శ్రీనగర్ః గొర్రెను వెతికేందుకు వెళ్ళి.. అదృశ్యమైన ఇద్దరు కాశ్మీరీ అమ్మాయిలను.. పోలీసులు కనుగొన్నారు. దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలోని అనంతనాగ్ జిల్లాలో వారిద్దరి ఆచూకీ తెలియడంతో, వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
ఓ మైనర్ బాలిక సహా ఇద్దరు అమ్మాయిలు సోమవారం రాత్రి సమయంలో దక్షిణ కాశ్మీర్ అటవీ ప్రాంతంలో తప్పిపోయినట్లు వారి కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బాలికల ఆచూకీ కోసం రెండు రోజులుగా అడవుల్లో జల్లెడ పట్టిన పోలీసులు ఎట్టకేలకు అనంతనాగ్ జిల్లా ప్రాంతంలో బుధవారం రాత్రి... వారి ఆచూకీ కనుగొన్నారు. అనంతరం వారిద్దరినీ కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
ఇంటినుంచీ వెళ్ళిన 20, 16 ఏళ్ళ వయసున్న ఇద్దరు అమ్మాయిలు తిరిగి ఇంటికి రాలేదంటూ కుటుంబ సభ్యులు మంగళవారం పాల్నర్ అడవుల్లోని ఫల్గమ్ ప్రాంతంలో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బ్రై అష్ముగమ్ గ్రామానికి చెందిన ఆ ఇద్దరమ్మాయిలూ గొర్రెను వెతికేందుకు వెళ్ళి తప్పిపోయినట్లు పోలీసులు అధికారులు వెల్లడించారు.
గొర్రెను వెతికేందుకు వెళ్ళి...
Published Thu, May 12 2016 1:48 PM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM
Advertisement