కశ్మీర్లో మళ్లీ విరుచుకుపడ్డ ఉగ్రవాదులు
కశ్మీర్లో మళ్లీ విరుచుకుపడ్డ ఉగ్రవాదులు
Published Mon, Sep 26 2016 4:09 PM | Last Updated on Thu, Apr 4 2019 5:25 PM
ఉడి దాడి ఘటనతో 18మంది జవాన్లను బలిగొన్న ఉగ్రవాదులు సోమవారం దక్షిణ కశ్మీర్లో మళ్లీ విరుచుకుపడ్డారు. సెంట్రల్ సెక్యురిటీ ఫోర్స్పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి ఘటనలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయాల పాలయ్యారు. దక్షిణ శ్రీనగర్లోని 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుల్గామ్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్(సీఆర్పీఎఫ్) ప్రారంభించే రోడ్డు ఓపెనింగ్ పార్టీలో అనుమానిత మిలిటెంట్లు గ్రనేడ్తో దాడికి పాల్పడారని పోలీసులు పేర్కొన్నారు.
ఈ గ్రెనేడ్ టార్గెట్ కోల్పోయి, రోడ్డు పక్కకు పేలిందని చెప్పారు. ఈ ఘటనలో ఐదుగురు సీఆరీపీఎఫ్ జవాన్లు గాయాలు పాలయ్యారని, వారిని ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు వివరించారు. కశ్మీర్లో నెలకొన్న అల్లర్లకు కుల్గామ్ ప్రాంతం ఎక్కువగా ప్రభావితమైంది. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హన్ వనీ ఎనౌకౌంటర్ అనంతరం కశ్మీర్ లోయలో ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ అల్లర్లతో మరణించిన 90మందిలో ఎక్కువగా కుల్గామ్ ప్రాంతానికి చెందిన వారే.
Advertisement