం–సంక్షేమ పథకాలు అమలు చేస్తాం అని ఓట్లు వేయించుకుని.. గద్దెనెక్కిన తర్వాత అమలు చేయలేమని వ్యాఖ్యలు చేయడం మీకు తగునా అచ్చెన్నాయుడు? ఇది మంచి ప్రభుత్వమా చంద్రబాబూ? – పాముల పుష్ప శ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎం ముందుగా తెలియదా? కూటమి పార్టీలు అబద్ధపు హామీలు ఇచ్చాయని మరోమారు తేటతెల్లమైంది. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి హామీలు అమలు చేయగలమా లేదా అనేది ముందుగా తెలియదా? చేయలేమని తెలిసీ ఎందుకు హామీలు ఇచ్చారు? – ధర్మాన కృష్ణదాస్, మాజీ డిప్యూటీ సీఎంమహిళలను నిలువునా మోసం చేశారు.. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మేయాలనడం మహిళలను ఈ ప్రభుత్వం ఏ రకంగా మోసం చేసేందుకు కుట్రలు పన్నుతుందో తెలుస్తోంది. మొదటి ఏడాది ఎగ్గొట్టినా రెండో ఏడాది నుంచి అయినా ఇస్తారని చూస్తున్న మహిళల నోట్లో కూటమి మన్ను కొట్టింది. అధికార దాహంతో హామీలు గుప్పించారు. అమలు చేయలేక చేతకాని మాటలు మాట్లాడటం మహిళలను నిట్టనిలువునా మోసం చేయడమే. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌అబద్ధపు హామీలిచ్చారా? చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఎన్నికల ముందు కళ్లు మూసుకుపోయిన అబద్ధపు హామీలు ఇచ్చారా? మీ మాటలు నమ్మి ఆడబిడ్డలు ఓట్లు వేశారు. వారిని మోసం చేసేందుకు చంద్రబాబే అచ్చెన్నాయుడు చేత ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారు. రాష్ట్రాన్ని అమ్మేస్తే కాని తీర్చలేని హామీలు మీకు ఎవరు ఇమ్మన్నారు? – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్‌సంపద సృష్టిస్తానని చేతులెత్తేశారు! ఒక్క హామీని అమలు చేయకుండా సుపరిపాలనకు చీతొలి అడుగుచీ అంటూ టీడీపీ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. చంద్రబాబు ఏమో సంపద సృష్టిస్తా.. పథకాలు అమలు చేస్తా అన్నారు. ఇప్పుడేమో మంత్రి అచ్చెన్నాయడు చీఆడబిడ్డ నిధిచీ అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలంటున్నారు. పథకాలు అమలు చేయలేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారు? – విడదల రజిని, మాజీ మంత్రి అడ్డమైన హామీలు ఇచ్చి మోసం చేస్తారా? సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలా? అలా మాట్లాడడానికి సిగ్గులేదా అచ్చెన్నాయుడు? ఎన్నికల ముందు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా? అప్పుడేమో ఓట్లు కోసం అడ్డమైన హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఇలా మాట్లాడమని మీ నాయకుడు చంద్రబాబు చెప్పారా? – ఆర్కే రోజా, మాజీ మంత్రి చంద్రబాబు వైఖరేంటో తేటతెల్లమైంది ఆడబిడ్డ నిధిని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సిందే అని అచ్చెన్నాయుడు అనడం దారుణం. ఈ విషయం ఎన్నికలప్పుడు చంద్రబాబుకు తెలియదా? అమలు చేయలేని హామీలివ్వడం అంటే ప్రజలను మోసం చేయటమే కాదా? హామీలు అమలు చేయటంలో చేతులెత్తేసి మంత్రులతో ఇలా నిస్సిగ్గుగా మాట్లాడించడంతో చంద్రబాబు వైఖరేంటో తేటతెల్లమైంది. – మేరుగు నాగార్జున, మాజీ మంత్రి ప్రజల పక్షాన పోరాటం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మోసానికి నిఘంటువులో కొత్త పదం వెతకాలి. ఆడబిడ్డ నిధి అమలుకు రాష్ట్రాన్ని అమ్మాల్సిందేనని మంత్రి మాట్లాడటం మహిళలను అవమానపరచడమే. వాగ్దానాలు ఇచ్చినప్పుడు తెలియదా? ముఖ్యమంత్రి సంతకానికి ఉన్న విలువ ఇదేనా? కూటమి ప్రభుత్వ హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. – డాక్టర్‌ ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు ప్రజలకు మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల ఆశలపై వెన్నుపోటు పొడిచారు. అచ్చెన్నాయుడు నోట మాట వచ్చిందంటే అది చంద్రబాబు మాటే. సంపద సృష్టించి ప్రజలకు పంచి పెడతామంటూ వివిధ నూతన విధానాల పేరుతో ప్రజల నడ్డివిరుస్తున్నారు. కూటమి దగాకోరు మాటలను ప్రజలందరూ గమనిస్తున్నారు. – డాక్టర్‌ సాకే శైలజానాథ్, మాజీ మంత్రిఅచ్చెన్నాయుడూ.. సిగ్గుండాలి రాష్ట్రాన్ని ఇప్పటికే అమ్మేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కొత్తగా ఏదో ఆడబిడ్డ నిధి కోసం రాష్ట్రాన్ని అమ్మాలని వ్యాఖ్యలు చేయడానికి అచ్చెన్నాయుడుకి సిగ్గుండాలి. ఏరు దాటాక తెడ్డు తగలేసే వైఖరి కూటమిది. ఆడబిడ్డలకు ఇస్తానన్న పథకాలను అమలు చేయకపోగా సిగ్గూఎగ్గూ లేకుండా రాష్ట్రాన్ని అమ్మాలని అనటం సబబు కాదు. మహిళలను వంచిస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. – అంబటి రాంబాబు, మాజీ మంత్రి హామీలు ఎందుకిచ్చారు? ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలనడం దుర్మార్గం. కూటమి ప్రభుత్వం మహిళలను దారుణంగా మోసం చేస్తోంది. ఆడబిడ్డలకు ఈ ప్రభుత్వ అబద్ధపు హామీలు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. అమలు చేయలేని హామీలు ఎందుకు ఇచ్చారో కూటమి నేతలు చెప్పాలి. – డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి నమ్మించి.. నయ వంచన.. ‘ఆడబిడ్డల కష్టాలు కళ్లారా చూశాను. ఆ కష్టాల నుంచి బయట పడేయడానికి ఆడబిడ్డ నిధి పథకం తీసుకువచ్చాం’ అని ఎన్నికల ముందు ప్రతి సభలో చంద్రబాబు ప్రచారం చేశారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ప్రతి నెలా రూ.1,500లు చొప్పున ఏడాదికి రూ.18000 ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక నయవంచన చేశారు. – వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ ప్రజలను దగా చేసింది.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో టీడీపీ వైఖరి మరోసారి తేటతెల్లమైంది. ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలనడం సిగ్గు చేటు. అలవికాని హామీలిచ్చి టీడీపీ ప్రజలను నిలువుగా దగా చేసింది. ఓటు వేసినందుకు ప్రజలు టీడీపీని అసహ్యించుకుంటున్నారు. త్వరలోనే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు. – పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పథకాలకు ఎగనామం పెట్టేందుకే .. ఆడబిడ్డ నిధి సంక్షేమ పథకం అమలు చేయాలంటే ఏపీనే తాకట్టు పెట్టాలని టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు అనడం ఆశ్చర్యకరంగా ఉంది. సంక్షేమ పథకాల హామీలకు ఎగనామం పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. సూపర్‌ సిక్స్‌తో పాటు 143 హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారు. – కేకే రాజు, వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడుప్రభుత్వ మెడలు వంచుతాం అలవిగాని హామీలతో చంద్రబాబు గద్దెనెక్కారు. ఏడాదిలోనే రూ.1,87,000 కోట్ల అప్పులు చేశారు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వ నిజస్వరూపం బయటపడింది. చంద్రబాబు జీవితమంతా మోసపూరితం, కుట్రలే. ప్రభుత్వం మెడలు వంచైనా పథకాలు అమలు చేయించేలా పోరాటం చేస్తాం. – అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు ప్రజలు ప్రభుత్వ భరతం పడతారుఆడబిడ్డ నిధిపై మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. హామీల అమలుకు ఎంత ఖర్చవుతుందనే కనీస పరిజ్ఞానం కూడా కూటమి ప్రభుత్వానికి లేదు. రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని అమ్మినా చంద్రబాబు ఇచ్చిన హమీలు అమలు చేయలేరు. బాబు ష్యూరీటీ, మోసం గ్యారెంటీ అని తేలి­పోయింది. ప్రజలంతా ఈ ప్రభుత్వ భరతం పట్టడం ఖాయం. – ఎస్‌వీ మోహన్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాటపై నిలబడే ప్రభుత్వం కాదిది కూటమిది మాటపై నిలబడే ప్రభుత్వం కాదని తెలిసిపోయింది. మేనిఫెస్టోను అమలు చేయలేమని వారికి కూడా తెలుసు. అయినా ఎన్నికల్లో నీకు రూ.18వేలు, నీకు రూ.18వేలు అని మహిళందరికీ చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎత్తేసే కార్యక్రమంలో భాగంగానే అచ్చెన్నాయుడితో మాట్లాడించారు. – పి.రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ వైఎస్సార్‌ కడప జిల్లా అధ్యక్షుడు మహిళలను మోసగించే ఎత్తుగడ మహిళలకు రూ.1,500 ఇవ్వడానికి రాష్ట్రాన్ని అమ్మేయాలా? మంత్రి అచ్చెన్నాయుడి మాటలు మహిళలను మోసగించే ఎత్తుగడ అని స్పష్టమవుతుంది. చంద్రబాబు జీవితమంతా ప్రజలను మోసగించడమే. అమలుకాని హామీలు ఇవ్వడం ఆ తరువాత వెన్నుపోటు పొడవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. – ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు రాష్ట్రాన్ని అమ్మేయాలనడం సిగ్గుచేటుఆడబిడ్డ నిధిపై మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు దమననీతికి నిదర్శనం. పథకం అమలుకు రాష్ట్రాన్ని అమ్మేయాలనడం సిగ్గుచేటు. ఆడబిడ్డనిధిని అమలు చేయలేమని చేతులెత్తేయడం కూటమి పాలన దగా కోరుకు నిదర్శనం. – శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

India Slams Pakistan at United Nations2
‘సమితి’లో పాక్‌ బండారం బయటపెట్టిన భారత్‌

న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌ తీరుతెన్నులను భారత్‌ ఎండగట్టింది. భారతదేశం వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పరిణమిస్తుండగా, పాకిస్తాన్ ఒకవైపు మతతత్వం, మరోవైపు ఉగ్రవాదంలో మునిగిపోయి, భారీ రుణగ్రహీతగా మారిందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ పేర్కొన్నారు.ఐక్యరాజ్యసమితిలో ‘అంతర్జాతీయ శాంతి- భద్రతను ప్రోత్సహించడం’ అనే అంశంపై జరిగిన ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, భారతదేశం పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశమని, పురోగతి, శ్రేయస్సు, అభివృద్ధి నమూనాలలో ఎదుగుతున్నదని పేర్కొన్నారు. పొరుగుదేశం ఇందుకు భిన్నంగా ఉన్నదని ఆరోపించారు. భారత్‌ ఐక్యరాజ్యసమితి లక్ష్యంలో భాగస్వామ్యం వహిస్తూ, మరింత శాంతియుత, సంపన్నమైన,ప్రపంచం కోసం సమిష్టిగా కృషి చేయడంలో చురుకుగా, నిర్మాణాత్మకంగా పాల్గొంటున్నదని అన్నారు.భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడుతుండగా, అదే సమయంలో పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికల నుండి రుణాలు తీసుకోవడంలో బిజీగా ఉందని హరీష్ ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజానికి ఆమోదయోగ్యం కాని పద్ధతులకు పాల్పడుతున్నదని ఆయన అన్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడిని గుర్తు చేస్తూ, ఈ ఘటనలో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది అమాయక పౌరులను కాల్చి చంపారని హరీష్‌ పేర్కొన్నారు. అనంతరం భారత్‌ ‘ఆపరేషన్ సిందూర్‌’ను ప్రారంభించి పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను తునాతునకలు చేసిందన్నారు.

News Circulate On Next ścontenders Here List3
ఉప రాష్ట్రపతి రేసు.. శశిథరూర్‌, నితీశ్‌ సహా మరో ముగ్గురు సీనియర్లు?

ఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ అనూహ్యంగా రాజీనామా చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. ధన్‌ఖడ్‌ రాజీనామా నేపథ్యంలో ఇప్పుడు తదుపరి ఉప రాష్ట్రపతి ఎవరు అనే కొత్త చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఎవరిని ఎంపిక చేస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే పలువురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌, మనోజ్‌ సిన్హా, వీకే సక్సేనా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివన్ష్‌ నారాయణ్‌ సింగ్‌ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇదే సమయంలో కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ పేరు కూడా తెరపైకి వచ్చినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయనను బీజేపీలోకి తీసుకుని ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా వ్యవహారం బీజేపీ కుట్రగా బీహార్‌లో ప్రతిపక్ష ఆర్జేడీ ఆరోపించింది. బీహార్‌ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనుండగా బీజేపీ ఈ కుట్రకు తెరతీసిందని ఆర్‌జేడీ నేతలు చెబుతున్నారు. దీని ద్వారా అప్రాధాన్యమైన ఉపరాష్ట్రపతి వంటి పోస్టులో సీఎం నితీశ్‌ కుమార్‌ను కూర్చోబెట్టాలనేదే బీజేపీ అసలు ఉద్దేశమంటున్నారు. నితీశ్‌ కుమార్‌ను తప్పించి, బీహార్‌లో తమ పార్టీ సీఎంను కూర్చోబెట్టాలని బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించింది. వచ్చే ఎన్నికల్లో ఎన్‌డీఏ ఓటమి ఖరారని భావిస్తున్న బీజేపీ హఠాత్తుగా ఈ ఎత్తుగడ వేసిందని విమర్శించింది. అయితే, గతంలో పలుమార్లు నితీశ్‌ ఉపరాష్ట్రపతి పదవి చేపట్టనున్నారంటూ వచ్చిన వార్తలు విధితమే.శశిథరూర్‌కు ఆఫర్‌?ఇటీవలి కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్‌కు క్రమంగా దూరమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే హస్తానికి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరుతున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆపరేషన్‌ సిందూర్‌పై కేంద్రం నియమించిన ఎంపీల కమిటీలో ఒకదానికి శశిథరూర్‌ నేతృత్వం వహించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజా రేసులో శశిథరూర్‌ పేరు తెరపైకి వచ్చింది. ఆయనను పార్టీలోకి తీసుకుని ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.లిస్టులో వారిద్దరూ.. ఉపరాష్ట్రపతి పదవి రేసులో ఢిల్లీ, జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్లలో ఒకరికి అవకాశం ఇవ్వనే ప్రచారం కూడా జరుగుతోంది. జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 6వ తేదీతో ముగియనుంది. బీజేపీ సీనియర్‌ నేత అయిన సిన్హా గతంలో ఆ పార్టీ జాతీయ కౌన్సిల్‌లో సభ్యుడిగా వ్యవహరించారు. మోదీ తొలి కేబినెట్‌లో కేంద్ర సహాయ మంత్రిగా కూడా సేవలందించారు. ఆర్టికల్‌ 370 రద్దు అయిన ఏడాది తర్వాత జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సిన్హా.. ఈ కేంద్ర పాలిత ప్రాంతం పాలనలో తనదైన ముద్ర వేశారు. విమర్శలు, వివాదాలతో అనేక సార్లు వార్తల్లో నిలిచారు. దీంతో, ఆయన పేరు కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది.మరోవైపు.. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా గత మూడేళ్లుగా ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ హయాంలో ఉన్న సమయంలో.. నియామకాల నుంచి వివాదాల వరకు నాటి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో విభేదించి తరచూ వార్తల్లో నిలిచారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఓటమికి ఎల్జీతో వివాదం కూడా ఓ కారణమైంది. దీంతో ఆయన కేంద్రం దృష్టిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి పదవికి సక్సేనా వైపు మొగ్గుచూపే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉప రాష్ట్రపతి ఎవరు అనే ఉత్కంఠ నడుస్తోంది.

Heavy Rain Forecast To Telangana4
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు దంచికొడుతున్నాయి. కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం విశాఖపట్నం సమీపంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తులో కొనసాగుతోంది. మరో ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్‌గడ్‌ పరిసర ప్రాంతాల్లో ఏర్పడింది. వీటి ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు చోట్ల అతి భారీ నుంచి, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.తెలంగాణ మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేసింది.It's 2:30AM & Just Pouring here in #Jeedimetla 🌧️💥 #Hyderabadrains pic.twitter.com/v1kjMHiWEK— Hyderabad Rains (@Hyderabadrains) July 22, 2025 రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరించింది. ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, పెద్దపల్లి జిల్లాలకు అలర్ట్‌ విధించింది. అలాగే, ఆరు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ విధించగా.. మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఇక, మంగళవారం వికారాబాద్‌ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. మద్గుల చిట్టెంపల్లిలో 8.3 సెం.మీ, ధారూర్‌లో 8 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.దయచేసి అప్రమత్తంగా ఉండండి, లోతట్టు ప్రాంతాల నుండి తక్షణమే ఖాళీ చేయండి ⚠️⚠️ములుగు, వరంగల్ బెల్ట్ అంతటా తీవ్రమైన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వెంకటాపురంలో 136మి.మీ నమోదై, రానున్న గంటలలో 200మి.మీ వర్షపాతం కూడా సులువుగా దాటబోతోంది ⚠️⚠️⛈️⛈️⚠️రానున్న 12 గంటల్లో, 150-200… https://t.co/YvS6t8kNjo— Telangana Weatherman (@balaji25_t) July 22, 2025మరోవైపు.. ఏపీలో మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గంటకు 40నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు విస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అనేక చోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. అదేవిధంగా దక్షిణకోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 🔴 LPA to form near NAP will give Severe rainfall over Telugu states 👇Precipitation forecast for July 21 - 27 (🔴 Very heavy - isol.ext rains ; 🟠 Heavy - very heavy rains ; 🟡 Mod/heavy rains ; 🟢 Light/Mod showers) #Chennairains #TelanganaRains #HyderabadRains #VizagRains 🌧🌧 https://t.co/752rIj72bQ pic.twitter.com/Reviw3e2wW— MADRAS WEATHERMAN (R G Prasad) 🇮🇳 (@Chennaiclimate) July 20, 2025

India Clinch ODI Series In England With 2-15
IND Vs ENG: ఇంగ్లండ్‌ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత జట్టు.. సిరీస్‌ కైవసం

చెస్టర్‌ లీ స్ట్రీట్‌: ఇంగ్లాండ్‌లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. ఇంగ్లండ్‌ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్‌ చేజిక్కించుకున్న జోష్‌లో వన్డే సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. మంగళవారం జరిగిన ఆఖరి మూడో వన్డేలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (102; 84 బంతుల్లో 14×4) మెరుపు శతకానికి క్రాంతి గౌడ్‌ (6/52) సూపర్‌ బౌలింగ్‌ తోడవడంతో భారత్‌ 13 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. 319 పరుగుల టార్గెట్‌ ఛేదనలో ఇంగ్లాండ్‌ 49.5 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది.వన్డే సిరీస్‌లో నిర్ణయాత్మక మూడో వన్డే మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోగా.. ఓపెనర్లు స్మృతి మంధాన (45), ప్రతీక రావల్‌ (26) తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించారు. ఇద్దరూ కొద్ది తేడాలో ఔటయ్యారు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (84 బంతుల్లో 102; 14 ఫోర్లు) మెరుపు శతకంతో చెలరేగింది. ప్రతీక అవుటయ్యాక వచ్చిన హర్లీన్‌ డియోల్‌ (45; 4 ఫోర్లు) కూడా నింపాదిగా ఆడటంతో భారత్‌ స్కోరు సాఫీగా సాగిపోయింది. టాపార్డర్‌ బ్యాటర్లు ఔటయ్యే సమయానికే భారత్‌ 162/3 స్కోరు వద్ద పటిష్టస్థితిలో నిలిచింది.Harmanpreet kaur ne lambe samay bad century banai pic.twitter.com/lecFzHE5Nl— Rosesh (@roseshpoet) July 22, 2025కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్‌ (50; 7 ఫోర్లు) క్రీజులోకి వచ్చాక స్కోరులో వేగం పెరిగింది. ఇద్దరు చకచకా పరుగులు చక్కబెట్టే పనిలో సఫలమయ్యారు. బౌండరీలతో ధాటిని ప్రదర్శించారు. దీంతో హర్మన్‌ 54 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. 41వ ఓవర్లోనే జట్టు స్కోరు 200 దాటింది. అనంతరం జెమీమా 44 బంతుల్లో అర్ధసెంచరీ సాధించింది. కానీ అదేస్కోరు వద్ద ఆమె ఆట ముగియడంతో నాలుగో వికెట్‌కు 110 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అర్ధసెంచరీ తర్వాత హర్మన్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో రెండో ఫిఫ్టీని చేసేందుకు కేవలం 28 బంతులే అవసరమయ్యాయి. తద్వారా 82 బంతుల్లోనే ఆమె సెంచరీ పూర్తయ్యింది.What a spell by Kranti Gaud to bag a maiden 6️⃣-wicket haul 🙌Watch #ENGWvINDW 3️⃣rd ODI - LIVE NOW on #SonyLIV & Sony Sports Network. pic.twitter.com/3lhu0QURWC— Sony LIV (@SonyLIV) July 22, 2025వన్డేల్లో హర్మన్‌కిది ఏడో సెంచరీ..వన్డేల్లో హర్మన్‌ప్రీత్‌కు ఇది ఏడో సెంచరీ కాగా... మిథాలీ రాజ్, స్మృతి మంధాన తర్వాత 4000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత బ్యాటర్‌గా ఘనతకెక్కింది. స్కోరు పెంచే క్రమంలో హర్మన్‌ నిష్క్రమించగా... ఆఖర్లో రిచా ఘోష్‌ (18 బంతుల్లో 38 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేసింది. దీంతో భారత్‌ 300 పైచిలుకు స్కోరును చేయగలిగింది. 318 పరుగుల భారీ స్కోరు చేసింది. తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు.. 49.5 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో నాట్‌ సీవర్‌ (98; 105 బంతుల్లో 11×4) గొప్పగా ఆడినా.. ఇంగ్లాండ్‌ను గెలిపించలేకపోయింది. ఎమ్మా లాంబ్‌ (68), అలిస్‌ (44) రాణించారు.Shree Cha𝐑𝐀𝐍𝐈 coming in clutch with a crucial wicket 🙌Watch #ENGWvINDW 3️⃣rd ODI - LIVE NOW on #SonyLIV & Sony Sports Network. pic.twitter.com/udQ9BO5JK0— Sony LIV (@SonyLIV) July 22, 2025

TDP MLA kolikapudi srinivasa rao Hulchul At Police Station6
తిరువూరులో పీఎస్‌లో కొలికపూడి హల్‌చల్‌.. పోలీసులకే ఝలక్‌!

సాక్షి, ఎన్టీఆర్: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పోలీసు స్టేషన్‌లో హల్‌చల్‌ చేశారు. పోలీసులే గంజాయి అమ్మిస్తున్నారని ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపించారు. గంజాయి అ‍మ్మకాలకు కొమ్ముకాస్తున్నారంటూ పోలీసులపై మండిపడ్డారు. దీంతో, పోలీసుల వ్యవహారం, ఎమ్మెల్యే వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.వివరాల ప్రకారం.. ఇద్దరు టీడీపీ కార్యకర్తలు సాయి సుమిత్‌, రామకృష్ణ మధ్య మంగళవారం ఘర్షణ జరిగింది. దీంతో ఇద్దరు పచ్చ పార్టీ కార్యకర్తలను తిరువూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, వీరిలో ఎంపీ వర్గానికి చెందిన సాయి సుమిత్‌ను పోలీసులు వదిలేశారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే కొలికపూడి వర్గానికి చెందిన రామకృష్ణపై పోలీసులు సెక్షన్‌-307 కింద కేసు పెట్టారు. అయితే, ఈ ఘర్షణ తర్వాత రామకృష్ణ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ కావడంతో పోలీసులు.. అతని తల్లి రాఘవమ్మ, సోదరి వరలక్ష్మీలను స్టేషన్‌కు తీసుకువచ్చారు.ఇక, ఇదే సమ​యంలో తిరువూరు పోలీసు స్టేషన్‌లో ఓ సెటిల్‌మెంట్‌ కోసం టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి వెళ్లారు. ఈ సందర్బంగా రామకృష్ణ కుటుంబ సభ్యులను చూసిన కొలికపూడి.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రామకృష్ణపై దాడి చేసిన వారిని స్టేషన్‌కు పిలిపించే వరకూ కదిలేది లేదంటూ హంగామా చేశారు. ఒక్కరిపైనే ఎలా కేసు పెడతారని ప్రశ్నించారు. అలాగే, పోలీసులే గంజాయి అమ్మిస్తున్నారని ఆరోపించారు. పోలీసులే గంజాయి అమ్మకాలకు కొమ్ము కాస్తున్నారంటూ స్టేషన్‌లో రచ్చ చేశారు. దీంతో, ఏం చేయాలో తెలియక పోలీసులు ఖంగుతిన్నారు.

crisp summary of JLL India latest real estate insights for H1 20257
రూ.కోటిలోపు ఫ్లాట్ల అమ్మకాలు డీలా

దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో రూ.కోటిలోపు ధర కలిగిన అపార్ట్‌మెంట్ల (ఫ్లాట్లు) అమ్మకాలు 32 శాతం తగ్గిపోయాయి. ఇదే కాలంలో ప్రీమియం అపార్ట్‌మెంట్లలో అమ్మకాలు 5 శాతం పెరిగాయి. రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2025 జనవరి–జూన్‌ కాలంలో ఏడు ప్రధాన నగరాల్లో 1,34,776 అపార్ట్‌మెంట్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలోని అమ్మకాలతో పోల్చి చూస్తే 13 శాతం తగ్గాయి.రూ.కోటి ధరలోపు అపార్ట్‌మెంట్ల విక్రయాలు మాత్రం 32 శాతం తగ్గి 51,804 యూనిట్లుగా ఉన్నాయి. రూ.కోటికి పైన ధర శ్రేణిలోని అపార్ట్‌మెంట్ల అమ్మకాలు 6 శాతం పెరిగి 82,972 యూనిట్లుగా నమోదయ్యాయి. హైదరాబాద్‌తోపాటు ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌), ఢిల్లీ ఎన్‌సీఆర్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణె నగరాల్లో అమ్మకాలపై జేఎల్‌ఎల్‌ ఇండియా నివేదిక విడుదల చేసింది. అపార్ట్‌మెంట్ల గణాంకాలు మినహా విల్లాలు, రోహౌస్‌లు ఇతర ఇళ్ల విక్రయాలు ఇందులో లేవు. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో మొత్తం అపార్ట్‌మెంట్ల అమ్మకాల్లో రూ.కోటికి పైన ధరలోనివి (ప్రీమియం) 62 శాతంగా ఉండడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే కాలంలో వీటి అమ్మకాలు మొత్తం విక్రయాల్లో 51 శాతంగా ఉన్నాయి. రూ.కోటిలోపు ఇళ్ల విక్రయాల వాటా 49 శాతం నుంచి 38 శాతానికి తగ్గింది.ఇదీ చదవండి: భద్రత తక్కువ.. ప్రచారం ఎక్కువపెరుగుతున్న కొనుగోలు సామర్థ్యం.. ‘లగ్జరీ ఇళ్ల అమ్మకాలు స్థిరంగా వృద్ధి చెందడం కొనుగోలు పెరుగుతున్న సామర్థ్యం, మెరుగైన జీవన ఆకాంక్షలకు నిదర్శనం. ప్రీమియం ప్రాపర్టీల పట్ల పెరుగుతున్న దృష్టి మాస్‌ హౌసింగ్‌ విభాగంలో కార్యకలాపాలకు ప్రాధాన్యం తగ్గుతోంది’ అని జేఎల్‌ఎల్‌ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త సమంతక్‌ దాస్‌ తెలిపారు.

Tanushree Dutta Breaks Down And Crying Video8
నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు.. హీరోయిన్ ఆవేదన

ఒకప్పటి హీరోయిన్ తనుశ్రీ దత్తా మరోసారి వార్తల్లో నిలిచింది. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ చాలా ఆవేదనతో ఓ వీడియోని పోస్ట్ చేసింది. తన ఇంట్లోనే తనని వేధిస్తున్నారని.. ఈ బాధ తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ప్లీజ్ ఎవరైనా వచ్చి సాయం చేయండి అంటూ అభ్యర్థించింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.'నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు. పోలీసులకు ఫోన్ చేస్తే.. స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. రేపో, ఎల్లుండో పోలీసుల దగ్గరకు వెళ్తాను. గత నాలుగైదేళ్ల నుంచి ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. నా ఇల్లంతా చిందరవందరగా అయిపోయింది. పనివాళ్లని పెట్టుకుంటే వాళ్లొచ్చి నా వస్తువుల్ని దొంగలిస్తున్నారు. నా ఇంట్లోనే నాకు భద్రత లేకుండా పోయింది. ఎవరైనా వచ్చి కాస్త నాకు సాయం చేయండి' అని ఏడుస్తూ తనుశ్రీ దత్తా వీడియో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: పవన్‌ వ్యాఖ్యలు.. ట్రెండింగ్‌లో #BoycottHHVM)బిహార్‌కి చెందిన తనుశ్రీ దత్తా.. 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ విజేతగా నిలిచింది. కానీ 'ఆషిక్ బనాయా అప్నే' పాటతో ఈమెకు చాలా గుర్తింపు వచ్చింది. తెలుగులోనూ 2005లో 'వీరభద్ర' అనే మూవీ చేసింది. తమిళంలోనూ 2010లో తీరదు విలాయాట్టు పిళ్లై అనే చిత్రంలో నటించింది. ఇవి తప్పితే 2013 వరకు హిందీలోనే పలు చిత్రాలు చేసింది. తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది.అయితే 2018లో మీటూ(#Metoo) ఉద్యమంలో భాగంగా ప్రముఖ నటుడు నానా పటేకర్‪‌పై సంచలన ఆరోపణలు చేసింది. తనని లైంగికంగా వేధించాడని చెప్పుకొచ్చింది. ఈ కేసులో పటేకర్‌కి క్లీన్ చిట్ దక్కింది. మరోవైపు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సైతం తనని ఓ సినిమా కోసం నగ్నంగా డ్యాన్స్ చేయమని అడిగాడని గతంలో ఆరోపణలు చేసింది. ఇప్పుడు మాత్రం తన ఇంట్లోనే తనకు వేధింపులు ఎ‍క్కువయ్యాయని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: మహేశ్, సుకుమార్‌‌ని ఫిదా చేసిన హిందీ సినిమా.. ఏంటి దీని స్పెషల్?) View this post on Instagram A post shared by Tanushree Dutta Miss India Universe (@iamtanushreeduttaofficial)

Donald Trump Says us and Japan Reach Trade Deal9
జపాన్‌తో భారీ వాణిజ్య ఒప్పందం.. ట్రంప్‌ కీలక ప్రకటన

వాషింగ్టన్: జపాన్‌తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసక్తికర ప్రకటన చేశారు. టోక్యో తమతో వాణిజ్య ఒప్పందానికి అంగీకరించిందని, దీని ప్రకారం జపాన్ వస్తువులపై అమెరికా 15 శాతం సుంకం విధిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. గతంలో ఈ ఒప్పందానికి జపాన్‌ అంగీకరించకపోతే ఆగస్టు ఒకటి నుండి 25 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.జపాన్‌తో ఒప్పందంపై ట్రంప్ మాట్లాడుతూ అమెరికా, జపాన్‌లు పరస్పరం 15 శాతం ఒప్పందపు రేటుతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయన్నారు. ఈ ఒప్పందం ప్రకారం తన ఆదేశాల మేరకు జపాన్.. అమెరికాలో 550 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుందని, ఫలితంగా ఆ దేశం 90 శాతం లాభాలను పొందుతుందని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తాము జపాన్‌తో ఒక భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, బహుశా ఇప్పటివరకు అమెరికాతో ఆ దేశం చేసుకున్న అతిపెద్ద ఒప్పందం ఇదేనని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో రాశారు. Donald J. Trump Truth Social :We just completed a massive Deal with Japan, perhaps the largest Deal ever made. Japan will invest, at my direction, $550 Billion Dollars into the United States, which will receive 90% of the Profits. This Deal will create Hundreds of Thousands of… pic.twitter.com/GBIUPiey6z— Markets Today (@marketsday) July 23, 2025అయితే ఈ పెట్టుబడులకు సంబంధించిన వివరాలను ట్రంప్‌ వెల్లడించలేదు. కానీ ఈ ఒప్పందం లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని ట్రంప్‌ తెలియజేశారు. కార్లు, ట్రక్కులు, బియ్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యానికి గేట్లు తెరుచుకుంటాయని, ఇకపై అమెరికాకు జపాన్ 15 శాతం పరస్పర సుంకాలను చెల్లిస్తుందన్నారు. ఆగస్టు ఒకటి వరకూ విధించిన గడువుకు ముందే వరుస ఒప్పందాలను కుదుర్చుకుంటామని గతంలో పేర్కొన్న ట్రంప్‌ ప్రస్తుతం అదేపనిలో తలమునకలై ఉన్నారు. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, బ్రిటన్ వియత్నాంతో ఇటీవలే ఒప్పందాలు పూర్తయ్యాయి. ఇప్పుడు జపాన్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరిందని ట్రంప్‌ ప్రకటించారు.

IAF to phase out MiG-21 fighter jets10
మిగ్-21.. ‘రష్యన్’ యుద్ధ విమానానికి వీడ్కోలు!

మిగ్-21 యుద్ధ విమానాలు.. ఇవి రష్యన్ ఫైటర్ జెట్స్. ఒకప్పుడు యుద్ధాల్లో భారత్ విజయానికి బాటలు పరిచిన మిగ్స్.. పిట్టల్లా నేల కూలి, ఎందరో పైలట్ల ప్రాణాలు తీసి ‘ఎగిరే శవపేటికలు’ గానూ అపకీర్తి మూటగట్టుకున్నాయి. 60 ఏళ్లపాటు మనల్ని కంటికి రెప్పలా కాపాడిన మిగ్-21 విమానాలు ఇక భారత నేలను ముద్దాడి ఈ మట్టిపైనే శాశ్వత విశ్రాంతి తీసుకోబోతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు కల్లా మిగ్-21 యుద్ధ విమానాలను విడతలవారీగా సేవల నుంచి తప్పించాలని, దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్ మార్క్-1ఎ’ను వాటి స్థానంలో మోహరించాలని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) భావిస్తోంది.భారత్ వద్ద ప్రస్తుతం 36 మిగ్-21లు ఉన్నాయి. వీటిలో చివరి వేరియంట్ అయిన ‘బైసన్’ను ఇప్పుడు సేవల నుంచి తొలగించనున్నారు. మనకు మిగ్-21 సేవలు 1963లో తొలిసారి ప్రయోగాత్మకంగా మొదలయ్యాయి. అప్పటినుంచి రష్యన్ సుఖోయ్ ఎస్యు-30 ఎంకేఐ యుద్ధ విమానాలు భారత్ చేతికి అందే వరకు కొన్ని దశాబ్దాల పాటు భారత వైమానిక దళానికి మిగ్-21 వెన్నెముకగా నిలిచింది. ఇంకా చెప్పాలంటే ఇటు రక్షణ పరంగానూ, అటు ప్రత్యర్థులపై దాడుల పరంగానూ మన వైమానిక దళానికి గగనతలంలో స్పష్టమైన ఆధిపత్యం కట్టబెట్టింది ఈ యుద్ధ విమానమే.సోవియట్ కాలంలో తయారీ!సోవియట్ యూనియన్ హయాంలో మికోయాన్-గురెవిచ్ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసిన మిగ్-21 ఫైటర్ జెట్ తొలిసారిగా రెక్కలు విప్పుకుని 70 ఏళ్ల క్రితం 1955లో ఆకాశంలో రివ్వున ఎగిరింది. శక్తిమంతమైన ‘తుమన్ స్కై ఆర్-25’ టర్బోజెట్ ఇంజిన్ సాయంతో ఈ విమానం ధ్వని వేగానికి రెండు రెట్ల పైబడిన వేగం అందుకుంటుంది. ఒకప్పుడు మన దేశంలో 900 దాకా మిగ్-21 ఫైటర్ జెట్స్ ఉండేవి. వాటిలో 660 విమానాలను నాటి ఒప్పందం మేరకు ఇండియాలోనే హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తయారుచేశారు.1965, 1971 సంవత్సరాల్లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధాల్లో, 1999లో కార్గిల్ యుద్ధంలో మిగ్-21 తనదైన ముద్ర వేసింది. 2019లో బాలాకోట్ (పాక్)లోని ఉగ్రవాదుల శిబిరాలపై జరిపిన దాడుల్లోనూ కీలక పాత్ర పోషించింది. మిగ్-21లో మూడో తరానికి చెందిన ‘మిగ్-21 బిస్’ను 1976లో మన వైమానిక దళంలోకి తీసుకున్నారు. ఇక రాడార్, ఏవియానిక్స్, ఆయుధ వ్యవస్థల పరంగా మరింత అధునాతనమైన ‘మిగ్-21 బైసన్’ వేరియంట్ వీటిలో చివరిది.మిగ్-21 బైసన్.. అరివీర ‘డాగ్ ఫైటర్’!నరాలు తెగే ఉత్కంఠ పుట్టించేలా రెండు యుద్ధ విమానాలు గగనతలంలో ఊహకందని విన్యాసాలతో అతి సమీపంగా ఒకదానికొకటి భీకరంగా తలపడుతూ రెండో దానిపై పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తే అది... ‘డాగ్ ఫైట్’! క్షిపణుల వంటి ఆధునిక ఆయుధాలు లేని తొలినాళ్లలో యుద్ధ విమానాలకు మెషీన్ గన్స్ ఉండేవి. శత్రు యుద్ధ విమానాన్ని కూల్చడం కోసం కాల్పులు జరపడానికి రెండో విమానం మొదటి దానికి బాగా దగ్గరగా వెళ్లాల్సి వచ్చేది.ఇలా రెండు విమానాలూ మెరుపు వేగంతో పైకీ, కిందికీ కదులుతూ, హఠాత్తుగా మలుపులు తీసుకుంటూ, ఒకదానికి మరొకటి చిక్కకుండా గిరికీలు కొడుతూ హోరాహోరీగా ‘డాగ్ ఫైట్’లో పాల్గొనేవి. మిగ్-21 బైసన్ గొప్ప ‘డాగ్ ఫైటర్. గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే ఆర్-73 క్షిపణులను దానికి అమర్చారు. ఆరితేరిన సుశిక్షిత పైలట్ దొరకాలే గానీ.. ప్రత్యర్థిపై మిగ్-21 బైసన్ వీరోచితంగా విరుచుకుపడుతుందనడంలో కించిత్ అతిశయోక్తి లేదు! 2004లో ‘కోప్ ఇండియా’ పేరిట భారత్, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి. అతి సమీప యుద్ధ విన్యాసాల సందర్భంగా అమెరికన్ ఎఫ్-15 ఫైటర్ జెట్స్ కంటే మిగ్-21 బైసన్ విమానాలు మెరుగ్గా రాణించి ఉత్తమ ప్రదర్శన కనబరిచాయి.కూలిన మిగ్స్ 400... 200 మంది పైలట్ల మృతి!చారిత్రకంగా భారత వైమానిక దళానికి ఎన్ని సేవలందించినా, ఎన్ని విజయాలు సాధించిపెట్టినా, దేశ భౌగోళిక ప్రాంతాన్ని ఎంత గొప్పగా పరిరక్షించినా మిగ్-21లకు ‘ఎగిరే శవపేటికలు’గా, ‘వితంతువుల సృష్టికర్త’ (Widow Maker)గా చెడ్డ పేరు మాత్రం తప్పలేదు. మన దేశంలో గత 60 ఏళ్లలో మిగ్-21 యుద్ధ విమానాలు కూలిపోయిన సంఘటనలు 400 దాకా ఉన్నాయి. 200 మందికి పైగా ఐఏఎఫ్ పైలట్లు, 60 మందికి పైగా పౌరులు ఆయా దుర్ఘటనల్లో మరణించారు. ఉద్దేశిత కాలం కంటే సుదీర్ఘ కాలంపాటు ఈ యుద్ధ విమానాలను సర్వీసులో ఉంచడంతో ఇటు భారీగా ప్రాణనష్టం సంభవించగా అటు జెట్స్ నిర్వహణ ఖర్చూ పెరిగిపోయింది.2023 మే మాసంలో ఓ మిగ్-21 విమానం బహ్లాల్ నగర్ (రాజస్థాన్) వద్ద సాంకేతిక లోపంతో కూలిపోవడంతో ముగ్గురు గ్రామస్థులు మరణించారు. ఆ దుర్ఘటనతో మన వైమానిక దళం మిగ్-21 శ్రేణి విమానాలన్నిటినీ గ్రౌండ్ చేసింది. ఇక వీడ్కోలు యాత్రలో భాగంగా స్క్వాడ్రన్-4కు చెందిన మిగ్-21 బైసన్ విమానం చివరిసారిగా 2023 అక్టోబరులో రాజస్థాన్ పట్టణమైన బార్మర్ గగనవీధుల్లో చక్కర్లు కొట్టింది. యూరప్ ఖండంలో చివరి మిగ్-21 గత ఏడాది క్రొయేషియాలో రిటైరైంది. మరో రెండు నెలల్లో మన దేశంలోనూ మిగ్-21 అధ్యాయం ముగియబోతుంది. మిగ్-29 యుద్ధ విమానాలకు కూడా 2027 నాటికి స్వస్తి పలకాలని ఐఏఎఫ్ భావిస్తోంది. - జమ్ముల శ్రీకాంత్.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement