ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రదాడి
- జమ్ముకశ్మీర్‌లోని కృష్ణఘాటి సెక్టార్‌లో ఘటన
శ్రీనగర్: కల్లోల కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భారత సైన్యాన్ని టార్గెట్ చేసుకుని దాడికి పాల్పడ్డారు. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిలోని కుల్గామ్ సమీపంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారని, మనవాళ్లు కూడా ముష్కరులపైకి ఎదురుకాల్పులు జరిపారని ఆర్మీ అధికారులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని, దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియజేస్తామని అధికారులు చెప్పారు. తాజా సమాచారం ప్రకారం ఉగ్రదాడిలో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు.
పేట్రేగిన పాక్: ఉగ్రదాడి జరగడానికి కొద్ది నిమిషాల ముందు కృష్ణఘటి సెక్టార్‌లోని సరిహద్దు వెంబడి పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. అప్రమత్తమైన భారత బలగాలు.. పాక్‌కు గట్టి జవాబిచ్చాయని అధికారులు చెప్పారు.