
సాక్షి, కృష్ణా: దుబాయ్ నుంచి వచ్చిన మహిళ అదృశ్యం కేసులో మిస్టరీ వీడింది. సదరు మహిళను గుర్తించిన పోలీసులు ఆమె భర్తకు అప్పగించారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలానికి చెందిన దుర్గ కనిపించడం లేదంటూ ఆమె భర్త సత్యనారాయణ గన్నవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అతడి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో దుర్గను గుర్తించి ఆమె భర్త వద్దకు చేర్చారు. ఈ సందర్భంగా దుర్గ మాట్లాడుతూ.. ‘ఈ నెల 16న కువైట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాను. అయితే ఇండియాకి వచ్చే ముందు ఫోన్‌లో నాభర్త సత్యనారాయణతో గొడవ జరిగింది. ఇంటికి వెళ్లేందుకు భయపడి కడపలో ఉన్న నా చెల్లి వద్దకు వెళ్ళాను. పోలీసులు సాయంతో కడప నుంచి గన్నవరం పోలీస్ స్టేషన్‌కు వచ్చాను. నాకు,నా భర్తకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు’ అని తెలిపింది. (చదవండి: శ్రుతి కోసం అన్వేషణ)