Traced
-
గన్నవరంలో అదృశ్యం.. కడపలో ప్రత్యక్షం
సాక్షి, కృష్ణా: దుబాయ్ నుంచి వచ్చిన మహిళ అదృశ్యం కేసులో మిస్టరీ వీడింది. సదరు మహిళను గుర్తించిన పోలీసులు ఆమె భర్తకు అప్పగించారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలానికి చెందిన దుర్గ కనిపించడం లేదంటూ ఆమె భర్త సత్యనారాయణ గన్నవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అతడి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో దుర్గను గుర్తించి ఆమె భర్త వద్దకు చేర్చారు. ఈ సందర్భంగా దుర్గ మాట్లాడుతూ.. ‘ఈ నెల 16న కువైట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాను. అయితే ఇండియాకి వచ్చే ముందు ఫోన్లో నాభర్త సత్యనారాయణతో గొడవ జరిగింది. ఇంటికి వెళ్లేందుకు భయపడి కడపలో ఉన్న నా చెల్లి వద్దకు వెళ్ళాను. పోలీసులు సాయంతో కడప నుంచి గన్నవరం పోలీస్ స్టేషన్‌కు వచ్చాను. నాకు,నా భర్తకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు’ అని తెలిపింది. (చదవండి: శ్రుతి కోసం అన్వేషణ) -
తల్లి ఒడి చేరిన చెన్నకేశవుడు
టెక్నాలజీ, పోలీసుల కృషితో దొరికిన కిడ్నాపర్లు వివాహేతర సంబంధాన్ని నిలుపుకునేందుకే బాలుడి కిడ్నాప్ అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు తిరుపతి క్రైం: ఈ నెల 14న తిరుమల శ్రీవారి ఆలయం ముందు గొల్లమండపం వద్ద కిడ్నాప్‌నకు గురైన చిన్నారి చెన్నకేశవులును డీఐజీ ప్రభాకర్‌రావు శనివారం తల్లిదండ్రులకు అప్పగించారు. ఆయన అర్బన్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమిళనాడు నామక్కల్ జిల్లా రాసిపురం తాలూకా సింగనందాపురం గ్రామం మెల్కొత్తూరుకు చెందిన ఎం. అశోక్ (24)కు, అదే జిల్లాలోని శాంతిమంగళం తాలూకా మల్లెవేపగుంటకు చెందిన పెరీస్వామి భార్య తంగే (24)తో పరిచయం ఏర్పడింది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. 2015లో తంగే భర్తతో గొడవపడి అశోక్‌తో పాటు బెంగళూరుకు వెళ్లిపోయింది. గత నెల 10వ తేదీ రాత్రి ఇద్దరు రైలు ఎక్కి తిరుపతికి వచ్చారు. శ్రీవారి మెట్టు నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. 14వ తేదీన ఉదయం 5.45 నిమిషాలకు గొల్లమండపం వద్ద చెన్నకేశవులును కిడా్నప్ చేసి బస్సులో తిరుపతికి వచ్చి ప్రైవేటు ద్వారా బెంగళూరు వెళ్లిపోయారు. వారం రోజులు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో అశోక్ తన తండ్రికి ఫోన్ చేసి తమకు మగబిడ్డ పుట్టాడని తెలిపాడు. వారి పిలుపు మేరకు సొంత ఊరుకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో చిన్నారి కిడ్నాప్‌పై పోలీసులు విస్తృతంగా ప్రకటనలు చేయడంతో ఆ విషయం గ్రామస్తులకు తెలిసింది. వారు భయపడి శుక్రవారం నామక్కల్ జిల్లా మేల్‌కుర్చి పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. అక్కడి పోలీసులు అర్బన్ జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. ఎస్వీ యూనివర్సిటీ సీఐ శ్రీనివాసులు అక్కడకు చేరుకుని బాబును, నిందితుల్ని తిరుపతికి తీసుకువచ్చారు. వివాహేతర సంబంధాన్ని నిలుపుకునేందుకే.. ఇద్దరు నిందితులు తమ వివాహేతర సంబంంధాన్ని నిలుపుకోవడంతోపాటు కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు లేకుండా కలుగకుండా ఉండేందుకు పన్నాగం పన్నారు. తమకు పిల్లలు ఉంటే తల్లిదండ్రులు దగ్గరకు తీసుకుంటారని, గ్రామస్తులు కూడా ఏమీ చేయరని భావించారు. పిల్లల కోసం అనాథాశ్రమాల్లో ప్రయత్నించారు. అక్కడ కుదరకపోవడంతో తిరుమలకు చేరుకుని బాలుడిని కిడ్నాప్ చేశారు. చిన్నారికి తల్లిపాలు ఇవ్వకపోవడం, తంగే ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడం, వాట్సాప్, పేస్‌బుక్‌లో వీరి చిత్రాలు రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అనుమానించి హెచ్చరించారు. దీంతో వారు చేసేది లేక పోలీసుల వద్ద లొంగిపోయారు. ఈ కేసును ఛేదించడంలో ఏఎస్పీ మురళీకృష్ణ, డీఎస్పీలు మునిరామయ్య, కొండారెడ్డి, సుధాకర్‌రెడ్డి, సీఐలు శ్రీనివాసులు, తులసీరామ్, వెంకటరవి, శరత్చంద్ర, భాస్కర్, సత్యనారాయణ, రామకృష్ణ, సిబ్బంది ఎంతగానో కృషి చేశారని డీఐజీ తెలిపారు. అదేవిధంగా సీసీ టీవీల కమాండెంట్ కంట్రోల్ రూమ్‌లు నిరంతరం కష్టపడడం వల్లే కిడ్నాప్ కేసును ఛేదించామన్నారు. ఈ కేసులో ప్రతిభ చూపిన ప్రతి ఒక్కరికీ డీజీపీ సాంబశివరావు ప్రత్యేక అభినందనలు తెలిపినట్టు డీఐజీ పేర్కొన్నారు. -
ఢాకా దాడి ఆయుధాలు దొరికాయ్!
బంగ్లాదేశ్ః ఢాకా కేఫ్ లో దాడికి ఉగ్రవాదులు వినియోగించిన ఆయుధాలను పోలీసులు గుర్తించారు. విదేశీయులే లక్ష్యంగా ఓ భారత యువతి సహా 22 మంది ని కిరాతకంగా హతమార్చిన టెర్రరిస్టులు.. దాడులకు వాడిన ఆయుధాలను కనుగొనడంలో తాము సఫలమైనట్లు బంగ్లాదేశ్ పోలీసులు వెల్లడించారు. ఆయుధాలద్వారా వాటిని సరఫరా చేసినవారిని గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీస్ ఇనస్పెక్టర్ జనరల్ ఏకేఎమ్ షహీదుల్ తెలిపారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా కేఫ్ దాడిలో ఉగ్రవాదులు దాడికి వినియోగించిన ఆయుధాలు అంత ఆధునికమైనవేమీ కాదని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయుధాలను కనుగొన్నామని, వాటిని సరఫరా చేసినవారిని త్వరలో అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, అందుకు ప్రజల సహాయాన్ని కూడా కోరినట్లు పోలీస్ ఇనస్పెక్టర్ జనరల్ ఏకేఎమ్ షహీదుల్ తెలిపారు. ఇప్పటికే దాడుల సూత్రధారులను గుర్తించి నిఘాలో ఉంచినట్లు షహీదుల్ తెలిపారు. 12 గంటలపాటు జరిగిన మారణహోమంపై సాధారణ ప్రజల్లో అవగాహన కల్పించి, వారి సహాయంతో తీవ్ర వాదాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దాడుల అనంతరం ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు తప్పించుకున్నవారి జాబితాను తయారు చేస్తున్నామని, నిర్థారణ అనంతరం వెల్లడిస్తామని చెప్పారు. ఇటీవలి దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులు దేశంలోని విద్యాసంస్థలకు చెందిన వారుగా గుర్తించడంతో.. విద్యా సంస్థలపైనా పూర్తి నిఘా పెట్టినట్లు హక్ తెలిపారు. అంతేకాక దాడి వెనుక అంతర్జాతీయ హస్తం ఏదైనా ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దాడి సందర్భంలో అప్రమత్తమైన భద్రతా దళాలు రెస్టారెంట్ ను చుట్టుముట్టి ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చి, ఒకరిని సజీవంగా పట్టుకున్న విషయం తెలిసిందే. హతమైన ఉగ్రవాదుల్లో ఒకరు వాయవ్య బోగ్రాలోని ఓ గ్రామానికి చెందిన మదర్సా విద్యార్థి అని, అతడే దాడికి సారథ్యం వహించినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఓ భారతీయ యువతి సహా 22 మంది మరణించడంతోపాటు, 30 మంది వరకూ గాయపడ్డ దాడికి తామే బాధ్యులమంటూ ఇస్లామిక్ స్టేట్ బృదం ఎమాక్ వార్తా సంస్థద్వారా అప్పట్లో వెల్లడించింది. అయితే ఉగ్రవాదులు ధరించిన దుస్తులను బట్టి దాడి వెనుక తీవ్రవాద సంస్థ జమాత్ ఉల్ హెజాహిదీన్ ఉన్నట్లు ప్రభుత్వం అనుమానిస్తోంది. -

ఢాకా దాడి ఆయుధాలు దొరికాయ్..!

గొర్రెను వెతికేందుకు వెళ్ళి...
శ్రీనగర్ః గొర్రెను వెతికేందుకు వెళ్ళి.. అదృశ్యమైన ఇద్దరు కాశ్మీరీ అమ్మాయిలను.. పోలీసులు కనుగొన్నారు. దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలోని అనంతనాగ్ జిల్లాలో వారిద్దరి ఆచూకీ తెలియడంతో, వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఓ మైనర్ బాలిక సహా ఇద్దరు అమ్మాయిలు సోమవారం రాత్రి సమయంలో దక్షిణ కాశ్మీర్ అటవీ ప్రాంతంలో తప్పిపోయినట్లు వారి కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బాలికల ఆచూకీ కోసం రెండు రోజులుగా అడవుల్లో జల్లెడ పట్టిన పోలీసులు ఎట్టకేలకు అనంతనాగ్ జిల్లా ప్రాంతంలో బుధవారం రాత్రి... వారి ఆచూకీ కనుగొన్నారు. అనంతరం వారిద్దరినీ కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఇంటినుంచీ వెళ్ళిన 20, 16 ఏళ్ళ వయసున్న ఇద్దరు అమ్మాయిలు తిరిగి ఇంటికి రాలేదంటూ కుటుంబ సభ్యులు మంగళవారం పాల్నర్ అడవుల్లోని ఫల్గమ్ ప్రాంతంలో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బ్రై అష్ముగమ్ గ్రామానికి చెందిన ఆ ఇద్దరమ్మాయిలూ గొర్రెను వెతికేందుకు వెళ్ళి తప్పిపోయినట్లు పోలీసులు అధికారులు వెల్లడించారు. -
భవ్యశ్రీ కథ సుఖాంతం!
హైదరాబాద్: హైదరాబాద్‌లో అదృశ్యమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ చరిత ఆచూకీ ఎట్టకేలకు లభించింది. ఆమె వైజాగ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసు ప్రత్యేక బృందాలు భవ్యశ్రీని హైదరాబాద్ తీసుకువచ్చారు. ఆదివారం మధ్యాహ్నం ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. రిలీఫ్ కోసమే తాను విశాఖ వెళ్లినట్లు భవ్యశ్రీ చెప్పారు. కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్న భవ్యశ్రీ ఈ నెల 9న అదృశ్యమైన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం ఆమె క్యాబ్‌లో డ్యూటీకి బయలుదేరి వెళ్లారు. ఆ తర్వాత ఆమె ఇంటికి తిరిగి రాలేదు. తన భార్య కనిపించడంలేదంటూ భవ్యశ్రీ భర్త కార్తీక్ చైతన్య కూకట్పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. చివరకు విశాఖలో ఉన్నట్లు తెలుసుకొని, అక్కడకు వెళ్లి ఆమెను ఇక్కడకు తీసుకువచ్చారు. -
పాడేరులో భవ్యశ్రీ సెల్‌ఫోన్ సిగ్నల్!
విశాఖ : మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో అదృశ్యమైన సాప్ట్వేర్ ఇంజినీర్ భవ్యశ్రీ చరిత ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఆమె సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విశాఖ జిల్లా పాడేరు గెస్ట్‌హౌస్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతో పాడేరు గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న సైబరాబాద్ పోలీసులకు...రూమ్‌లో టీవీ ఆన్‌లో ఉన్నా ఆమె మాత్రం కనిపించలేదు. అయితే మీడియాలో వస్తున్న కథనాలతో అప్రమత్తమైన భవ్యశ్రీ అక్కడ నుంచి మరో చోటుకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. భవ్యశ్రీ మిస్సింగ్‌పై మీడియాలో కవరేజ్ విస్తృతంగా ఉండటంతో...ఆమె ఎప్పటికప్పుడు సమచారాన్ని తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా హైదరాబాద్ నుంచి వెళ్లిన ప్రత్యేక పోలీస్ బృందం ఆమె సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా కేసును ఛేదించే పనిలో పడ్డారు. అయితే భవ్యశ్రీ కేసు పురోగతి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. కాగా శుక్రవారం సాయంత్రం భవ్యశ్రీ ఫోన్ సిగ్నల్స్ అన్నవరం పరిసరాల్లోని సెల్‌టవర్ పరిధిని సూచించడంతో అక్కడి పోలీసులు అన్నవరంలో అన్ని లాడ్జీలు, దేవస్థాన వసతి గృహాల్లో తనిఖీ చేశారు. అయినా ఆమె ఆచూకీ తెలియరాలేదు. మధ్యలో ఆమె గోవా వెళ్లినట్లు కూడా అనుమానించారు. మరోవైపు మూడు రోజులైనా భవ్యశ్రీ ఆచూకీ లభించకపోవడంతో ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. -
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ ఆచూకి లభ్యం?
-
భవ్యశ్రీ 'అదృశ్య' మిస్టరీ వీడింది?
హైదరాబాద్: అదృశ్యమైన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భవ్యశ్రీ మిస్టరీ వీడినట్టు తెలుస్తోంది. మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా భవ్యశ్రీ ఆచూకీ పోలీసులకు లభ్యమైనట్టు తెలిసింది. తూర్పు గోదావరి జిల్లాలో భవ్యశ్రీ ఆచూకీని పోలీసులు కనుగొన్నట్టు సమాచారం. అయితే భవ్యశ్రీ ఆచూకీ లభ్యమైనట్టు పోలీసులు అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. అయితే భవ్యశ్రీ కుటుంబ సభ్యులు సాక్షికి వివరాలను అందించారు. కొద్దిసేపట్లో మీడియా సమావేశం ద్వారా అధికారికంగా వెల్లడిస్తామని కుటుంబ సభ్యులు అందించిన సమాచారం. గురువారం ఉదయం షేరింగ్ ఆటోలో తాను పనిచేసే కంపెనీకి భవ్యశ్రీ బయలుదేరి వెళ్లిందని ఆమె తల్లితండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కంపెనీ క్యాబ్ మిస్సవ్వడంతో భవ్యశ్రీ ఆటో ఎక్కింది. నిన్న ఆఫీసుకు రాలేదని కంపెనీ యాజమాన్యం తెలిపింది. అయితే భవ్యశ్రీ కాల్ డేటా ఆధారంగా పోలీసులు ఆమె ఆచూకీ తెలుసుకున్నట్టు తెలుస్తోంది.