J-K
-
కశ్మీర్లో మళ్లీ విరుచుకుపడ్డ ఉగ్రవాదులు
ఉడి దాడి ఘటనతో 18మంది జవాన్లను బలిగొన్న ఉగ్రవాదులు సోమవారం దక్షిణ కశ్మీర్లో మళ్లీ విరుచుకుపడ్డారు. సెంట్రల్ సెక్యురిటీ ఫోర్స్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి ఘటనలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయాల పాలయ్యారు. దక్షిణ శ్రీనగర్‌లోని 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుల్గామ్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్(సీఆర్పీఎఫ్) ప్రారంభించే రోడ్డు ఓపెనింగ్ పార్టీలో అనుమానిత మిలిటెంట్లు గ్రనేడ్‌తో దాడికి పాల్పడారని పోలీసులు పేర్కొన్నారు. ఈ గ్రెనేడ్ టార్గెట్ కోల్పోయి, రోడ్డు పక్కకు పేలిందని చెప్పారు. ఈ ఘటనలో ఐదుగురు సీఆరీపీఎఫ్ జవాన్లు గాయాలు పాలయ్యారని, వారిని ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు వివరించారు. కశ్మీర్లో నెలకొన్న అల్లర్లకు కుల్గామ్ ప్రాంతం ఎక్కువగా ప్రభావితమైంది. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హన్ వనీ ఎనౌకౌంటర్ అనంతరం కశ్మీర్ లోయలో ఈ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ అల్లర్లతో మరణించిన 90మందిలో ఎక్కువగా కుల్గామ్ ప్రాంతానికి చెందిన వారే. -
గొర్రెను వెతికేందుకు వెళ్ళి...
శ్రీనగర్ః గొర్రెను వెతికేందుకు వెళ్ళి.. అదృశ్యమైన ఇద్దరు కాశ్మీరీ అమ్మాయిలను.. పోలీసులు కనుగొన్నారు. దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలోని అనంతనాగ్ జిల్లాలో వారిద్దరి ఆచూకీ తెలియడంతో, వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఓ మైనర్ బాలిక సహా ఇద్దరు అమ్మాయిలు సోమవారం రాత్రి సమయంలో దక్షిణ కాశ్మీర్ అటవీ ప్రాంతంలో తప్పిపోయినట్లు వారి కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బాలికల ఆచూకీ కోసం రెండు రోజులుగా అడవుల్లో జల్లెడ పట్టిన పోలీసులు ఎట్టకేలకు అనంతనాగ్ జిల్లా ప్రాంతంలో బుధవారం రాత్రి... వారి ఆచూకీ కనుగొన్నారు. అనంతరం వారిద్దరినీ కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఇంటినుంచీ వెళ్ళిన 20, 16 ఏళ్ళ వయసున్న ఇద్దరు అమ్మాయిలు తిరిగి ఇంటికి రాలేదంటూ కుటుంబ సభ్యులు మంగళవారం పాల్నర్ అడవుల్లోని ఫల్గమ్ ప్రాంతంలో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బ్రై అష్ముగమ్ గ్రామానికి చెందిన ఆ ఇద్దరమ్మాయిలూ గొర్రెను వెతికేందుకు వెళ్ళి తప్పిపోయినట్లు పోలీసులు అధికారులు వెల్లడించారు.