కానిస్టేబుల్‌ను చంపేసిన ఉగ్రవాదులు ఖతం! | Three Militants killed in Encounter in Kulgam | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 22 2018 10:02 AM | Last Updated on Sun, Jul 22 2018 1:31 PM

Three Militants killed in Encounter in Kulgam - Sakshi

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఆదివారం ఉదయం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఉగ్రవాద మూకనే ఓ జమ్మూకశ్మీర్‌ కానిస్టేబుల్‌ను ట్రాప్‌ చేసి హతమర్చారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు రంగంలోకి దిగిన భద్రతా దళాలు ఆదివారం ఉదయం కుల్గామ్‌ జిల్లాలోని ఖుద్వానీ గ్రామంలో కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ గాలింపుల్లో ఉగ్రవాదులు ఎదురుపడటంతో వారికి, భద్రతా దళాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు హతమయ్యారు. ఇంకా ఆ ప్రాంతంలో భద్రతా దళాల ఆపరేషన్‌ కొనసాగుతోంది. కానిస్టేబుల్‌ మహమ్మద్‌ సలీంను ట్రాప్‌ చేసి.. చితహింసలు పెట్టి హతమార్చిన ఉగ్రవాదులను ఎరివేసే ఆపరేషన్‌ కొనసాగుతోందని, జమ్మూకశ్మీర్‌ పోలీసులు, ఆర్మీ, భద్రతా దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారని రాష్ట్ర డీజీపీ ఎస్పీ వైద్‌ ట్విటర్‌లో తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement